Inspirational Story: రూ. 2.9 కోట్ల అమెరికా ఉద్యోగాన్ని కాదనుకుని, కాన్పూర్‌లో కిరాణా షాప్ పెట్టుకున్నాడు ఓ ఐఐటీ బాంబే గోల్డ్ మెడలిస్ట్. అతనే వివేక్ శర్మ. తను తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు?
రూ. 2.9 కోట్ల అమెరికా జాబ్ రిజెక్ట్ చేశాడు.. సక్సెస్ అంటే ఇదేనా?
ప్రతి సంవత్సరం వేలాది మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఐఐటీలో సీటు సాధించాలని, విదేశాల్లో కోట్ల రూపాయల ప్యాకేజీతో సెటిల్ అవ్వాలని కలలు కంటారు. చాలా మందికి ఇదే అసలైన సక్సెస్. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక రియల్ స్టోరీ లైఫ్ అంటే కేవలం బోర్డ్‌రూమ్స్, డాలర్లు మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువే అని నిరూపిస్తోంది.
ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్ వివేక్ శర్మ కథే దీనికి నిదర్శనం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఇచ్చిన 240,000 డాలర్ల (సుమారు రూ. 2.9 కోట్లు) వార్షిక ప్యాకేజీ ఆఫర్‌ను అతను సున్నితంగా తిరస్కరించాడు. దీనికి కారణం మరేదో పెద్ద ఉద్యోగం కాదు, కేవలం తన తల్లిదండ్రులు మాత్రమే.
25
త్యాగాలతోనే ఐఐటీ కల నిజం
కాన్పూర్‌కు చెందిన ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో వివేక్ జర్నీ మొదలైంది. తండ్రి రైల్వే క్లర్క్‌గా పని చేసేవారు, తల్లి ట్యూషన్లు చెబుతూ ఇంటి ఖర్చులకు సాయపడేది. కొడుకు చదువు కోసం ఆ తల్లిదండ్రులు తమ సర్వస్వాన్ని ధారపోశారు. వివేక్‌ను కోటాలో కోచింగ్‌కు పంపడం కోసం ఉన్న పొదుపు మొత్తాన్ని ఖర్చు చేశారు, నగలు కూడా అమ్మేశారు.
మొత్తానికి వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. వివేక్ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేయడమే కాకుండా గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. ఇక ఫైనల్ ఇయర్‌లో ఉండగానే శాన్ ఫ్రాన్సిస్కో స్టార్టప్ నుండి వీసా స్పాన్సర్‌షిప్, రీలోకేషన్ బెనిఫిట్స్‌తో కూడిన భారీ ఆఫర్ అతడిని వరించింది. కానీ, అంతలోనే సీన్ రివర్స్ అయింది.
35
అమెరికా వీసా క్యాన్సిల్.. ఎందుకంటే?
వివేక్ అమెరికాకు బయలుదేరడానికి కొద్ది రోజుల ముందే అతని తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అదే సమయంలో వాళ్ల అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. ఒక్కసారిగా ఆ కుటుంబంలో గ్లోబల్ కెరీర్ సంతోషం మాయమై, హాస్పిటల్స్, సర్జరీలు, కెమోథెరపీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు చేతికి వచ్చిన కోట్ల రూపాయల ఉద్యోగం, మరోవైపు ప్రాణ సమానమైన తల్లిదండ్రులు. కాలేజీ ప్లేస్‌మెంట్స్ నేర్పించని ఒక కఠినమైన పరీక్షను లైఫ్ అతనికి పెట్టింది.
వివేక్ ఏమాత్రం ఆలోచించకుండా ఇండియాలోనే ఉండిపోవాలని డిసైడ్ అయ్యాడు. తన వీసా ఇంటర్వ్యూను క్యాన్సిల్ చేసుకుని, ఆ భారీ ఆఫర్‌ను తిరస్కరించాడు. ఈ నిర్ణయం చూసి చాలా మంది విమర్శించారు, ఎమోషనల్ అయి లైఫ్ పాడు చేసుకుంటున్నావు అన్నారు. కానీ, వివేక్‌కు మాత్రం కంపెనీ కంటే పేరెంట్స్ ముఖ్యం అనిపించింది.
ఇండియాలో ఉండిపోయిన వివేక్, మొదట్లో కాన్పూర్‌లో ఒక లోకల్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాడు. అయితే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరగడంతో, తన ఇంటి కిందనే శర్మ జనరల్ స్టోర్ పేరుతో ఒక చిన్న కిరాణా దుకాణాన్ని స్టార్ట్ చేశాడు. ఐఐటీ బాంబే గోల్డ్ మెడలిస్ట్ కిరాణా కొట్టు నడపడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోయారు.
కానీ ఆ కష్టకాలంలో ఆ స్టోరే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచింది. మెల్లగా వాళ్ల అమ్మ హెల్త్ ఇంప్రూవ్ అయింది, తండ్రి ఆరోగ్యం కూడా కుదుటపడింది. కిరాణా షాప్ చూసుకుంటూనే, వివేక్ పేద పిల్లలకు కోడింగ్ నేర్పించడం మొదలుపెట్టాడు. రాత్రి వేళల్లో ఫ్రీలాన్స్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ చేసేవాడు.
55
తిరిగి వెతుక్కుంటూ వచ్చిన కంపెనీ
కొన్నేళ్ల తర్వాత, వివేక్ స్టోరీ అతను గతంలో రిజెక్ట్ చేసిన అదే ఇంటర్నేషనల్ కంపెనీకి తెలిసింది. ఈసారి ఆ కంపెనీ అతడిని అమెరికా రమ్మనకుండా, కాన్పూర్ నుంచే రిమోట్ పద్ధతిలో ఒక ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం పని చేయాలని కోరింది. అలా వివేక్ తన ఊరు వదలకుండానే టెక్నాలజీ, టీచింగ్, ఫ్యామిలీ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సక్సెస్ అంటే కేవలం జీతాలు, హోదాలు, ఫారిన్ లైఫ్ మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఫ్యామిలీ పక్కన నిలబడటమే నిజమైన విజయం అని వివేక్ నిరూపించాడు. "మా పేరెంట్సే నా బిగ్గెస్ట్ కంపెనీ" అంటూ అతను చెప్పిన మాటలు ఇప్పుడు లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంటున్నాయి.