Cleanest Railway Stations in India : ఈ రైల్వే స్టేషన్ల నుండి ప్రయాణమంటే అదో కొత్త అనుభూతి. అక్కడి పరిశుభ్రతను చూస్తుంటే ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంత చక్కని రైల్వే స్టేషన్లు ఏవో తెలుసా?
Indian Railway : రైలు ప్రయాణమంటేనే చాలామంది భయపడిపోతుంటారు... రద్దీ ఎక్కువగా ఉండటంతో స్టేషన్లు, రైళ్లు చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారిపోతాయి. అన్నీ కాదు కొన్ని రైల్వే స్టేషన్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది... కనీసం నిలబడలేని పరిస్థితి ఉంటుంది. పట్టాలపైనే కాదు ప్లాట్ ఫారంపైనా ప్లాస్టిక్ కవర్లు, తినగా మిగిలిన ఆహార పదార్థాలు, పాన్ పరాగ్ తిని ఉమిసిన మరకలు... ఇలా ఎక్కడాలేని చెత్తంతా రైల్వే స్టేషన్ల వద్దే కనిపిస్తుంది.
ఇదంతా ఒకప్పటి సంగతి... ఇప్పుడు భారతీయ రైల్వే అంటే పరిశుభ్రతకు మారుపేరులా మారిందని ప్రభుత్వం చెబుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ చొరవతో సరిగ్గా పదేళ్ల కిందట (2015) ''స్వచ్చ రైల్, స్వచ్చ భారత్'' కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) చేపట్టిన సర్వేలో టాప్ 5 లో నిలిచిన రైల్వే స్టేషన్లు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.
26
1. జైపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ (రాజస్థాన్)
రాజస్దాన్ లోని జైపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత పరిశుభ్రమైనదిగా గుర్తింపు పొందింది. రాజస్థాన్ రాజధానిలో ఈ స్టేషన్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది... కానీ రైల్వే పారిశుద్ద్య సిబ్బంది ఉత్తమ పనితీరుతో ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉంటుంది. అధునాతన డిజైన్, పర్యావరణ హిత చర్యలు, అద్భుతమైన మెయింటెనెన్స్ జైపూర్ స్టేషన్ ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
ఈ స్టేషన్ లో విద్యుత్ అవసరాల కోసం సోలార్ ఎనర్జీని ఉపయోగిస్తున్నారు. ఇక వాటర్ రిసైక్లింగ్, ప్లాస్టిక్ టు డీజిల్ ప్లాంట్స్, ఫ్రీ వైఫై, ఎల్ఈడి లైటింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇలా ఎప్పుడూ పరిశుభ్రతతో మెరిసిపోయే జైపూర్ రైల్వే స్టేషన్ ఇతర స్టేషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది... ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తోంది.
36
2. రాణి కమలాపతి (భోపాల్)
మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ అత్యంత పురాతనమైనది. 2021 లో ఈ రైల్వే స్టేషన్ ని అత్యాధునిక సదుపాయాలతో పునరుద్దరించారు. ఇది ప్రస్తుతం ప్రైవేట్ నిర్వహణలో ఉంది.. ప్రపంచస్థాయి మౌలికసదుపాయాలతో కూడిన ఈ స్టేషన్ విమానాశ్రయాన్ని తలపిస్తుంది. అత్యంత పరిశుభ్రంగా ఉండే ఈ స్టేషన్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
జోధ్ పూర్ రైల్వే స్టేషన్ కూడా బ్రిటీష్ పాలనలో ఏర్పాటయ్యింది... 1885 లో ప్రారంభించారు. ప్రస్తుతం ఇది నార్త్ వైస్టర్న్ రైల్వే జోన్ కింద వస్తోంది... ఇక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సంస్కరణలు చేపట్టారు. ఈ రైల్వే స్టేషన్ నిర్వహణ విషయంలో చాలా పకడ్బందీగా ఉంటారు సిబ్బంది... అందుకే ఇది అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ గా మారింది.
56
4. విజయవాడ రైల్వే స్టేషన్ (ఆంధ్ర ప్రదేశ్)
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన నగరం విజయవాడ... ఇక్కడి నుండి రాకపోకలు సాగించేందుకు 1888 లో రైల్వే స్టేషన్ ఏర్పాటుచేశారు. అప్పటినుండి ఈ స్టేషన్ గుండా నిత్యం అనేక రైళ్లు పరుగు తీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టేషన్ లో 10 ప్లాట్ పామ్ లు, 24 ట్రాక్ లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ నుండి తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలకే కాదు ఇతర రాష్ట్రాలకు రైళ్ళు నడుస్తాయి. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ల జాబితాలో విజయవాడకు కూడా చోటు దక్కింది.
66
5. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యకలాపాలు ఈ సికింద్రాబాద్ నుండే సాగుతాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని అతిపెద్ద రైల్వే స్టేషన్... అందుకే నిత్యం ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉంటుంది. కానీ రైల్వే సిబ్బంది ఉత్తమ పనితీరుతో సికింద్రాబాద్ స్టేషన్ దేశంలోనే పరిశుభ్రమైనదిగా గుర్తించబడింది. ఈ స్టేషన్ ను ప్రపంచస్థాయి సౌకర్యాలతో పునర్నిర్మాణం చేస్తున్నారు.