Top 5 Biggest Airports in India : భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మన హైదరాబాద్ లోనే ఉంది. ఇలా దేశంలో టాప్ 5 బిగ్గెస్ట్ విమానాశ్రయాలు ఏవి? ఎన్ని వేల ఎకరాల్లో ఉన్నాయి? ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
Biggest Airports in India : ఇటీవల ఇండిగో సంక్షోభం తర్వాత విమానయాన రంగం ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఏది అనేదాని నుండి అదిపెద్ద విమానాశ్రయం ఏది అనేదాక చర్చ సాగుతోంది. అయితే ఇండిగో సంక్షోభం ముగిసి యధావిధిగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి... దీంతో విమానయాన సంస్థలపై చర్చ ముగిసింది. కానీ విమానాశ్రయాలపై చర్చ మాత్రం సాగుతోంది. ఈ క్రమంలో తెలుగోళ్లను ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది... దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మన హైదరాబాద్ దే అట.
హైదరాబాద్ విమానాశ్రయం ఎన్నివేల ఎకరాల్లో విస్తరించి ఉంది..? దేశంలో టాప్ 5 బిగ్గెస్ట్ ఎయిర్ పోర్ట్స్ ఏవి..? రద్దీపరంగా చూసుకుంటే ఏ విమానాశ్రయం పెద్దది? ఇలాంటి ఆసక్తికర సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
26
1. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Hyderabad Airport)
సాధారణంగా హైదరాబాద్ విమానాశ్రయాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గా పిలుస్తారు. గతంలో నగర నడిబొడ్డున గల బేగంపేట విమానాశ్రయం విస్తరణకు అవకాశం లేకపోవడంతో హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో కొత్తది నిర్మించారు. PPP మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పద్దతిలో నిర్మించిన మొదటి ఎయిర్ పోర్ట్ ఇదే. ప్రముఖ నిర్మాణరంగ సంస్థ GMR, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. ఇది ఏకంగా 5,500 ఎకరాల్లో విస్తరించి ఉంది.
36
2. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (New Delhi Airport)
దేశ రాజధాని న్యూడిల్లీలోని ఈ విమానాశ్రయం విస్తీర్ణం పరంగా రెండో స్థానంలో ఉంది... కానీ రద్దీపరంగా చూసుకుంటే టాప్ లో ఉంటుంది. దేశ పాలన ఇక్కడినుండే సాగుతుండటంతో నిత్యం దేశవిదేశాలకు చెందిన నాయకులు, వ్యాపారులు న్యూడిల్లీ విమానాశ్రయంలో దిగుతుంటారు. అలాగే వివిధ పనులకోసం సామాన్య ప్రజలు కూడా ఎక్కువగా డిల్లీకి వెళుతుంటారు. ఇలా ఏటా 3 కోట్లకంటే ఎక్కువమంది డిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి రాకపోకలు సాగిస్తుంటారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
న్యూడిల్లీ విమానాశ్రయం 5,106 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ విమానాశ్రయంలో రద్దీ రోజురోజుకు పెరుగుతుండటంతో డిల్లీ శివారులోని నోయిడాలో మరో భారీ విమానాశ్రయాన్ని ఏర్పాటుచేశారు. ఇది త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
3. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Bengaluru Airport)
బెంగళూరు నగరాన్ని నిర్మించిన రాజు కెంపే గౌడ పేరుమీద ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటుచేశారు. బెంగళూరు శివారులో దేవనహళ్లి ప్రాంతంలో ఉంటుంది... ఇది 4000 ఎకరాల్లో విస్తరించి ఉంది. విస్తీర్ణం పరంగా మూడో స్థానంలో ఉన్నా రద్దీపరంగా రెండో స్థానంలో ఉంటుంది ఈ కెంపేగౌడ ఎయిర్ పోర్ట్. దేశంలోనే పూర్తిగా సౌర శక్తితో నడిచే మొట్టమొదటి విమానాశ్రయం బెంగళూరుదే.
56
4. మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం, MOPA (Goa Airport)
భారత మాజీ రక్షణ మంత్రి, గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ గౌరవార్థం ఈ విమానాశ్రయానికి ఈ పేరు పెట్టారు. ఇది 2,132 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది గోవాలోని రెండో అంతర్జాతీయ విమానాశ్రయం... 2023 లో ప్రారంభించారు. దీన్ని కూడా హైదరాబాద్ ఎయిర్ పోర్టును నిర్మించిన GMR సంస్థే నిర్మించింది... GMR గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిలెడ్ (GGIAL) నిర్వహణా బాధ్యతలు చూసుకుంటోంది.
66
5. దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Goa Airport)
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే (1955) గోవాలో ఈ దబోలియా విమానాశ్రయాన్ని ఏర్పాటుచేశారు.. ఇది 1700 ఎకరాల్లో విస్తరించి ఉంది. అయితే నిత్యం గోవాను వేలాదిమంది పర్యాటకులు సందర్శిస్తుంటారు... ఇందులో దేశవిదేశాల చెందినవారు ఉంటారు. అందువల్లే ఈ పాత దబోలియా ఎయిర్ పోర్ట్ స్థానంలో అత్యాధునిక సౌకర్యాలతో మనోహర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టును నిర్మించారు.