World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!

Published : Dec 24, 2025, 01:40 PM IST

World's Smallest Railway : ప్రపంచంలోని చాలా దేశాలు వేలాది కిలోమీటర్ల రైల్వే నెట్ వర్క్ కలిగివున్నాయి. ఇందులో భారత్ కూడా ఒకటి. కానీ ఓ దేశం కిలోమీటర్లు కాదు కేవలం కొన్ని మీటర్ల రైల్వే వ్యవస్థను మాత్రమే కలిగివుంది. ఆ దేశమేదో తెలుసా?

PREV
15
ప్రపంచంలోనే అతిచిన్న రైల్వే నెట్ వర్క్...

World Smallest Railway : ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్స్ కలిగిన దేశాల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అమెరికా అతిపెద్ద రైల్వే వ్యవస్థ కాగా ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. భారతదేశం 1,35,207 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ కలిగివుంది. ఇలా అతిపెద్ద రైల్వే నెట్ వర్స్క్ సంగతి సరే... మరి ప్రపంచంలో అతి చిన్న రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశమేది..? అంటే చాలామందికి తెలియదు. కేవలం కొన్ని మీటర్ల దూరమే రైల్వే వ్యవస్థను కలిగిన ఓ దేశం ఉంది... దీని ప్రత్యేకతల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

25
ఈ దేశంలో కేవలం 300-400 మీటర్ల దూరమే రైల్వే వ్యవస్థా..!

ప్రపంచంలో అతి చిన్నదేశం వాటికన్ సిటీ... వైశాల్యం పరంగానే కాదు జనాభా పరంగానూ చిన్నదేశం. ఇక్కడే అత్యంత చిన్న రైల్వే వ్యవస్థ ఉంది. ఈ దేశ రైల్వే నెట్ వర్క్ పొడవు 862 మీటర్లు మాత్రమే... అంటే సుమారుగా 300-400 మీటర్ల దూరమే ఈ దేశంలో రైలు నడుస్తుంది.

జర్మనీలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం రోమ్... ఇక్కడే వాటికన్ సిటీ ఉంది. ఇక్కడ జనాభా కూడా కేవలం 800 నుండి 1000 మంది లోపే ఉంటుంది... వీరంతా పురుషులే... ఇందులో ఎక్కువమంది క్రైస్తవ మత బోధకులే. ఇక్కడ మహిళలు ఉండరు. ఈ దేశ రైల్వే నెట్ వర్క్ జర్మనీ రైల్వేతో అనుసంధానం అయివుంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే నెట్ వర్క్ గా వాటికన్ సిటీ రైల్వే వ్యవస్థ గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది.

35
భారతదేశంలో అతి చిన్న రైల్వే రూట్ ఏది..?

భారతదేశంలో కొన్ని రైల్వే రూట్స్ వేల కిలోమీటర్ల దూరం ఉన్నాయి... కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రయాణించే రైళ్లు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో అతి తక్కువ రైల్వే రూట్ కలిగిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేశంలోనే అతి చిన్న రైల్వే రూట్ మహారాష్ట్రలో ఉంది. నాగ్ పూర్ నుండి అజ్ని మధ్య కేవలం 3 కిలోమీటర్ల దూరమే రైల్వే ట్రాక్ కలిగివుంది... ఈ ప్రయాణానికి పట్టే దూరం కేవలం 9 నిమిషాలు మాత్రమే. అంటే ఓ రైలు ప్రయాణం కేవలం 10 నిమిషాల్లోపు ముగుస్తుందన్నమాట.

45
భారతదేశంలో అతిచిన్న రైల్వే స్టేషన్ ఏది?

లక్ష కిలోమీటర్లకు పైగా రైల్వే నెట్ వర్క్ కలిగిన భారతదేశంలో పెద్దపెద్ద రైల్వే స్టేషన్లే కాదు అతి చిన్న రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇలా దేశంలోనే అతిచిన్న రైల్వే స్టేషన్ ఒడిషాలో ఉంది. కింయోంఘర్ ప్రాంతంలోని బన్స్ పానీ రైల్వే స్టేషన్ ఇండియాలోనే అత్యంత చిన్నది... ఇక్కడ కేవలం 200 మీటర్ల పొడవుతో ఒకే ఒక ప్లాట్ పార్మ్ ఉంటుంది. ఇది ప్రయాణికులకే కాదు సరుకు రవాణాకు ఉపయోగపడుతుంది.

55
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది?

ప్రపంచంలో అతి పెద్ద రైల్వే స్టేషన్ అమెరికాలో ఉంది... న్యూయార్క్ రాష్ట్రంలోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ రైల్వే స్టేషన్ ఏకంగా 67 రైల్వే ట్రాక్ లను కలిగివుంది. ఈ స్టేషన్లో 44 ఫ్లాట్ ఫామ్స్ కలిగివుంటాయి. ఈ రైల్వే స్టేషన్ నుండి నిత్యం 1.25 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు.

భారతదేశంలో అతిపెద్ది రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ లోని హౌరా. ఈ రైల్వే స్టేషన్ లో 23 ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. రద్దీపరంగా చూసుకున్నా ప్రపంచంలోని టాప్ స్టేషన్లలో నిలుస్తుంది ఈ హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడినుండి నిత్యం 7.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories