Investment Tips : ఈ 3 చోట్ల ఎంత ఖర్చు చేసినా పర్లేదు.. డబ్బు డబుల్ అవుతుంది!

Published : Jun 26, 2026, 06:03 PM IST

డబ్బును వృథాగా ఖర్చు చేయకూడదనేది నిజమే. కానీ తెలివిగా ఆలోచించి సరైన చోట్ల పెట్టుబడి పెడితే, అది మన జీవితాన్ని సుసంపన్నం చేసి సంతోషాన్ని ఇస్తుంది. మరి ఏయే విషయాలపై ధైర్యంగా డబ్బు ఖర్చు పెట్టవచ్చో చూద్దాం.

PREV
14
ఈ మూడు చోట్ల పెట్టుబడి పెట్టండి

డబ్బును కేవలం దాచుకోవడానికి మాత్రమే కాదని పెద్దలు చెబుతుంటారు. ఓ రూపాయి మరో రూపాయిని సంపాదిస్తుంది… ఇలాగే సంపద పెరిగేది. అయితే సరైన చోట పెట్టుబడి పెడితేనే డబ్బులు రెట్టింపయ్యేది… తొందరపాటుతో ఎక్కడపడితే అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే బొక్కబోర్లా పడటం ఖాయం. అయితే ఓ మూడు విషయాలపై ఖర్చు చేసిన డబ్బు ఎప్పటికీ వృథా పోదు. పైగా ఏదో ఒక రూపంలో రెట్టింపు అయి మన దగ్గరికే తిరిగి వస్తుంది. ఇంతకీ ఆ మూడు సందర్భాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం. 

24
చదువుపై పెట్టుబడి పెట్టండి

విద్య కోసం ఖర్చు చేసిన డబ్బు ఎప్పటికీ వృథా కాదు. డబ్బు, ఆస్తి, ఇతర సంపదలు ఎప్పటికైనా కరిగిపోవచ్చు… కానీ జ్ఞానం ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, పుస్తకాలు చదవడానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి పెట్టే పెట్టుబడి.. భవిష్యత్తులో విజయానికి కొత్త దారులు వేస్తుంది. అందుకే విద్యను అత్యంత విలువైన పెట్టుబడిగా చాణక్యుడు పేర్కొన్నారు.

34
ధానధర్మాల కోసం ఖర్చు చేయండి

దానధర్మాల కోసం ఖర్చు చేసిన డబ్బు ఎప్పటికీ వృథా కాదు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కేవలం సామాజిక బాధ్యతే కాదు, మనలోని మానవతా విలువలను బలపరిచే సాధనం కూడా. ఇతరుల మేలు కోసం ఖర్చు చేసే డబ్బు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. జీవితంలో మంచి సంబంధాలు, సామరస్యానికి పునాది వేస్తుంది.

44
ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు చేయండి.

ఆరోగ్యాన్ని జీవితంలో అతిపెద్ద ఆస్తిగా భావించాలి. శరీరం ఆరోగ్యంగా లేకపోతే సంపద, హోదా, విజయం వల్ల కలిగే ఆనందం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. అందుకే పౌష్టికాహారం, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పెట్టే ఖర్చు.. భవిష్యత్తును భద్రపరిచే పెట్టుబడి లాంటిది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

Read more Photos on
click me!

Recommended Stories