Facts : కంప్యూటర్, ల్యాప్ టాప్ కీబోర్డులో అక్షరాలు ABCD ఆర్డర్‌లో ఎందుకుండవు? QWERTY క్రమంలో ఎందుకుంటాయి?

Published : Jun 26, 2026, 10:58 AM IST

మీరు కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ కీబోర్డు ను గమనిస్తే అక్షరాలు ABCD వరుస క్రమంలో ఉండవు… అక్కడొకటి ఇక్కడొకటి కనిపిస్తాయి. ఇలాంటి కీబోర్డును రూపొందించడం వెనక ఆసక్తికర స్టోరీ ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
కీబోర్డులో ABCD క్రమంలో కాకుండా QWERTY క్రమంలో అక్షరాలు ఎందుకుంటాయి?

ఈ టెక్ జమానాలో కంప్యూటర్ అంటే తెలియనివారు ఉండరు. పట్టణాలు, నగరాల్లోని ప్రజలకే కాదు మారుమూల పల్లెల్లోని వారికీ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు సుపరిచితమే. ఇక సాప్ట్ వేర్ ఇంజనీర్ల నుండి అకౌంటెంట్ల వరకు ఇప్పుడు ఉద్యోగులందరికీ ఈ కంప్యూటర్లపైనే పని... చివరకు చిన్న బట్టల షాపులు, రెస్టారెంట్స్ లో కూడా బిల్లింగ్ కు కంప్యూటర్లనే ఉపయోగిస్తున్నారు. అందుగలడిందు లేడని సందేహం వలదు అన్నట్లుగా అక్కడ ఇక్కడని కాదు అన్నిచోట్ల కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు కనిపిస్తున్నారు.

మీరు కూడా చదువు కోసమో లేక ఉద్యోగ పనుల కోసమో లేదా మరేదైనా సందర్భంలో కంప్యూటర్ ను ఉపయోగించి ఉంటారు. ఈ సమయంలో మీకు ఓ డౌట్ వచ్చివుండాలే... అసలు ఈ కీబోర్డుపై ABCD లు వరుస క్రమంలో ఎందుకు లేవు... ఇలా చిందరమందరగా అక్కడొకటి ఇక్కడొకటి పడేశారే... వరుసగా ఉంటే ఈజీగా టైప్ చేసుకునేవాళ్లం కదా? అని. ఈ డౌట్ ను ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. కంప్యూటర్, ల్యాప్ టాప్ కీబోర్డులలో అక్షరాలు ఆల్ఫబెటికల్ ఆర్డర్ (ABCD)లో కాకుండా QWERTY పద్ధతిలో ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం.

25
కీబోర్డులో ABCD క్రమాన్ని ఎందుకు మార్చారు?

ఇప్పుడంటే అడ్వాన్స్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు వచ్చాయిగానీ గతంలో ఏదైనా రాయాలంటే చేతితో రాయాల్సిందే లేదంటే టైప్ రైటర్స్ వాడాల్సిందే. అయితే పాతకాలం మెకానికల్ టైప్‌రైటర్లలో కీస్‌కు సన్నని మెటల్ రాడ్స్ (టైప్‌బార్స్) ఉండేవి. మనం టైప్ చేస్తున్నప్పుడు ఈ రాడ్స్ కదిలి, పేపర్‌పై అక్షరాలను ముద్రించేవి. ఇలా ఆరంభంలో వచ్చిన టైప్ రైటర్స్ లో ABCD క్రమంలోనే అక్షరాలు ఉండేవి. కానీ ఈ టైప్ రైటర్స్ పై టైపిస్టులు వేగంగా టైప్ చేస్తున్నప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తేవి. దీన్ని పరిష్కరించేందుకు అక్షరాల క్రమాన్ని మార్చారు... ABCD లను వరుసక్రమంలో కాకుండా QWERTY క్రమంలో అమర్చారు.

1860 సంవత్సరంలో క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ చేతితో రాసే పనిలేకుండా టైప్ రైటర్ ను కనిపెట్టాడు. అతడు మొదట రూపొందించిన టైప్ రైటర్ లో ABCD ఇలా వరుస క్రమంలోనే కీస్ ఉండేవి. అయితే ఇంగ్లీష్ భాషలో ఎక్కువగా ఉపయోగించే కొన్ని అక్షరాలు పక్కపక్కనే ఉండటం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తేవి... స్పీడ్ గా టైపింగ్ చేస్తున్నప్పుడు పక్కపక్కన అక్షరాలను వేగంగా నొక్కితే వాటి లోహపు కడ్డీలు (Typebars) ఒకదానికొకటి తగిలి ఇరుక్కుపోయేవి... దీంతో టైప్ రైటర్ జామ్ అయిపోయి పనిచేసేది కాదు... దీంతో పనులకు ఆటంకం కలిగేది. ఈ సమస్యను పరిష్కరించేందుకే కొత్త కీబోర్డ్ లేఅవుట్ అవసరం ఏర్పడింది.

35
QWERTY లేఅవుట్ ఎలా పుట్టింది?

టైప్ రైటర్ లో కీస్ అన్ని ABCD ఆల్పాబెట్స్ వరుస క్రమంలో ఉండటమే సమస్యకు కారణంగా క్రిస్టోఫర్ లాథమ్ షోల్స్ గుర్తించాడు. అందుకే ఈ అక్షరక్రమాన్ని మార్చాడు... ఇలా పుట్టిందే 'QWERTY' కీబోర్డ్. ఎక్కువగా వాడే అక్షరాల జతలను కీబోర్డులో వీలైనంత దూరంగా ఉంచడమే ఈ లేఅవుట్ ముఖ్య ఉద్దేశం. దీనివల్ల కీస్ ఒకదానికొకటి తట్టుకోవడం ఆగిపోయి, టైపిస్టులు వేగంగా టైప్ చేయగలిగారు... పని వేగంగా జరిగేది. ఉదాహరణకు 'A', 'S' లాంటి అక్షరాలను పక్కపక్కన కాకుండా దూరంగా పెట్టడంతో, వాటి రాడ్స్ ఇరుక్కుపోయే ప్రమాదం తగ్గింది. మోర్స్ కోడ్‌ను అనువదించే టెలిగ్రాఫ్ ఆపరేటర్లకు సులువుగా ఉండేలా కూడా ఈ QWERTY లేఅవుట్‌ను డిజైన్ చేశారని కొంతమంది నిపుణులు చెబుతారు.

45
QWERTY సాధించిన విజయం

షోల్స్ అండ్ గ్లిడెన్ టైప్‌రైటర్లలో QWERTY లేఅవుట్‌ను వాడిన తర్వాత, రెమింగ్టన్ కంపెనీ దీన్ని స్వీకరించి 1874లో మార్కెట్లోకి తెచ్చింది. ఇలా 1878లో వచ్చిన రెమింగ్టన్ నెం. 2 టైప్‌రైటర్ సూపర్ హిట్ అవ్వడంతో QWERTY లేఅవుట్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. రెమింగ్టన్ కంపెనీ కేవలం టైప్‌రైటర్లను అమ్మడమే కాకుండా, టైపింగ్ శిక్షణా తరగతులను కూడా నిర్వహించింది. దీంతో లక్షలాది మంది టైపిస్టులు QWERTY లేఅవుట్‌లోనే శిక్షణ పొందారు. ఇది ఒక స్టాండర్డ్‌గా మారిపోయింది.

55
టెక్నాలజీ మారినా కీబోర్డు ఎందుకు మారలేదు?

అయితే టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతూ ఎలక్ట్రిక్ కీబోర్డులు, కంప్యూటర్లు వచ్చాక కీబోర్డులో మెకానికల్ సమస్యలు పోయాయి… అయినా QWERTY లేఅవుట్ వాడకం మాత్రం ఆగలేదు. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అప్పటికే ఈ లేఅవుట్‌కు అలవాటు పడిపోవడమే. ఇప్పుడు కొత్త లేఅవుట్‌కు మారాలంటే మళ్లీ కొత్తగా నేర్చుకోవాలి. ఇది చాలా కష్టమైన పని. డ్వోరక్ (Dvorak) లాంటి మెరుగైన, సులభమైన కీబోర్డ్ లేఅవుట్‌లు వచ్చినా, అవి పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. యూజర్ల అలవాటు, అప్పటికే ఉన్న సెటప్ కారణంగా QWERTY లేఅవుట్ ఇప్పటికీ కంప్యూటర్ కీబోర్డులలో స్టాండర్డ్‌గా కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories