Last Indian Railway Station: మనదేశ చిట్టచివరి రైల్వే స్టేషన్ ఇదే.. ఇక్కడ నుంచి వేరే దేశం మొదలవుతుంది

Published : Jul 03, 2026, 11:08 AM IST

Last Indian Railway Station: మనదేశంలో ఇండియన్ రైల్వేస్ ప్రధానమైన రవాణా సంస్థ. ఎన్నో రైల్వేస్టేషన్లు భారతదేశంలో ఉన్నాయి. అయితే చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఎక్కుడుందో తెలుసా? ఆ స్టేషన్ తరువాత కొత్తదేశం ప్రారంభమవుతుంది. 

PREV
13
ఇదే చివరి రైల్వే స్టేషన్

భారతదేశంలో ప్రధాన రవాణా వ్యవస్థ ఇండియన్ రైల్వేస్. మనదేశంలో వందల సంఖ్యలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది మనదేశం చిట్టచివరి రైల్వేస్టేషన్. దీన్ని దాటితో వేరే దేశం మొదలైపోతుంది. ఈ రైల్వే స్టేషన్ దాటితే మన దేశ సరిహద్దు దాటి మరో దేశంలోకి అడుగుపెట్టినట్టే. అది పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఉన్న 'సింహాబాద్' రైల్వే స్టేషన్. ఇది భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో చివరి స్టేషన్. ఇక్కడ రైలు పట్టాలు ముగిసిన కొన్ని అడుగుల దూరంలోనే మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ సరిహద్దు మొదలవుతుంది.

23
ప్రయాణికులు లేని స్టేషన్

ఈ స్టేషన్ చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుంటే, సింహాబాద్ స్టేషన్ మాత్రం ఎంతో నిశ్శబ్దంగా కనిపిస్తుంది. ప్రయాణికులు ఒక్కరూ కూడా కనిపించరు. దేశ విభజన తర్వాత ఇక్కడ నుంచి ప్రయాణీకుల రైలు సేవలు పూర్తిగా నిలిపివేశారు. ఇక్కడ ఏ ప్యాసింజర్ రైలు ఆగదు. ఒకప్పుడు సందడిగా ఉండే ఈ స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు వెలవెలబోతూ కనిపిస్తాయి.

33
ఈ స్టేషన్ ప్రత్యేకత ఏమిటి?

సింహాబాద్ రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికీ ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి పాత గేర్లు, బారియర్లు వంటి పరికరాలు ఉంటాయి. రైల్వే ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ సాధారణ ప్రయాణికుల కోసం టికెట్ కౌంటర్లు ఎప్పుడో మూసేశారు. అయినప్పటికీ భౌగోళికంగా, రాజకీయంగా ఈ స్టేషన్ మాత్రం ఎంతో ముఖ్యమైనది.

Read more Photos on
click me!

Recommended Stories