First Petrol Bunk: ఇప్పుడు రోడ్డు మీదకెళ్తే చాలు ఎన్నో పెట్రోల్ బంకులు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకప్పటి పరిస్థితి వేరు. అసలు మన దేశంలో మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఏ నగరంలో మొదలైందో తెలుసా? అప్పట్లో పెట్రోల్ ను వాహనాల్లో ఎలా నింపేవారో తెలుసుకోండి.
ఇప్పుడు మనదేశంలో ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఒక పెట్రోల్ బంకు కనిపిస్తుంది. కొత్త సాంకేతికతతో నిమిషాల్లో వాహనాల్లో నింపేస్తున్నారు. కానీ వందేళ్ళ క్రితం మనదేశంలో పరిస్థితి వేరు. మొట్టమొదటి పెట్రోల్ బంకు మనదేశంలో 1928లో ముంబై నగరంలో ప్రారంభమైంది. బర్మషెల్ అని పిలిచే ఒక సంస్థ తొలి పెట్రోల్ బంకును ప్రారంభించింది. అప్పట్లో వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అప్పట్లో పెట్రోల్ బంక్ ఏర్పాటు అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఆ బర్మ షెల్ సంస్థ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గా మారిపోయింది.
24
చేత్తోనే పెట్రోల్ నింపేవారు
పెట్రోల్ బంకులు లేనప్పుడు ఇంధనాన్ని కొనుగోలు చేయడం సామాన్యులకు చాలా కష్టమైన పని. అప్పట్లో పెట్రోల్, డీజిల్ ను పెద్దపెద్ద డ్రమ్ములు లేదా టిన్ లలో నిల్వచేసి విక్రయించేవారు. వాహనదారులు తమ వాహనంలో వాటిని నింపుకోవడానికి ఏమాత్రం సౌకర్యంగా ఉండేది కాదు. అలాంటప్పుడే పెట్రోల్ బంకుల అవసరం వచ్చింది. అప్పట్లో ఆటోమేటిక్ మిషన్లతో పెట్రోల్ నింపే పరిస్థితి లేదు. ఇంధనాన్ని నింపడానికి సిబ్బంది పూర్తిగా తమ చేతులనే ఉపయోగించేవారు. ఇక ఎంత పెట్రోల్ ను వేసారో లెక్కించటానికి మెకానికల్ మీటర్ల పైనే ఆధారపడేవారు.
34
పెట్రోల్ ను చేత్తోనే కొలిచి
పెట్రోల్ బంక్ పెట్టిన మొదటి రోజుల్లో బర్మా షెల్ సంస్థకు కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ఇప్పుడంటే డిజిటల్ స్క్రీన్ ల మీద ధరలు, ఎన్ని లీటర్ల పెట్రోలు వేశారో స్పష్టంగా చూసే అవకాశం ఉంది. కానీ పందేళ్ళ క్రితం అలాంటివేవీ లేవు. దాంతో డబ్బులకు సరిపడా పెట్రోల్ పోసారో లేదో అన్న అనుమానం ప్రజల్లో ఎక్కువగా ఉండేది. దీంతో కస్టమర్లు తాము తీసుకుంటున్న పెట్రోల్ పరిమాణాన్ని వారి ముందే కొలిచేవారు. కస్టమర్లు తమ కళ్ళతోనే నేరుగా చూసేలా ప్రత్యేకమైన పరికరాలను తీసుకొచ్చారు. ఈ చిన్న మార్పు పెట్రోల్ బంకులపై ప్రజలను నమ్మకాన్ని పెంచడానికి పునాది వేసింది.
1928లో మొదలైన మొదటికి పెట్రోల్ బంక్ ఇప్పుడు మనదేశంలో కొన్ని వేల పెట్రోల్ బంకులుగా మారింది. ఇప్పుడు పెట్రోల్ బంకులు కేవలం ఇంధనాన్ని నింపే కేంద్రాలే కాదు.. దేశ ఆర్థిక అభివృద్ధికి చిహ్నాలుగా మారిపోయాయి. చేతితో ఆపరేట్ చేసిన పంపుల నుండి ఇప్పుడు ఏఐతో పని చేసే డిజిటల్ డిస్పెన్సర్ల వరకు మనం ప్రగతిని సాధించాము. ఒకప్పుడు కార్లు విలాసవంతమైన వస్తువులుగా ఉండేవి. ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాలు కూడా కార్లను కొంటున్నాయి. ఒకప్పుడు తొలి పెట్రోలు బంకునుండి మొదలైన మన దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్ ల వరకు విస్తరించింది.