Psychology: సాధారణంగా చాలామంది చూడడానికి శాంతంగా, మంచిగా కనిపిస్తారు. కానీ ఒక మనిషి నిజ స్వభావం అతను ఎదుర్కునే కొన్ని పరిస్థితుల్లో బయటపడుతుందని చెబుతున్నారు సైకాలజీ నిపుణులు. ఆ సందర్భాలేంటో, ఒక వ్యక్తి గురించి పూర్తిగా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం.
రోజువారీ జీవితంలో మనం చాలామందితో మాట్లాడుతాం, పని చేస్తాం, సంబంధాలు కొనసాగిస్తాం. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వారి నిజ స్వరూపం, ఆలోచనా విధానం, భావోద్వేగ నియంత్రణ బయటపడుతుంది. సైకాలజీ ప్రకారం మనిషి నిజ స్వరూపం బయటపడే 5 ముఖ్యమైన సందర్భాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
ఒత్తిడిలో ఉన్నప్పుడు
సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి స్ట్రెస్‌లో ఉన్నప్పుడు అతని సహజ స్వభావం బయటపడుతుంది. సాధారణంగా శాంతంగా ఉండే వ్యక్తి కూడా ఒత్తిడిలో కోపంగా మారవచ్చు లేదా భయపడవచ్చు. అదే సమయంలో కొంతమంది చాలా ప్రశాంతంగా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ తేడా వారి వ్యక్తిత్వాన్ని స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి నిజంగా ఎలా స్పందిస్తాడో తెలుసుకోవాలంటే అతను ఒత్తిడిలో ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనించడం ముఖ్యం.
36
లాభ నష్టాల్లో ఉన్నప్పుడు
మనిషి స్వభావం డబ్బుతో సంబంధించిన పరిస్థితుల్లో చాలా స్పష్టంగా బయటపడుతుంది. చిన్న లాభం కోసం సంబంధాలను మర్చిపోవడం, లేదా నిజాయతీగా నిలబడటం వంటివి వ్యక్తి విలువలను చూపిస్తాయి. డబ్బు వచ్చినప్పుడు లేదా పోయినప్పుడు ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి అతని నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు అతను ఎలా స్పందిస్తాడో అతని మానసిక స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. కొంతమంది విమర్శను సానుకూలంగా తీసుకుని తమను తాము మెరుగుపరుచుకుంటారు. కానీ మరికొందరు కోపంతో లేదా అసహనంతో స్పందిస్తారు. సైకాలజీ ప్రకారం విమర్శను ఎలా స్వీకరిస్తారో అదే వ్యక్తి మెచ్యూరిటీ స్థాయిని సూచిస్తుంది. ఇది వారి నిజమైన ఆత్మవిశ్వాసం, ఈగో స్థాయిని చూపిస్తుంది.
56
గెలుపు, ఓటమి
ఒక వ్యక్తి విజయం సాధించినప్పుడు అతను వినయంగా ఉంటాడా లేదా అహంకారంగా మారతాడా అనేది అతని నిజ స్వభావాన్ని తెలియజేస్తుంది. అలాగే ఓటమి వచ్చినప్పుడు బాధ్యత తీసుకుంటాడా లేదా ఇతరులను నిందిస్తాడా అనేది కూడా ముఖ్యమైన సూచన. సైకాలజీ ప్రకారం, నిజమైన వ్యక్తిత్వం విజయంలో కాదు, ఓటమిలోనే స్పష్టంగా కనిపిస్తుంది.
66
ఇతరులకు సహాయం చేయాల్సిన టైంలో
ఒక వ్యక్తి తనకు లాభం లేకపోయినా ఇతరులకు సహాయం చేస్తాడా లేదా అనేది అతని నిజమైన మనసును తెలియజేస్తుంది. కొంతమంది స్వార్థం లేకుండా సహాయం చేస్తారు, మరికొందరు కేవలం ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రమే స్పందిస్తారు. సైకాలజీ ప్రకారం, సహాయం చేసే తత్వం ఒక వ్యక్తి హృదయాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైన సంకేతం.