Earthquake: భూకంపాలు ఎప్పుడుపడితే అప్పుడు వచ్చే కంట్రీలు ఇవే.. ఈ దేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్త

Published : Jun 25, 2026, 11:37 AM IST

Earthquake: కొన్ని దేశాల్లో భూకంపాలు తరచూ వస్తుంటాయి. అలాంటి దేశాల్లోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దేశాలకు చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఏ దేశాల్లో భూకంపాలు వస్తాయో తెలుసుకోండి. 

PREV
14
భూకంపాలు ఎందుకు వస్తాయి?

భూమంతా ఒకే ముక్కగా ఉండదు. ఇది అనేక భారీ టెక్టానిక్ ప్లేట్లుగా విభజించి ఉంటుంది. ఈ ప్లేట్లు నిరంతరం చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రెండు ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొనడం, దూరం కావడం లేదా ఒకదానిపై మరొకటి జారడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భూమి లోపల భారీ ఒత్తిడి జరుగుతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అంటారు. భూకంపం కేంద్రం నుంచి వెలువడే శక్తి తరంగాల రూపంలో భూమి ఉపరితలపై ఉన్న భవనాలు, రహదారులు, వంతెనలు వంటి నిర్మాణాలపై ప్రభావం చూపిస్తుంది. అలాంటప్పుడు అవి ముక్కలవ్వడం జరుగుతుంది. సముద్ర అడుగున సంభవించే భారీ భూకంపాలు సునామీలకు కూడా కారణమవుతాయి.

24
ఈ దేశంలో జాగ్రత్త

ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశాల్లో జపాన్ మొదటి స్థానంలో ఉంటుంది. పసిఫిక్, ఫిలిప్పీన్, యూరేషియన్, ఉత్తర అమెరికన్ టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో జపాన్ ఉండటం దీనికి ప్రధాన కారణం. ఇండోనేషియా కూడా భూకంపాలు బాగా వచ్చే దేశం. ఇక్కడ అనేక అగ్నిపర్వతాలు ఉండటంతో పాటు పలు టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతం కావడం వల్ల తరచూ బలమైన భూకంపాలు వస్తుంటాయి. ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, పాపువా న్యూ గినియా వంటి దేశాలు కూడా ఇదే కారణంతో భూకంప ప్రమాదం అధికంగా కలిగి ఉన్నాయి. ఈ దేశాలన్నింటినీ కలిపి “పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్”గా పిలుచుకుంటారు.

34
ఆ దేశంలో భారీ భూకంపం

దక్షిణ అమెరికాలోని చిలీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం బారిన పడిన దేశంగా చెప్పుకుంటారు. 1960లో అక్కడ రిక్టర్ స్కేలుపై 9.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. మెక్సికో, పెరూ వంటి దేశాలు కూడా భూకంపాలకు తరచూ గురవుతుంటాయి. ఆసియాలో చైనా కూడా ప్రమాదకర దేశాల జాబితాలో ఉంది. జనాభా అధికంగా ఉండటం వల్ల అక్కడ సంభవించే భూకంపాలు భారీ ప్రాణనష్టానికి దారితీస్తుంటాయి. ఇటీవలి సంవత్సరాల్లో టర్కీ కూడా వరుస భూకంపాలతో ఇబ్బంది పడింది.

44
ఇక మనదేశంలో..

భారతదేశం కూడా భూకంపాల నుంచి పూర్తిగా సురక్షితం కాదు. భారతీయ టెక్టానిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతూ యూరేషియన్ ప్లేట్‌ను ఢీకొంటూ ఉంటాయి. అందుకే హిమాలయ ప్రాంతంలో భూకంపాల ప్రమాదం అధికంగా ఉంది. జమ్మూ-కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలు అత్యంత ప్రమాద ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలు కూడా భూకంప ముప్పును ఎదుర్కొంటున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో కోట్లాది మంది భూకంప ప్రమాద ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అందువల్ల భూకంప నిరోధక నిర్మాణాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రజల్లో అవగాహన పెంపు వంటి చర్యలు భవిష్యత్తులో నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories