Gold Hating Country: ఈ దేశంలో బంగారమంటేనే పడదు, గోల్డ్ జ్యూయలరీ వేసుకోవడం పెద్ద వింత

Published : Oct 08, 2026, 12:45 PM IST

Gold Hating Country: ఇప్పుడు బంగారం చాలా ఖరీదైపోయింది. కానీ ఒక దేశంలో మాత్రం బంగారానికి విలువ లేదు. ఎవరూ వేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఆ దేశంలో ఏ ప్రజలూ కూడా ఒంటి మీద బంగారంతో కనిపించరు. ఇంతకీ ఆ దేశం ఏదో తెలుసా?

PREV
13
ఈ దేశంలో గోల్డ్ జ్యూలయరీ వేసుకోరు

బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి! మన దేశంలో బంగారం అంటే సంపదకు గుర్తుగా భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారు ఆభరణాలు ధరించడం సాధారణం. అయితే ప్రపంచంలో ఒక ప్రాంతంలో మాత్రం బంగారాన్ని ఎక్కువగా ప్రదర్శించడం అంతగా నచ్చదు. అక్కడ ఖరీదైన వస్తువులు ధరించి తమ సంపదను చూపించడాన్ని కొందరు ఇబ్బందిగా భావిస్తారు. ముఖ్యంగా స్కాండినేవియా ప్రాంతంలోని కొన్ని దేశాల సంస్కృతిలో అందరూ సమానంగా ఉండాలనే భావనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

23
బంగారం ఉన్నా దాచుకోవడమే

ఇందుకు ‘లాఫ్ ఆఫ్ జాంటే’ అనే సామాజిక భావనను కారణంగా చెబుతారు. ఈ భావన ప్రకారం ఎవరూ తాము ఇతరుల కంటే గొప్పవాళ్లమని చూపించుకోకూడదు. డబ్బు, ఆస్తులు, ఖరీదైన వస్తువులు ఉన్నా వాటిని అందరి ముందు గొప్పగా చెప్పుకోవడం మంచిది కాదనే ఆలోచన అక్కడ కనిపిస్తుంది. అందుకే బంగారు గొలుసులు, ఖరీదైన గడియారాలు, భారీ ఆభరణాలు ధరించి తిరగడాన్ని కొందరు ఆర్భాటంగా చూస్తారు. అయితే దీన్ని ‘బంగారాన్ని అసలు ఇష్టపడరు’ అని అర్థం చేసుకోవడం సరికాదు. బంగారం అక్కడ కూడా ఉంటుంది. కానీ దాన్ని చూపించి తమ స్థాయిని చాటుకోవడమే నచ్చదు.

33
మనదేశంలోని పరిస్థితి

మన దేశంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బంగారాన్ని సంపదగా, భద్రతగా భావించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కొందరు భవిష్యత్ అవసరాల కోసం బంగారం కొనుగోలు చేస్తారు. మరికొందరు సంప్రదాయంగా ఆభరణాలు ధరిస్తారు. కానీ స్కాండినేవియన్ సంస్కృతిలో ‘నేను అందరికంటే గొప్ప’ అనే భావన కంటే సాధారణంగా ఉండటం, ఇతరులతో సమానంగా జీవించడం ముఖ్యమని భావిస్తారు. అందుకే బంగారాన్ని ప్రదర్శించే విషయంలో అక్కడి సంస్కృతి మనకు కాస్త భిన్నంగా కనిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories