ప్రతి ఏడాది మష్రూమ్ మేళా..
సోలన్‌కు మష్రూమ్‌లతో ఉన్న అనుబంధాన్ని మరో ప్రత్యేక కార్యక్రమం కూడా చాటిచెబుతోంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 10న జాతీయ మష్రూమ్ మేళా నిర్వహిస్తారు. డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, మష్రూమ్ సాగుదారులు, పరిశోధకులు, పరిశ్రమ ప్రతినిధులు హాజరవుతారు.
మేళాలో మష్రూమ్ సాగుకు సంబంధించిన ప్రదర్శనలు, సాగు పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు, నిపుణులతో చర్చలు ఉంటాయి. కొత్త సాంకేతికతలు, సాగులో వస్తున్న మార్పుల గురించి రైతులు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం మష్రూమ్ సాగు జరుగుతున్నప్పటికీ.. భారత్‌లో మష్రూమ్ సాగు అభివృద్ధి ప్రయాణంలో సోలన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 1960లలో ప్రారంభమైన సాగు ప్రయోగాల నుంచి నేటి పరిశోధనలు, రైతులకు శిక్షణ కార్యక్రమాల వరకు.. ఈ హిల్‌టౌన్ భారత మష్రూమ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.