ఆసియాలోనే అతిపెద్ద మసాలా మార్కెట్ మనదేశంలోనే ఉంది.. ఇక్కడ నుంచే అన్ని రాష్ట్రాలకు మసాలా దినుసులు

Published : Nov 02, 2026, 10:03 AM IST

బిర్యానీ, కూరలు ఏమి వండాలన్న కూడా మసాలా దినుసులు ఉండాలి. అయితే అతి తక్కువ ధరకే మసాలా దినుసులు దొరికే ప్రదేశం ఒకటుంది. ఆసియాలోనే అతి పెద్ద మసాలా మార్కెట్ ఢిల్లీలోనే ఉంది. ఆ మార్కెట్ గురించి తెలుసుకోండి.

PREV
13
అతిపెద్ద మసాలా మార్కెట్

మసాలా దినుసులు లేకుండా బిర్యానీ, కూరలు వండడం కుదరదు. వాటి ఖరీదు కొంచెం ఎక్కువ ఉంటాయి. అయితే ఆసియాలోనే అతి పెద్ద మసాలా మార్కెట్ మనదేశంలోనే ఉంది. ఆ మార్కెట్ ఢిల్లీలోని ఖారీ బావోలీ మార్కెట్. మన వంటింట్లో వాడే పసుపు, కారం, మిరియాలు, యాలకులు లాంటి మసాలాలు ఇక్కడ గుట్టలుగా కనిపిస్తాయి. ఎటు చూసినా రంగురంగుల మసాలా దినుసులు, వాటి ఘాటైన వాసనలు, కొనుగోలుదారుల సందడితో ఈ మార్కెట్ కళకళలాడుతుంది. పాత ఢిల్లీలో ఉన్న ఖారీ బావోలీ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మసాలా హోల్‌సేల్ మార్కెట్‌గా పేరుపొందింది. ఇక్కడ వందకు పైగా రకాల మసాలాలు అమ్ముతారు. టీ పొడి, ఎండు పండ్లు, బాదం, పప్పులు, వివిధ రకాల గింజలు కూడా లభిస్తాయి. దేశంలోని ఎన్నో ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి సరుకులు తీసుకొస్తారు. తరతరాలుగా వ్యాపారం చేస్తున్న కుటుంబాలు ఈ మార్కెట్‌లో కనిపిస్తాయి.

23
పాతకాలపు మసాలా మార్కెట్ ఇది

ఖారీ బావోలీ మార్కెట్ చరిత్ర మొఘల్ పాలన కాలంలో 17వ శతాబ్దానికి వెళ్తుంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఢిల్లీలో షాజహానాబాద్ నగరాన్ని నిర్మించిన కాలంలో ఈ ప్రాంతం వ్యాపార కేంద్రంగా ఎదిగింది. ఆయన కుమార్తె జహానారా బేగం 1650లో చాందినీ చౌక్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ప్రయాణికులు, వారి గుర్రాలు, ఒంటెలకు నీరు అందించే మెట్ల బావి ఉండేది. ఆ బావిలోని నీరు ఉప్పగా మారడంతో కాలక్రమంలో ఆ ప్రాంతం మసాలాల వ్యాపార కేంద్రంగా మారింది. ఖారీ బావోలీ అనే పేరుకు కూడా మెట్ల బావితో సంబంధం ఉంది. 1920ల నాటికి ఈ ప్రాంతం వీధిగా మారిపోయింది. నేటికీ ఈ మార్కెట్‌లో అడుగుపెడితే పాతకాలపు వ్యాపార సంప్రదాయాలు గుర్తుకొస్తాయి.

33
చాలా తక్కువ ధరకే మసాలాలు

ఈ మార్కెట్‌లో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మెంతులు, పసుపు, అల్లం, యాలకులు, ఎండుమిర్చి లాంటి ఎన్నో రకాల దినుసులు లభిస్తాయి. ఇక్కడి వ్యాపారంలో హోల్‌సేల్ అమ్మకాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ చాలా తక్కువ ధరకే మసాలాలు దొరుకుతాయి. గడోడియా మార్కెట్ ఈ వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా నిలుస్తోంది. 1917 నుంచి పనిచేస్తున్న పాత దుకాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మారుతున్న కాలానికి తగ్గట్టు కొందరు వ్యాపారులు ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఒకప్పుడు దూర ప్రాంతాలకు మసాలాలు చేరవేసిన వ్యాపార మార్గాలు, నేడు ప్రపంచ మార్కెట్లతో భారతదేశానికి సంబంధాలు పెంచుతున్నాయి. అందుకే ఖారీ బావోలీ మార్కెట్‌ను సందర్శిస్తే మసాలాల కొనుగోలుతో పాటు భారతదేశపు గొప్ప వ్యాపార చరిత్రను కూడా తెలుసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories