భారతీయ వంటకాల్లో ఉల్లిపాయకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంటింట్లో ప్రతికూరలోనూ భాగమయ్యే ఉల్లిపాయ, దేశీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలోనూ అత్యంత కీలకమైన పంటగా నిలుస్తోంది. అయితే భారతదేశంలో అత్యధికంగా ఉల్లిపాయలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉల్లిపాయల హోల్‌సేల్ మార్కెట్ ఎక్కడ ఉందో మీకు తెలుసా?
ఉల్లి ఉత్పత్తిలో రికార్డు
భారతదేశంలో ఉల్లి ఉత్పత్తిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో మొత్తం ఉత్పత్తి అయ్యే ఉల్లిపాయల్లో దాదాపు 40 శాతానికి పైగా వాటా ఒక్క మహారాష్ట్ర నుంచే వస్తుంది. ఇక్కడి అనుకూలమైన వాతావరణం, సారవంతమైన నేలలు, రైతుల నైపుణ్యం,ఆధునిక సాగు పద్ధతులు అధిక దిగుబడికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.