Vegetarian Village: మనదేశంలో ఒకే ఒక్క పూర్తి వెజిటేరియన్ గ్రామం.. మద్యం, మాంసం, గుడ్లు పూర్తిగా బ్యాన్

Published : Oct 21, 2026, 10:51 AM IST

Vegetarian Village: మనదేశంలోనే కాదు ఈ గ్రామం దేశంలోనే పూర్తి శాకాహార గ్రామం. ఇక్కడ మాంసం, గుడ్లు మాత్రమే కాదు ఉల్లి వెల్లుల్లి కూడ తినరు. ఇది ఎంతో ప్రత్యేకమైన గ్రామం . ఆ గ్రామం పేరు పాలిటానా.

PREV
13
పూర్తి వెజిటేరియన్ గ్రామం

భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, వింతైనా గ్రామాలు ఉన్నాయి. అలాంటి వింతైన గ్రామం గుజారాత్ లో ఉంది. ఇది పూర్తి శాకాహార గ్రామం. గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ జిల్లాలో కొలువుదీరిన పాలిటానా గ్రామం పూర్తి వెజిటేరియన్ విలేజ్ గా పేరు తెచ్చుకుంది.ఈ గ్రామం శత్రుంజయ కొండల కింద ఉంది. ఈ ప్రాంతం జైన మతస్థులకు పరమ పవిత్రమైన తీర్థయాత్ర స్థలం. ఇక్కడ కొండపై దాదాపు తొమ్మిది వందలకు పైగా పాలరాతి దేవాలయాలు అద్భుత శిల్పకళతో దర్శనమిస్తాయి. ఈ నేల ఆధ్యాత్మిక భావనలు, అహింసా సిద్ధాంతాలకు నిలయంగా మారింది. ప్రపంచంలోనే మాంసాహారాన్ని, జంతువధను అధికారికంగా చట్టబద్ధంగా పూర్తిగా నిషేధించిన మొదటి సంపూర్ణ శాకాహార ప్రాంతంగా ఈ పట్టణం చరిత్ర సృష్టించింది.

23
ఎప్పుడు నిషేధం విధించారు

2014వ సంవత్సరంలో ఈ ప్రాంత పవిత్రతను కాపాడేందుకు వందలాది మంది జైన మునులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపట్టారు. మూగజీవుల ప్రాణాలు తీసే కబేళాలను ఇక్కడ మూసివేయాలని, జంతు హింసను పూర్తిగా నిలిపివేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. వీరి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పాలిటానా మున్సిపల్ పరిధిలో జంతువులను చంపడం, మాంసం అమ్మడంపై సంపూర్ణ నిషేధం విధించింది. ఇక్కడ మాంసం మాత్రమే కాకుండా గుడ్ల అమ్మకాలను కూడా పూర్తిగా నిషేధించారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా మాంసాహారం విక్రయిస్తే కఠిన శిక్షలు, జరిమానాలు అమలు చేస్తున్నారు.

33
మద్యపాన నిషేధం

గుజరాత్ రాష్ట్రంలో మొదటి నుంచే మద్యపాన నిషేధం అమల్లో ఉంది. దీంతోపాటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పాలిటానాలో మద్యం, మాంసం రెండూ పూర్తిగా దొరకని ఏకైక ప్రాంతంగా మారింది. ఇక్కడి హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారుల వద్ద కేవలం స్వచ్ఛమైన శాకాహార భోజనం మాత్రమే లభిస్తుంది. ఉల్లి, వెల్లుల్లి కూడా వాడని సంప్రదాయ సాత్విక ఆహారానికి ఇక్కడ అధిక ప్రాధాన్యం ఇస్తారు. అహింసను కేవలం మాటల్లోనే కాకుండా నిజజీవితంలో ఆచరించి చూపుతూ, పాలిటానా నేడు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు, శాంతి కాముకులకు ఒక సరికొత్త ఆదర్శంగా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories