Snakes Village : ఈ ఊరంతా పాములే పాములు.. ప్రతి ఇంట్లో నాగుపాముల కోసమే ప్రత్యేక గది..!

Published : May 22, 2026, 07:05 PM IST

భారతదేశం వింతలు, విశేషాలకు నిలయం. ఇక్కడ కొన్ని ఊళ్లు కళలకు ఫేమస్ అయితే, మరికొన్ని వింత సంప్రదాయాలకు పెట్టింది పేరు. అలాంటి ఓ విచిత్రమైన ప్రాంతమే 'పాముల గ్రామం'. ఈ వింత విలేజ్ విశేషాలేంటో తెలుసుకుందాం.

PREV
15
ఇండియాలో పాములు గ్రామం...

సాధారణంగా మనకు పంట పొలాల్లోనో, రోడ్డు మీదో లేక ఇంటి పెరట్లోనో పాము కనిపిస్తే... వెన్నులో వణుకు పుడుతుంది. ప్రాణభయంతో పరుగులు తీస్తాం. కానీ మన దేశంలో ఒక గ్రామం ఉంది... అక్కడ మనుషులు, పాములు ఒకే ఇంట్లో కలిసి నివసిస్తాయి. అపరిచితులు ఎవరైనా ఆ ఊరిలోకి వెళ్తే.. ఇళ్లలో స్వేచ్ఛగా తిరుగుతున్న నాగుపాములను చూసి గుండె ఆగినంత పనవుతుంది. కానీ ఆ గ్రామస్తులకు మాత్రం అవి ఇంటి సభ్యులతో సమానం.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ఇలాంటి వింత గ్రామం మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ఉంది. పాములను ఇళ్లలోకి ఆహ్వానించే షేత్‌పాల్ (Shetpal) గ్రామం విలక్షణమైన సంప్రదాయానికి పెట్టింది పేరు. 

25
ఇంట్లో పాముల కోసం ప్రత్యేక గది..!

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఉన్న ఈ షేత్ పాల్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. ఇక్కడి ఇళ్లలో మనుషుల కోసం ప్రత్యేకంగా గదులు ఉన్నట్లే పాముల కోసం ప్రత్యేక స్థలాలు ఉంటాయి. దీనిని వారు 'దేవస్థానం' అని పిలుస్తారు.

గోడల మధ్యలో లేదా పైకప్పు కింద పాములు హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి, అవి ఇంట్లోకి రావడానికి వీలుగా చిన్నపాటి ఖాళీ ప్రదేశాలను వదులుతారు. ఇలా చేయడం వల్ల తమ కుటుంబానికి శుభం జరుగుతుందని గ్రామస్థుల నమ్మకం.

35
భయం లేని బంధం.. అద్భుత సహజీవనం..!

షేత్‌పాల్ గ్రామంలో నాగుపాములు కేవలం దేవాలయాలకో, పొలాలకో పరిమితం కాలేదు. అవి స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతుంటాయి, ఇళ్లలోకి వస్తుంటాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకుంటున్నా, పెద్దలు పనులు చేసుకుంటున్నా పాములు పక్కనే తిరుగుతూ ఉంటాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దశాబ్దాలుగా ఇక్కడ పాములు, మనుషులు కలిసి ఉంటున్నా.. ఇప్పటి వరకు పాము కాటు వల్ల ఎవరూ చనిపోయిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతుంటారు. ఈ అద్భుతమైన అనుబంధమే పర్యాటకులను కూడా ఆశ్చర్యపరుస్తుంది.

45
దైవస్వరూపంగా పాముల ఆరాధన..

ఈ గ్రామ ప్రజలకు నాగదేవతపై అపారమైన భక్తి. పాములను వారు కేవలం జంతువులుగా చూడరు, దైవస్వరూపాలుగా భావిస్తారు. నాగ పంచమి రోజున ఊరంతా పండగ వాతావరణం నెలకొంటుంది. పాములకు పాలు పోసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ గ్రామంలో పొరపాటున కూడా పామును చంపరు. పామును చంపడం లేదా హింసించడం పెద్ద పాపంగా, అపశకునంగా భావిస్తారు. ఒకవేళ ఏదైనా పాము మరణిస్తే, దానికి మనుషుల తరహాలోనే అంత్యక్రియలు నిర్వహించే సంప్రదాయం కూడా కొన్నిచోట్ల కనిపిస్తుంది.

55
పర్యాటక ఆకర్షణగా 'స్నేక్ విలేజ్'

ఈ వింత సాంప్రదాయం గురించి తెలుసుకున్న ప్రపంచవ్యాప్త పర్యాటకులు, పరిశోధకులు షేత్‌పాల్‌ను సందర్శిస్తుంటారు. మనుషులు, క్రూరమైన విషసర్పాలు ఇంత శాంతియుతంగా ఎలా కలిసి ఉంటున్నాయనేది నేటికీ ఒక అంతుచిక్కని రహస్యమే..!

ప్రకృతిని, అందులోని జీవరాశులను గౌరవిస్తే.. అవి కూడా మనకు హాని చేయవని చెప్పడానికి షేత్‌పాల్ ఒక సజీవ సాక్ష్యం. భయం కంటే భక్తి, నమ్మకం గొప్పవని ఈ 'పాముల గ్రామం' నిరూపిస్తోంది. మీకు కూడా సాహసాలు యాత్రలు ఇష్టమయితే లేదా విభిన్న సంస్కృతుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మహారాష్ట్రలోని షేత్‌పాల్‌ను సందర్శించాల్సిందే…

Read more Photos on
click me!

Recommended Stories