Railways Rules: చాలామంది రకరకాల కారణాలతో అప్పుడప్పుడు ట్రైన్ మిస్ అవుతుంటారు. మరి రిజర్వ్ డ్ టికెట్ ఉన్నప్పుడు ట్రైన్ మిస్ అయితే ఏం చేయాలి? ఆ టికెట్‌తో మరో ట్రైన్ ఎక్కొచ్చా? లేదా రిఫండ్ వస్తుందా? రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి? వంటి విషయాలు చూద్దాం.
ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలు ఎక్కొచ్చా?
చాలామంది ప్రయాణికులకు సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో ఒకటి ట్రైన్ మిస్ కావడం. ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం, ఆలస్యంగా స్టేషన్‌కు చేరుకోవడం, ప్లాట్‌ఫామ్ మార్పు లేదా కనెక్టింగ్ ట్రైన్ లేట్ కావడం వంటి కారణాలతో బుక్ చేసుకున్న రైలును మిస్ అవుతుంటారు చాలామంది. మరి అలాంటి టైంలో అదే టికెట్‌తో మరో ట్రైన్ ఎక్కొచ్చా? ఎక్కితే ఏమవుతుంది? అసలు రైల్వే నిబంధనలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
ఆ టికెట్ చెల్లుబాటు కాదు..
రైల్వే నిబంధనల ప్రకారం ప్రతి టికెట్ ఒక నిర్దిష్ట ట్రైన్, తేదీ, క్లాస్, ప్రయాణానికి మాత్రమే చెల్లుతుంది. అంటే మీరు బుక్ చేసిన రైలును మిస్ అయితే సాధారణంగా అదే టికెట్‌తో మరో ట్రైన్‌లో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. ప్రత్యేకంగా రిజర్వ్డ్ టికెట్ ఉన్నవారికి ఈ రూల్ మరింత కఠినంగా ఉంటుంది. మీరు ఒక ఎక్స్‌ప్రెస్ రైల్లో స్లీపర్ లేదా ఏసీ టికెట్ బుక్ చేసుకొని ఆ ట్రైన్ మిస్ అయితే, అదే టికెట్‌తో మరో ఎక్స్‌ప్రెస్ లేదా వేరే రైలులో ఎక్కితే అది చెల్లుబాటు కాదు. టికెట్ ఉంది కాబట్టి ఏ రైలులోనైనా వెళ్లొచ్చు అనుకోవడం తప్పు.
36
జనరల్ టికెట్ తీసుకుంటే?
అలాగే అన్ రిజర్వ్డ్ టికెట్ విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. జనరల్ టికెట్ తీసుకున్నవారు అదే రూట్‌లో వెళ్లే ఇతర ప్యాసింజర్ లేదా జనరల్ కోచ్ ఉన్న ట్రైన్‌లలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా టికెట్‌పై ఉన్న తేదీ, గమ్యస్థానంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జనరల్ టికెట్ ఒక నిర్దిష్ట కాలపరిమితి(దాదాపు 3 గంటలు) వరకు మాత్రమే చెల్లుతుంది. కాబట్టి అదే రోజు లేదా అనుమతించిన సమయం లోపు మరో ట్రైన్ ఎక్కితే సమస్య ఉండకపోవచ్చు.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వ్డ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు ఉపశమనం లభించవచ్చు. కనెక్టింగ్ ట్రైన్ ఆలస్యం కావడం వల్ల మీరు తర్వాత ట్రైన్ మిస్ అయితే, స్టేషన్ అధికారులను సంప్రదిస్తే వారు కొన్ని సందర్భాల్లో సహాయం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒకే PNRలో కనెక్టింగ్ జర్నీ ఉంటే లేదా రైల్వే కారణంగా ఆలస్యం అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నించవచ్చు. అయితే ఇది పూర్తిగా అధికారుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
56
రీఫండ్ వస్తుందా?
మరొక విషయం ఏంటంటే.. ట్రైన్ బయలుదేరే ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే కొన్ని ఛార్జీలు కట్ చేసి రీఫండ్ వేస్తారు. కానీ ట్రైన్ బయలుదేరిన తర్వాత, రిజర్వ్డ్ టికెట్ సాధారణంగా నో రీఫండ్ కేటగిరీలోకి వెళ్లిపోతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో TDR (Ticket Deposit Receipt) ఫైల్ చేసి రీఫండ్ కోరే అవకాశం ఉంటుంది. అంటే ట్రైన్ చాలా ఆలస్యం కావడం, కోచ్ సమస్యలు లేదా రైల్వే కారణాల వల్ల ప్రయాణం చేయలేకపోవడం వంటి సందర్భాల్లో TDR ఉపయోగపడుతుంది.
66
ఈ జాగ్రత్తలు తీసుకుంటే..
ట్రైన్ మిస్ కాకుండా ఉండేందుకు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణానికి కనీసం 30 నుంచి 45 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవడం ఉత్తమం. ప్లాట్‌ఫామ్ నెంబర్ ముందుగా చెక్ చేసుకోవడం, ట్రైన్ రన్నింగ్ స్టేటస్ యాప్‌లు ఉపయోగించడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.