Train Ticket Booking: రోజూ లక్షలాది మంది ట్రైన్లలో ప్రయాణిస్తుంటారు. అయితే టికెట్ బుక్ చేసే టైంలో WL, RAC, CNF వంటి పదాలు కనిపిస్తుంటాయి. వీటి అర్థం తెలియక కొందరు గందరగోళానికి గురవుతుంటారు. మరి ఈ మూడింటి అర్థం, వాటి మధ్య తేడా ఏంటో తెలుసుకుందామా..
చాలామంది ప్రయాణికులు ట్రైన్ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తుంటారు. టికెట్ బుక్ చేసిన తర్వాత అందులో కనిపించే WL, RAC, CNF వంటి పదాలు చాలామందికి కన్‌ఫ్యూజన్ కలిగిస్తుంటాయి. ముఖ్యంగా మొదటిసారి రైలు ప్రయాణం చేసే వారు లేదా అత్యవసర సమయంలో టికెట్ బుక్ చేసే వారు ఈ స్టేటస్‌ల అర్థం పూర్తిగా తెలియక ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ మూడు పదాల అర్థం ఏంటో, వాటి మధ్య తేడా ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
CNF అంటే ఏంటి?
CNF అంటే కన్మర్ఫ్డ్ టికెట్(Confirmed Ticket) అని అర్థం. అంటే మీ టికెట్ పూర్తిగా కన్ఫర్మ్ అయిందని, ట్రైన్‌లో మీకు సీటు ఖరారైందని అర్థం. టికెట్‌పై కోచ్ నెంబర్, బెర్త్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తాయి. ప్రయాణ సమయంలో ఎలాంటి టెన్షన్ లేకుండా నేరుగా మీ సీటులో కూర్చోవచ్చు. సాధారణంగా ట్రైన్‌లో సీట్లు ఖాళీ ఉన్నప్పుడు లేదా ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF స్టేటస్ వస్తుంది.
36
WL అంటే ఏంటి?
WL అంటే వెయిటింగ్ లిస్ట్ (Waiting List). ట్రైన్‌లో ఉన్న అన్ని సీట్లు అప్పటికే బుక్ అయిపోయినప్పుడు కొత్తగా బుక్ చేసే వారికి ఈ స్టేటస్ కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం మీకు సీటు లేదు, కానీ ఎవరైనా వారి టికెట్ క్యాన్సిల్ చేస్తే మీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని దాని అర్థం. ఒకవేళ మీకు WL 15 ఉందని చూపిస్తే.. మీకంటే ముందు 14 మంది వెయిటింగ్‌లో ఉన్నారని అర్థం. టికెట్ క్యాన్సిలేషన్లు జరిగే కొద్దీ WL సంఖ్య తగ్గుతూ వస్తుంది. చివరకు WL జీరోకి చేరితే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. లేదంటే ఆటోమేటిక్‌గా టికెట్ క్యాన్సిల్ అవుతుంది. డబ్బులు తిరిగి వస్తాయి.
RAC అంటే రిజర్వేషన్ అగెనెస్ట్ క్యాన్సిలేషన్ (Reservation Against Cancellation). ఇది WL, CNF మధ్య ఉండే స్టేటస్‌గా చెప్పవచ్చు. RAC టికెట్ ఉన్నవారికి ట్రైన్‌లో ప్రయాణించే హక్కు ఉంటుంది.. కానీ, పూర్తి బెర్త్ మాత్రం ఉండదు. సాధారణంగా ఇద్దరు RAC ప్రయాణికులు ఒకే బెర్త్‌ను షేర్ చేసుకోవాలి. అంటే కూర్చునే అవకాశం ఉంటుంది కానీ, పడుకునే పూర్తి బెర్త్ గ్యారంటీ ఉండదు. అయితే కొన్ని కన్ఫర్మ్ టికెట్లు క్యాన్సిల్ అయితే మాత్రం RAC టికెట్లు CNFగా మారే అవకాశం ఉంటుంది.
56
WL, RAC, CNF మధ్య తేడా
WL, RAC, CNF మధ్య ప్రధాన తేడా ప్రయాణ హక్కు, సీటు లభ్యతలో ఉంటుంది. CNF టికెట్ ఉన్నవారికి పూర్తి సీటు లేదా బెర్త్ ఖాయం. RAC ఉన్నవారికి ప్రయాణ హక్కు ఉంటుంది కానీ పూర్తి బెర్త్ ఉండకపోవచ్చు. WL ఉన్నవారికి టికెట్ కన్ఫర్మ్ కాకపోతే రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణానికి అనుమతి ఉండదు.
66
వెయిటింగ్ లిస్ట్ లో రకాలు
వెయిటింగ్ లిస్ట్ కూడా చాలా రకాలుగా ఉంటుంది. GNWL- జనరల్ వెయిటింగ్ లిస్ట్ (General Waiting List), PQWL-పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ (Pooled Quota Waiting List), RLWL- రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ (Remote Location Waiting List) వంటి విభాగాలు ఉంటాయి.
వీటిలో GNWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టికెట్ బుక్ చేసే సమయంలో ఈ వివరాలు కూడా పరిశీలించడం మంచిది. అలాగే ట్రైన్ రూట్, సీజన్, పండగలు, సెలవులు వంటి అంశాలపై కూడా టికెట్ కన్ఫర్మేషన్ ఆధారపడి ఉంటుంది.