Silver City of India: వెండి వస్తువులకు ప్రంపచవ్యాప్తంగా ఫేమస్, మన దేశంలో వెండి రాజధాని నగరం ఏదో తెలుసా?

Published : Nov 07, 2026, 10:06 AM IST

Silver City of India: మన దేశంలో వెండికి బాగా డిమాండ్ ఉంది. వెండితో ఎన్నో రకాల వస్తువులు తయారు చేస్తుంటారు. పెళ్లిళ్లకు బంగారంకంటే వెండే ఎక్కువగా వాడుతుంటారు. మరి ఇండియాలో వెండి ఎక్కువగా దొరికే నగరం ఏది? ఇక్కడ వెండికి ఎందుకు అంత డిమాండ్?

PREV
13
వెండి వస్తువులకు ప్రంపచవ్యాప్తంగా ఫేమస్

భారతదేశంలో ఎన్నో నగరాలకు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉందిజ ప్రత్యేక ఉత్పత్తుల ఆధారంగా విభిన్నమైన పేర్లు ఉన్నాయి. కొన్ని నగరాలు ఆహారానికి ప్రసిద్ధి చెందితే, మరికొన్ని చారిత్రక కట్టడాలకు పేరుగాంచాయి. కొన్ని నగరాలు పంటలకు, కొన్ని నగరాలు బంగారానికి బ్రాండ్ గా ఉన్నాయి. అయితే మన దేశంలో వెండికి ప్రసిద్ది చెందిన నగరం ఏదో తెలుసా? ఇక్కడ వెండి వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్.

ఈ నగరాన్ని సిల్వర్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఆ వూరు ఏదో కాదు కటక్ (Cuttack). ఒడిశా రాష్ట్రంలోని చారిత్రక నగరం కటక్ (Cuttack) అత్యంత సూక్ష్మమైన, అద్భుతమైన వెండి హస్తకళల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ నగరానికి ‘సిల్వర్ సిటీ ఆఫ్ ఇండియా’ (భారతదేశ వెండి నగరం) అనే పేరు ఎలా వచ్చింది, దాని వెనుక ఉన్న విశేషాలు ఏమిటి?

23
వెండితో ముడిపడిన శతాబ్దాల చరిత్ర

కటక్‌కు వెండితో ఉన్న అనుబంధం కొత్తదేం కాదు. వందలాది సంవత్సరాలుగా ఇక్కడ వెండితో చేసే అద్భుతమైన కళాఖండాలు ప్రాచుర్యం పొందాయి. స్థానికంగా దీనిని ‘తారకసి’ (Tarakasi) లేదా వెండి ఫిలిగ్రీ (Silver Filigree) అని పిలుస్తారు. ఈ కళలో అత్యంత సన్నని వెండి తీగలను మెలితిప్పుతూ, ఎలాంటి జాయింట్స్ లేకుండా ఎంతో అందమైన డిజైన్లు, ఆభరణాలు, అలంకార వస్తువులు , షోపీస్‌లను తయారు చేస్తారు.

ఈ డిజైన్లలో ఎక్కువగా ప్రకృతి సౌందర్యం, పౌరాణిక గాథలు , సాంప్రదాయ రూపాలు కనిపిస్తాయి. ఈ కళలో ప్రతి ఒక్క వస్తువును చేతితోనే అత్యంత ఓపికగా, సూక్ష్మ నైపుణ్యంతో రూపొందిస్తారు. కేవలం ఒడిశాలోనే కాకుండా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కటక్ వెండి వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ అద్భుతమైన హస్తకళే కటక్‌కు 'సిల్వర్ సిటీ' అనే పేరు తెచ్చిపెట్టింది.

కేవలం పేరు మాత్రమే కాదు, జీవన విధానం

"సిల్వర్ సిటీ" అనే బిరుదు కేవలం ఒక ప్రతీక మాత్రమే కాదు, అది ఆ నగర ప్రజల సాంస్కృతిక, ఆర్థిక అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. కటక్‌లోని అనేక కుటుంబాలకు ఈ ఫిలిగ్రీ పనే ప్రధాన వృత్తి. తరతరాలుగా ఈ కళను తల్లిదండ్రుల నుండి పిల్లలు నేర్చుకుంటూ తమ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

ఇక్కడ అతి పెద్ద వెండి మార్కెట్ నయాసడక్ (Nayasadak) లో ఉంది. ఇక్కడ వెండితో తయారు చేసిన రకరకాల వస్తువులు విరివిగా లభిస్తాయి. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ అద్భుతమైన వెండి కళాఖండాలను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

33
కటక్‌ చారిత్ర..

కటక్ కేవలం వెండి కళలకే కాకుండా, గొప్ప చారిత్రక నేపథ్యానికి కూడా నిలయం. వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ నగరాన్ని ‘మిల్లెనియం సిటీ’ (Millennium City) అని కూడా పిలుస్తారు. మహానది, కఠజోడి అనే రెండు ప్రధాన నదుల మధ్య ఈ నగరం విస్తరించి ఉండటం దీని ప్రత్యేకత. ఈ భౌగోళిక పరిస్థితుల వల్ల గతంలో ఇది ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. అంతేకాకుండా, 1956 వరకు ఇది ఒడిశా రాష్ట్ర రాజధానిగా కూడా కొనసాగింది.

సంప్రదాయం - ఆధునికతల సంగమం

నేడు కటక్ నగరం ఆధునిక అభివృద్ధి బాటలో పయనిస్తున్నప్పటికీ, తన ప్రాచీన సంస్కృతిని కోల్పోలేదు. ఆధునిక వ్యాపారాలు పెరుగుతున్నా, వెండి ఫిలిగ్రీ పరిశ్రమ ఇక్కడి ప్రధాన గుర్తింపుగా నిలిచింది. చరిత్ర, హస్తకళలు - ఆధునిక జీవనశైలి కలగలిసిన కటక్ నగరం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ సిల్వర్ సిటీ అనగానే కేవలం ఒక లోహం గుర్తుకురాదు; తరతరాల కళాకారుల ఓపిక, సృజనాత్మకత , వారి కష్టానికి ప్రతిఫలం కళ్ళముందు కదలాడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories