Science Facts: డొమినికన్ రిపబ్లిక్ దేశంలోని లాస్ సాలినాస్ అనే చిన్న గ్రామం మిస్టరీ షాక్ కు గరిచేస్తోంది. ఇక్కడ పుట్టిన కొందరు పిల్లలు పుట్టుకతో అమ్మాయిలుగా కనిపిస్తారు. అలాగే, పెరుగుతారు. కానీ, వారికి 12 ఏళ్ల వయస్సు రాగానే అబ్బాయిలుగా మారిపోతారు.
పుట్టినప్పుడు పాప అని సంతోషపడతారు. గౌన్లు తొడిగి, పూలు పెట్టి ఎంతో ముద్దుగా పెంచుకుంటారు. కానీ తీరా 12 ఏళ్ల వయసు రాగానే, ఆ అమ్మాయి ఒక్కసారిగా అబ్బాయిగా మారిపోతే? వినడానికి ఏదో ఫాంటసీ కథలా అనిపించినా, ఇది అక్షరాలా నిజం. కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ దేశంలోని సలీనాస్ అనే చిన్న గ్రామంలో ఈ విచిత్రం తరతరాలుగా జరుగుతోంది. సైన్స్ ప్రపంచాన్ని సైతం షాక్‌కి గురిచేసిన ఈ అరుదైన రహస్యం వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం.
25
పిల్లల ఎదుగుదలలో విచిత్రమైన ట్విస్ట్
సాధారణంగా పాప పుట్టిందో, బాబు పుట్టాడో డెలివరీ కాగానే డాక్టర్లు చెప్పేస్తారు. కానీ సలీనాస్ గ్రామంలో మాత్రం 12 ఏళ్లు వచ్చే వరకు క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ పుట్టే పిల్లల్లో కొందరు 12 ఏళ్ల వయసు అంటే టీనేజ్ కి రాగానే అమ్మాయిల నుంచి అబ్బాయిలుగా మారిపోతారు. స్థానికంగా ఈ పిల్లలను 'గేవెడోసెస్' అని పిలుస్తారు. స్పానిష్ భాషలో దీని అర్థం "12 ఏళ్ల వయసులో పురుషత్వాన్ని పొందేవారు" అని. అక్కడ పుట్టే ప్రతి 90 మంది పిల్లల్లో ఒకరికి ఇలా జరుగుతుండడం విశేషం.
35
పెంచేది అమ్మాయిగా.. మారేది అబ్బాయిగా
ఈ ఊరిలో కొందరు పిల్లలు పుట్టినప్పుడు చూడటానికి సేమ్ అమ్మాయిలాగే ఉంటారు. దాంతో పేరెంట్స్ వారికి అమ్మాయిల పేర్లే పెట్టి, లంగా ఓణీలు, గౌన్లు తొడిగి చాలా ఆప్యాయంగా పెంచుకుంటారు. అయితే వారికి 12 ఏళ్లు నిండగానే బాడీలో మెల్లగా మార్పులు మొదలవుతాయి. శరీరంలో మేల్ హార్మోన్లు ఒక్కసారిగా రిలీజ్ అయి, పురుష అవయవాలు పెరగడం స్టార్ట్ అవుతాయి. వాయిస్ బేస్ మారి గంభీరంగా తయారవుతుంది. బాడీ లాంగ్వేజ్ కూడా కంప్లీట్ గా అబ్బాయిలా మారిపోతుంది.
ఇది చూసి కొందరు దెయ్యాలనో, అద్భుతమనో అనుకున్నారు. కానీ 1970లలో కార్నెల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ హార్మోన్ నిపుణురాలు డాక్టర్ జూలియన్ ఇంపెరాటో ఈ ఊరికి వచ్చి రీసెర్చ్ చేశారు. అప్పుడే అసలు సీక్రెట్ బయటపడింది. ఇక్కడ జరుగుతున్నది ఏ వింత కాదని, ఇదొక అరుదైన జెనెటిక్ డిజార్డర్ అని ఆమె తేల్చారు.
ఈ పిల్లలకు మేల్ క్రోమోజోమ్ ఉన్నప్పటికీ, తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5 ఆల్ఫా రిడక్టేస్ అనే ఎంజైమ్ లోపిస్తుంది. దీనివల్ల గర్భంలో ఉండగా 'డిహైడ్రో-టెస్టోస్టెరాన్' అనే మేల్ హార్మోన్ ప్రొడ్యూస్ కాదు. దాంతో అబ్బాయి కడుపులో ఉన్నా, పుట్టేటప్పుడు అమ్మాయి రూపంలో బయటకు వస్తారు. కానీ 12 ఏళ్లు రాగానే, బాడీలో మళ్లీ భారీ స్థాయిలో 'టెస్టోస్టెరాన్' రిలీజ్ అవుతుంది. దీంతో గర్భంలో జరగాల్సిన మార్పులు 12 ఏళ్ల తర్వాత జరిగి, ఆ అమ్మాయి కాస్త పూర్తి అబ్బాయిగా మారిపోతారు.
55
వైద్య రంగంలో సంచలనం
ఈ గ్రామంలోని ప్రజలపై చేసిన పరిశోధనలు మెడికల్ వరల్డ్‌కి ఒక పెద్ద బూస్ట్ ఇచ్చాయి. పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ గ్రంధి వాపు, అలాగే మగవారిలో వచ్చే బట్టతల సమస్యకు మెడిసిన్ కనుగొనడానికి ఈ రీసెర్చ్ ఎంతగానో ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పురుషులు వాడుతున్న 'ఫినాస్టరైడ్' అనే మెడిసిన్‌ను ఈ రీసెర్చ్ ఆధారంగానే తయారు చేశారు.
ఇక ఈ ఊరిలో 12 ఏళ్లకు అబ్బాయిలుగా మారిన వారు, పెద్దయ్యాక మామూలు మగవారిలాగే పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ గ్రామం చాలా కాలం పాటు మిగతా ప్రపంచానికి దూరంగా, కట్ ఆఫ్ అయి ఉండడం వల్ల ఈ జెనెటిక్ ప్రాబ్లమ్ తరతరాలుగా కంటిన్యూ అవుతూ వస్తోంది.