Telangana Waterfall: తెలంగాణలో ఆరు నెలలు మాత్రమే కనిపించే అందాల జలపాతం.. దీన్ని ఏ సమయంలో చూడాలంటే

Published : Oct 31, 2026, 08:44 AM IST

Telangana Waterfall: తెలంగాణా రాష్ట్రంలో అందమైన జలపాతం ఉంది. కానీ దీని గురించి స్థానికులకు తప్ప ఇతరుకుల తక్కువే తెలుసు. ఈ జలపాతం పేరు సబ్బితం. ఇది ఏడాదిలో ఆరు నెలల పాటూ పరవళ్లు తొక్కుతూ కిందకు పడుతుంది.

PREV
13
తెలంగాణాలో అదిరే జలపాతం

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో జలపాతాలు కూడ ఉన్నాయి. కొన్నింటికి రావాల్సినంత గుర్తింపు లేదు. అలాంటి జలపాతాల్లో సబ్బితం కూడ ఒకటి. ఇది పెద్దపల్లి జిల్లాలో ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, రాళ్ల మధ్య నుంచి జాలువారే నీరు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ జలపాతాన్ని గౌరీ గుండాల జలపాతం అని కూడా పిలుస్తారు. పెద్దపల్లి పట్టణానికి సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. సబ్బితం గ్రామం నుంచి దాదాపు 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే జలపాతాన్ని చేరుకోవచ్చు. వర్షాలు కురిసినప్పుడు కొండల నుంచి నీరు వేగంగా కిందకు ప్రవహిస్తూ కనువిందు చేస్తుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ ప్రాంతం మంచి పర్యాటక ప్రదేశంగా నిలుస్తోంది.

23
వర్షాకాలంలో జలపాతం చూడాల్సిందే

ఈ జలపాతం అందాలను చూడాలంటే సరైన సమయంలోనే అక్కడికి చేరుకోవాలి. ప్రతి ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు ఈ జలపాతాన్ని సందర్శించడానికి అనువైన సమయం. వర్షాలు కురిసిన తర్వాత కొండలపై పచ్చదనం పెరుగుతుంది. నీరు రాళ్లపై నుంచి కిందకు జారుతూ అందమైన దృశ్యాలను చూపిస్తుంది. జలపాతం సమీపంలో గౌరీ లింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని స్థానిక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2025లో ఈ ప్రాంత అభివృద్ధికి రూ.6 కోట్ల నిధులు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. రహదారులు, పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు.

33
వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

సబ్బితం జలపాతానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సమీపంలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్రయాణించవచ్చు. అయితే, భారీ వర్షాలు కురిసినప్పుడు జలపాతం దగ్గర నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారుతుంది. గతంలో భారీ వర్షాల కారణంగా సందర్శకులకు అధికారులు ఆంక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే జలపాతానికి వెళ్లే ముందు అక్కడ పర్యాటకులను అనుమతిస్తున్నారో లేదో తెలుసుకోవాలి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలోకి దిగకూడదు. జారే రాళ్లపై నడవడం, ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఫొటోలు తీసుకోవడం వంటివి చేయకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories