రోడ్లపై తెలుపు, పసుపు గీతలు ఎందుకు వేస్తారో తెలుసా? వాటి అర్థం ఇదే

Published : Nov 03, 2026, 07:36 PM IST

Road Markings: రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు తెలుపు, పసుపు రంగుల్లో గీతలను గమనించే ఉంటారు. అయితే వీటి అర్థం ఏంటో మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. నిజానికి ఈ గీత‌ల వెన‌కాల ఎంతో అర్థం దాగి ఉంద‌ని మీకు తెలుసా.?

PREV
15
తెలుపు రంగు గీతలు ఎందుకు వేస్తారు?

రోడ్డుపై తెలుపు రంగు గీతలను సాధారణంగా ఒకే దిశలో వెళ్లే వాహనాల మధ్య లేన్‌లను వేరు చేయడానికి ఉపయోగిస్తారు. హైవేలు, నగర రహదారులు, ఫ్లైఓవర్లపై క‌నిపిస్తాయి. ప్రతి వాహనం ఒక నిర్ణీత లేన్‌లో ప్రయాణించేలా చేయడం వీటి ప్రధాన ఉద్దేశం. దీనివల్ల వాహనాలు ఇష్టానుసారంగా లేన్‌లు మారకుండా ట్రాఫిక్ క్రమబద్ధంగా సాగుతుంది. అంతేకాదు, రోడ్డుపై వాహనాలు ప్రయాణించాల్సిన హద్దులను కూడా ఈ గీతలు తెలియజేస్తాయి.

25
మధ్యలో ఖాళీలు ఉన్న తెలుపు గీతల అర్థం ఏంటి?

రోడ్డుపై తెలుపు రంగు గీతలు అక్కడక్కడా తెగిపోయినట్లు కనిపిస్తే వాటిని డాష్డ్ లైన్స్ అంటారు. అంటే గీతల మధ్య కొంత ఖాళీ ఉంటుంది. ఇలాంటి గీతలు ఉన్నప్పుడు డ్రైవర్లు జాగ్రత్తగా లేన్ మార్చుకోవచ్చు. అవసరమైతే ఓవర్‌టేక్ కూడా చేయవచ్చు. అయితే ఎదురుగా లేదా పక్కన వచ్చే వాహనాలను గమనించకుండా లేన్ మార్చకూడదు. ట్రాఫిక్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

35
వరుసగా ఉండే తెలుపు గీతలు ఏం సూచిస్తాయి?

రోడ్డుపై ఎలాంటి ఖాళీలు లేకుండా నిరంతరంగా తెలుపు గీత కనిపిస్తే దాన్ని సాలిడ్ వైట్ లైన్ అంటారు. ఇలాంటి గీత ఉన్నప్పుడు సాధారణంగా లేన్ మార్చడం, గీత దాటి వెళ్లడం అనుమతించరు. డ్రైవర్లు తమ లేన్‌లోనే ప్రయాణించాలి. అలాగే రోడ్డుకు ఇరువైపులా అంచున కనిపించే తెలుపు గీతలను ఎడ్జ్ లైన్స్ అంటారు. రోడ్డు ఎక్కడ ముగుస్తుంది? దాని పక్కన ఉన్న ప్రాంతం ఎక్కడ ప్రారంభమవుతుంది? అనే విషయాలను ఇవి తెలియజేస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో, పొగమంచు ఉన్నప్పుడు ఇవి డ్రైవర్లకు ఎంతో ఉపయోగపడతాయి.

45
పసుపు రంగు గీతలు ఎందుకు వేస్తారు?

రోడ్డుపై పసుపు రంగు గీతలు సాధారణంగా ఎదురెదురుగా ప్రయాణించే వాహనాల మధ్య విభజనను సూచిస్తాయి. అంటే ఒకవైపు వెళ్లే వాహనాలు, మరోవైపు వచ్చే వాహనాలు తమ తమ దారుల్లోనే ప్రయాణించేలా ఈ గీతలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా రెండు వైపులా వాహనాలు తిరిగే రహదారుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.

ఒకే పసుపు రంగు గీత నిరంతరంగా ఉంటే సాధారణంగా ఆ గీతను దాటి ఎదురుగా వచ్చే వాహనాల లేన్‌లోకి వెళ్లకూడదు. అదే పసుపు గీత మధ్యలో ఖాళీలు ఉంటే, ఎదురుగా వచ్చే వాహనాలకు ప్రమాదం లేకుండా రహదారి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఓవర్‌టేక్ చేయవచ్చు.

55
రెండు పసుపు గీతలు ఉంటే అర్థం ఏమిటి?

రోడ్డుపై రెండు పసుపు రంగు గీతలు పక్కపక్కనే నిరంతరంగా కనిపిస్తే వాటిని డబుల్ సాలిడ్ ఎల్లో లైన్స్ అంటారు. ఇవి వాహనదారులకు అత్యంత ముఖ్యమైన హెచ్చరికను ఇస్తాయి. ఈ గీతలను దాటి ఎదురుగా వచ్చే వాహనాలు ప్రయాణించే మార్గంలోకి వెళ్లకూడదు. ఓవర్‌టేక్ చేయడం కూడా నిషేధం. ఇలాంటి గీతలను సాధారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, మలుపులు, తక్కువ దూరం వరకు మాత్రమే కనిపించే రహదారులపై ఏర్పాటు చేస్తారు. వీటిని దాటడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే డ్రైవర్లు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

Read more Photos on
click me!

Recommended Stories