Orange City: మన దేశంలో ఆరెంజ్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా? ఇక్కడి ఆరెంజ్ చాలా ఫేమస్!

Published : Nov 04, 2026, 10:47 AM IST

Orange City: నారింజ పండు పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. ఈ పండ్లకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అయితే మన దేశంలో ఒక నగరానికి ఈ పండ్ల పేరుతోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతకీ ఆ నగరం పేరేంటి? ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.

PREV
15
ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా

నారింజ పండ్ల రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండ్లకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అయితే మన దేశంలో ఒక నగరానికి ఈ పండ్ల పేరుతోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అదే మహారాష్ట్రలోని నాగ్‌పూర్. దీన్ని 'ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. ఇక్కడ నారింజ పండ్ల సాగు, వ్యాపారం చాలా ప్రసిద్ధి. అంతేకాదు.. నాగ్‌పూర్‌లో పండే నారింజలకు ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా వీటికి మంచి గుర్తింపు ఉంది. మరి నాగ్‌పూర్‌కు ఆరెంజ్ సిటీ అనే పేరు ఎలా వచ్చింది? అక్కడ నారింజ పంటను ఎలా సాగు చేస్తారు? ఈ పండ్ల ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలసుకుందాం.

25
నాగ్‌పూర్‌ని ఆరెంజ్ సిటీ అని ఎందుకు పిలుస్తారు?

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరాన్ని మన దేశపు ఆరెంజ్ సిటీగా పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో నారింజ పండ్ల సాగు, వ్యాపారం ఎక్కువగా ఉండటమే. నాగ్‌పూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నారింజ తోటలు కనిపిస్తాయి. ఇక్కడ పండిన పండ్లను సేకరించి దేశంలోని అనేక ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. దీంతో నాగ్‌పూర్ నారింజ వ్యాపారానికి ముఖ్యమైన కేంద్రంగా మారింది. కేవలం సాగుకే కాకుండా నారింజ పండ్ల కొనుగోలు, అమ్మకాలు, రవాణా వంటి వ్యాపార కార్యకలాపాలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఈ నగరానికి ఆరెంజ్ సిటీ అనే పేరు వచ్చింది.

35
నాగ్‌పూర్ నారింజల ప్రత్యేకత

నాగ్‌పూర్‌లో పండే నారింజలను నాగ్‌పూర్ మాండరిన్ అని పిలుస్తారు. ఇవి చూడటానికి సాధారణ నారింజ పండ్లలాగే ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీటి తొక్క కొద్దిగా గరుకుగా, సులభంగా ఒలిచే విధంగా ఉంటుంది. లోపల గుజ్జు జ్యుసీగా ఉండటంతో పాటు తీపి, పులుపు కలిసిన రుచిని కలిగి ఉంటుంది. పండులో మంచి రసం కూడా ఉంటుంది. అందుకే వీటిని చాలామంది ఇష్టంగా తింటారు. ఇతర ప్రాంతాల్లో పండే నారింజలతో పోలిస్తే నాగ్‌పూర్ మాండరిన్‌కు ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటాయి. ఈ లక్షణాలే వీటికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

45
ప్రత్యేక గుర్తింపు

నాగ్‌పూర్ ఆరెంజ్‌కు భారత ప్రభుత్వం 2014లో భౌగోళిక గుర్తింపు (GI Tag) ఇచ్చింది. ఈ గుర్తింపు వల్ల నాగ్‌పూర్ ప్రాంతంలో పండించే నారింజ పండ్లకు ప్రత్యేక గుర్తింపు, నాణ్యతకు చట్టపరమైన రక్షణ లభించాయి. దీనివల్ల రైతులకు మార్కెట్‌లో మంచి ధరలు లభించడంతో పాటు, ఈ పండ్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రాధాన్యం పెరిగింది.

55
నారింజను ఎక్కడెక్కడ పండిస్తారు?

నాగ్‌పూర్ నగరంతో పాటు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో నారింజ సాగు ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా కటోల్, నార్ఖేడ్, సావ్నేర్, కలమేశ్వర్, వారుడ్ వంటి ప్రాంతాలు నారింజ తోటలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతాల్లోని నేల, వాతావరణ పరిస్థితులు నారింజ సాగుకు అనుకూలంగా ఉంటాయి. నాగ్‌పూర్ నారింజలకు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి మార్కెట్ ఉంది. నాగ్‌పూర్‌లో పండే నారింజల రుచి, వాటి సాగు, వ్యాపారం, GI గుర్తింపు వంటివి ఈ నగరాన్ని దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి.

Read more Photos on
click me!

Recommended Stories