Most Polluted City: మనదేశంలో అతి కలుషిత నగరం ఇదే, ఇక్కడ గాలి పీల్చడం కూడా ప్రమాదమే, ఢిల్లీ మాత్రం కాదు

Published : Nov 04, 2026, 10:00 AM IST

Most Polluted City: మనదేశంలో ఏ నగరాలు కాలుష్యంతో నిండి ఉన్నాయో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. అందులో ఎన్నో నగరాలు వాయు కాలుష్యంతో నిండిపోయినట్టు తెలిపాయి. ఇక మనదేశంలో అత్యంత కలుషిత నగరం ఏదో తెలుసా? ఢిల్లీ మాత్రం కాదు.

PREV
13
అతి కలుషిత నగరం ఇదే

భారతదేశంలో అత్యంత కలుషిత నగరం ఏదో తెలుసా? చలికాలం ప్రారంభం కావడంతోనే చాలా నగరాల్లో వాయు కాలుష్యం ఊహించని రీతిలో ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పంజాబ్‌కు చెందిన చారిత్రక నగరం బటిండాలో గాలి నాణ్యత సూచీ (AQI) ఏకంగా 1,100 మార్కును దాటి దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ నమోదైన 1,124 AQI రీడింగ్ అక్కడ వాతావరణాన్ని తీవ్ర కాలష్యంగా మార్చింది. సాధారణంగా 400 దాటితేనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని భావించే పరిస్థితుల్లో, వెయ్యికి పైగా నమోదు కావడం అక్కడి వాతావరణ అత్యవసర పరిస్థితికి అద్దం పడుతోంది.

23
టాప్ 10 కలుషిత నగరాలు

దేశంలోని టాప్-10 అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఉత్తరాది రాష్ట్రాలే పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయి. హర్యానా రాష్ట్రం నాలుగు నగరాలతో ముందుండగా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు మూడు నగరాల చొప్పున ఈ జాబితాలో నిలిచాయి. బటిండా తర్వాతి స్థానాల్లో హర్యానాకు చెందిన సిర్సా (848), రోహ్‌తక్ (847), పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ (801), జలంధర్ (760) ఉన్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మీరట్ (678), ఘజియాబాద్ (648) తీవ్రమైన వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరమైన ‘సివియర్’ స్థాయిలోనే కొనసాగుతోంది.

33
గాలి కాలుష్యంతో ప్రమాదం

ఈ తీవ్రమైన కాలుష్యానికి సూక్ష్మ ధూళికణాలు ప్రధాన కారణంగా మారాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల లోతుల్లోకి చొచ్చుకుపోయి రక్తంలో కలిసే ప్రమాదకరమైన పీఎం 2.5 ధూళికణాలు వాతావరణంలో దట్టంగా పేరుకుపోయాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఈ రీడింగ్స్ ఆరోగ్యవంతులపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని, మాస్కులు ధరించాలని వైద్యులు హెచ్చరిస్తుండటంతో ఉత్తరాది నగరాల్లో ప్రజలు విషపూరితమైన పొగమంచు మధ్య బెంబేలెత్తుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories