ఈ ఫొటోలో మీకు మొద‌ట ఏం క‌నిపించింది.? ఇది మీరు ఎలాంటి వారో చెప్పేస్తుంది.

Published : Sep 02, 2025, 03:42 PM IST

Optical illusion: సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల ఫొటోలు, వీడియోలు నిత్యం వైర‌ల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వినోదాన్ని పంచేవి అయితే, మ‌రికొన్ని మ‌న ఆలోచ‌న‌న‌ను ప‌రీక్షించేవి ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. 

PREV
14
వైర‌ల్ అవుతోన్న ఆప్టిక‌ల్ ఇల్యూజ‌న్

సోషల్ మీడియాలో ఒక కొత్త ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ అవుతోంది. పైన క‌నిపిస్తున్న ఫొటోలో ర‌క‌ర‌కాల జంతువులు క‌నిపిస్తున్నాయి. అయితే జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే ఈ ఫొటోలో ఒక మ‌హిళ కూడా దాగి ఉంది. అయితే ఈ ఫొటో చూసిన వెంట‌నే మీకు మ‌హిళ ముఖం క‌నిపించిందా.? లేదా జంతువులా.? దీనిబ‌ట్టి మీ వ్య‌క్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. క్రియేటర్ మియా యిలిన్ టిక్‌టాక్‌లో ఈ పోస్టును చేశారు. అయితే ఈ ఫొటో చూడ‌గానే మొద‌ట ఏం క‌నిపించిందో దానిబ‌ట్టి మీ వ్య‌క్తిత్వంలో ఎలాంటిదో చెప్పొచ్చ‌ని అంటున్నారు. అవేంటంటే..

24
జంతువులు కనిపిస్తే

ఒక‌వేళ ఈ ఫొటో చూసిన వెంట‌నే మీకు జంతువులు క‌నిపిస్తే.. అయితే మీరు స్పష్టత కలిగిన, దృఢమైన, నమ్మకమైన వ్యక్తి అని అర్థం. మీరు ఎక్కడికి వెళ్లాలి, ఎలా చేరుకోవాలి అన్నది బాగా తెలుసుకుంటారు. మియా ప్రకారం, ఇలాంటి వారు సహజసిద్ధమైన నాయకత్వ గుణం కలిగివుంటారు. బలవంతం చేయకపోయినా, క్రమశిక్షణతో, ఆకర్షణతో ఇతరులను నడిపించగలరు. మీరు ఆదర్శంగా ముందుండే నాయకుడు. అయితే, అప్పుడప్పుడూ మీ శక్తిని కాపాడుకునేందుకు కూడా ప్ర‌య‌త్నించాలి.

34
మహిళ ముఖం కనిపిస్తే..

ఒక‌వేళ మొదటగా మహిళ ముఖం చూశారా? అయితే మీరు శాంత స్వభావం కలిగిన వ్యక్తి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరు, వివాదాలు సృష్టించరు. మియా చెప్పిన ప్రకారం, మీరు ఎంతో సహనంతో, జీవితంలోని కష్టాలను సులభంగా ఎదుర్కొంటారు. సమస్యల నుంచి పారిపోరు, కానీ వాటిని సాఫీగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎక్కువ వింటారు, తక్కువ మాట్లాడతారు. అయితే మీరు మాట్లాడినప్పుడు అందరూ శ్రద్ధగా వింటారు.

44
ఆప్టిక‌ల్ ఇల్యూజ‌న్స్‌కు పెరుగుతోన్న ఆద‌ర‌ణ‌.

ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు పెద్ద క్విజ్‌లా అనిపించవు. సింపుల్‌గా ఉంటాయి. కేవ‌లం మ‌నం చూసే విధానంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే మొద‌ట మ‌న‌కు ఏం క‌నిపిస్తుంది అనేది మ‌న ఆలోచ‌న‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి ఫొటోలు వైర‌ల్ అవుతుంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories