Mobile Phone: మీరు మొబైల్ ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారా? ఫోన్ వాడిన తరువాత దాన్ని ఎక్కడ పెడుతున్నారు? ఏ జేబులో ఫోన్ పెడితే ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా? సెల్ ఫోన్ ను ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెడితే ప్రమాదం?
నేటి ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలోనే ఉంటోంది. అయితే, ఫోన్‌ను మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం అనే విషయం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం రోజూ ఉద్దేశపూర్వకంగా లేదా అలవాటులో భాగంగా చేసే కొన్ని చిన్న తప్పులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఫోన్‌ను అస్సలు ఉంచకూడని ప్రదేశాలు ఏంటి?
25
ప్యాంట్ జేబులో (Front Pant Pockets)
చాలామంది పురుషులు మొబైల్ ఫోన్‌ను ప్యాంట్ ముందు జేబులో పెట్టుకోవడం అలవాటుగా మార్చుకుంటారు. ఫోన్ నుండి నిరంతరం వెలువడే విద్యుదయస్కాంత వికిరణాలు (Electromagnetic Radiation) వేడి (Heat) వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది శుక్రకణాల నాణ్యత, సంఖ్య తగ్గడానికి దారితీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
ప్యాంట్ వెనుక జేబులో (Back Pocket)
వెనుక జేబులో ఫోన్ ఉన్నప్పుడు దానిపై కూర్చోవడం వల్ల వెన్నుపాము (Spine) సరియైన భంగిమలో ఉండక నడుము నొప్పి, సైయాటికా (Sciatica) వంటి నరాల సమస్యలు వస్తాయి.
35
దిండు కింద లేదా తల పక్కన (Under the Pillow)
రాత్రి వేళల్లో స్మార్ట్‌ఫోన్ ను దిండు కింద లేదా తలకు అతి సమీపంలో పెట్టుకుని నిద్రపోవడం చాలా ప్రమాదకరం. దీనివల్ల వెలువడే రేడియేషన్ మన నిద్ర విధానాన్ని (Melatonin Production) దెబ్బతీసి, నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి, మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. అంతేకాకుండా రాత్రంతా ఛార్జింగ్ పెట్టి దిండు కింద ఉంచడం వల్ల ఫోన్ ఓవర్‌హీట్ అయి పేలే ప్రమాదం కూడా ఉంది.
చొక్కా ముందు జేబులో స్మార్ట్‌ఫోన్ పెట్టుకోవడం వల్ల రేడియేషన్ ప్రభావం గుండె , ఛాతీ భాగాలపై పడుతుంది. ముఖ్యంగా పేస్‌మేకర్ (Pacemaker) వంటి వైద్య పరికరాలు అమర్చుకున్న వారికి ఇది అత్యంత ప్రమాదకరం. ఇది హార్ట్ ను చాలా దెబ్బతీసే ప్రమాదం ఉంది.
55
స్మార్ట్‌ఫోన్ విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
స్మార్ట్‌ఫోన్ వీలైనంత వరకు బ్యాగ్‌లో లేదా టేబుల్‌పై ఉంచడం అలవాటు చేసుకోండి.
నిద్రపోయే సమయంలో ఫోన్‌ను కనీసం 3 నుండి 4 అడుగుల దూరంలో ఉంచండి లేదా 'ఏరోప్లేన్ మోడ్' ఆన్ చేయండి.
కాల్స్ మాట్లాడేటప్పుడు ఎక్కువ సేపు మాట్లాడాల్సి వస్తే ఇయర్‌ఫోన్స్ లేదా స్పీకర్ మోడ్ ఉపయోగించండి.
ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తూ, ఫోన్ వాడకంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవచ్చు.