Interesting Fact : కోర్టులో జడ్జీలు, లాయర్లు నల్ల కోటు ఎందుకు వేసుకుంటారో తెలుసా?

Published : Aug 01, 2026, 02:59 PM IST

మున్సిప్ కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు ఎక్కడైనా న్యాయమూర్తులు, లాయర్లు నల్ల కోటునే ధరిస్తారు. ఈ డ్రెస్ కోడ్ వెనక చాలా పెద్ద చరిత్రే ఉంది. ఆ ఆసక్తికరమైన విషయాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
లాయర్లు, జడ్జిలు బ్లాక్ కోటు వెనక ఆసక్తికరమైన స్టోరీ

కింది స్థాయిలో పనిచేసే కోర్టుల నుండి అత్యున్నత న్యాయస్థానాలు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయమూర్తులు, న్యాయవాదులు నల్ల కోటు ధరించాల్సిందే. చివరికి ఈ న్యాయ వ్యవస్థకే నల్లకోటు అనేది సింబల్ గా మారింది. అయితే వేరే రంగుల కోటు కాకుండా జడ్జీలు, న్యాయవాాదులు నల్ల కోటునే ఎందుకు వేసుకుంటారు? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక చాలా పెద్ద చరిత్ర, బలమైన కారణాలు ఉన్నాయి. ఇది కేవలం యూనిఫాం మాత్రమే కాదు.. న్యాయవ్యవస్థకు గౌరవానికి, సమానత్వానికి చిహ్నం.

25
లాయర్లు, జడ్జిల బ్లాక్ కోట్ వేసుకునే కల్చర్ ఎలా వచ్చింది?

1694లో ఇంగ్లండ్ రాణి మేరీ II మరణించినప్పుడు, సంతాపం తెలిపేందుకు కోర్టు సభ్యులందరూ నల్లటి గౌన్లు ధరించాలని రాజు విలియం III ఆదేశించారు. ఇలా మొదటిసారి కోర్టులో మొదటిసారి నల్ల కోటు కల్చర్ ప్రవేశించింది. అయితే సంతాప దినాలు ముగిశాక ఈ ఆదేశాన్ని రాజు వెనక్కి తీసుకున్నారు. కానీ కాలక్రమేణా అది ఒక సంప్రదాయంగా మారింది. ఆ దుస్తుల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడేందుకు లాయర్లు నల్ల కోటు ధరించడం కొనసాగించారు. ఆ తర్వాత 1697లో ఇది చట్టబద్ధమైన యూనిఫాంగా మారింది.

35
కోర్టులో అందరూ సమానమే అనే భావనకోసం..

కోర్టులో పేద, ధనిక, కులం, మతం, వర్ణం వంటి ఎలాంటి వివక్ష ఉండకూడదు. నలుపు రంగు ఎలాంటి భావోద్వేగాన్ని లేదా పక్షపాతాన్ని చూపని రంగుగా పరిగణిస్తారు. ఇది ఏ ఒక్కరి పక్షం వహించని ప్రశాంతమైన, హుందా అయిన రంగు. ఇది తటస్థ రంగు కాబట్టి, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడమే ఈ యూనిఫాం ముఖ్య ఉద్దేశం. లాయర్లు తమ ఖరీదైన దుస్తులు లేదా సామాజిక హోదాను ప్రదర్శించకూడదు. నల్ల కోటు ధరించడం ద్వారా కోర్టులో అందరూ సమానమనే ఒకే గుర్తింపును పొందుతారు.

45
లాయర్లు, జడ్జిల నల్లకొటులో ఇంత అర్థం ఉందా?

నలుపు రంగును గౌరవం, అధికారం, విధి, అంకితభావానికి చిహ్నంగా చూస్తారు. ఒక లాయర్ నల్ల కోటు ధరించినప్పుడు అతని వ్యక్తిగత ఇష్టాఇష్టాలు పక్కకుపోతాయి. తన సొంత ఇష్టాలను పక్కన పెట్టి, న్యాయాన్ని నిలబెట్టే బాధ్యతను పూర్తిగా స్వీకరిస్తున్నాడని ఇది సూచిస్తుంది.

 న్యాయదేవత కళ్లకు గంతలు కట్టినట్లే న్యాయమూర్తులు, లాయర్లు తీర్పు ఇచ్చేటప్పుడు లేదా వాదించేటప్పుడు సంబంధిత వ్యక్తి రంగు, కులం, మతం, వర్గాన్ని చూడకూడదు. చట్టం దృష్టిలో అందరూ ఒక్కటేనని ఈ కోటు ప్రతిబింబిస్తుంది.

55
లాయర్లు తెల్లటి నెక్ బ్యాండ్ ఎందుకు ధరిస్తారు?

భారతదేశంలో ప్రస్తుత న్యాయ వ్యవస్థలు, కోర్టు విధానాలు చాలా వరకు బ్రిటిష్ పాలనలోనే వచ్చాయి. 1961 భారత న్యాయవాదుల చట్టం ప్రకారం, భారతదేశంలోని లాయర్లందరూ కోర్టుకు వచ్చేటప్పుడు నల్ల కోటు, తెల్లటి నెక్ బ్యాండ్ ధరించడం తప్పనిసరి చేశారు. 

అయితే నల్ల కోటుతో పాటు మెడలో ధరించే ఈ తెల్లటి బ్యాండ్ స్వచ్ఛమైన మనస్సాక్షికి, నిజాయితీకి ప్రతీక. అలాగే కొన్ని కథల ప్రకారం, తెలుపు రంగు విశ్వాసానికి సంబంధించిన ధర్మశాస్త్ర పలకలను సూచిస్తుందని కూడా భావిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories