బయటికి వచ్చిన తర్వాత కాకి చాలా సిగ్గుపడింది. తాను ముందుగా అందరితో ఎలా ప్రవర్తించిందో గుర్తుచేసుకుంది. “నేను మీతో చాలా చెడ్డగా మాట్లాడాను. అయినా మీరు నా ప్రాణాలు కాపాడారు. నన్ను క్షమించండి” అంటూ కోయిల, తాబేలుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కథ చెప్పే సందేశం ఏంటంటే.. అహంకారం మనల్ని ఒంటరిగా చేస్తుంది. వినయం మనకు మిత్రులను సంపాదిస్తుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎవరినీ తక్కువగా చూడకూదు. ఎవరితో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో అని జీవించాలనే గొప్ప సందేశాన్న ఈ కథ అందిస్తుంది.