Motivational Story: చీ.. ఇదేం జీవితం.! మనలో చాలా మందికి ఏదో ఒకసారి ఇలాంటి ఫీలింగ్ కలిగే ఉంటుంది. అయితే జీవితం ఎంతో గొప్పది, ఆ గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే జీవితాన్ని ఆస్వాదించాల్సిందే అని చెప్పే ఒక మంచి కథ ఇప్పుడు తెలుసుకుందాం.
రాజు అనే యువకుడు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుండే వాడు. మంచి ఆదాయం, పిల్లలు, భార్య జీవితం సాఫీగా సాగుతోంది. అయితే ఉన్నట్లుండి రమేష్ జీవితంలో కష్టాలనే చీకట్లు అలుముకున్నాయి. ఉద్యోగం పోయింది. తన దగ్గర అప్పు తీసుకున్న వారు ఎగ్గొట్టారు. ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి, అవమానాలు, వైఫల్యాలు వరుసగా వచ్చాయి. “ఇంకా ఎందుకు బతకాలీ?” అనే ఆలోచన రోజూ వెంటాడింది. జీవితం మొత్తం చీకటిగా అనిపించింది.
25
ఆత్మహత్యే శరణ్యమనుకొని
ఇక జీవితానికి ముగింపు పలకడమే తన సమస్యలకు పరిష్కారమని భావించిన రాజు.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సూసైడ్ లెటర్ రాసి చనిపోవాలని నిర్ణయిచుకున్నాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రాత్రి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ సమయంలో విపరీతమైన వర్షం కురుస్తోంది, బలమైన గాలులు వీస్తున్నాయి. ఆకాశం అంతా అల్లకల్లోలంగా ఉంది.
35
జీవిత పాఠం నేర్పిన పిట్ట గూడు
భారీ వర్షం కురుస్తుండడంతో తడవకుండా ఓ చెట్టు కింద నిలబడ్డాడు. ఈ సమయంలోనే చెట్టుపై ఉన్న ఓ పిట్ట గూడుపై రమేష్ దృష్టి పడింది. గూడులో వర్షానికి తడుస్తున్నా ఓ పిట్ట పిల్లలను కాపాడేందుకు రెక్కలను చాపింది. వేగంగా వీస్తున్న గాలిని తన చిట్టి రెక్కలతో ఆపుతూ పిల్లలను రక్షిస్తోంది. ఇది చూసిన రమేష్ కళ్లు చమర్చాయి. “ఈ చిన్న పక్షి కూడా ఇంత కష్టంలో తన బాధ్యత వీడలేదు. తన బిడ్డలను రక్షించుకునేందుకు తాపత్రయ పడుతూనే ఉంది. నేను మనిషిని అయ్యుండి ఇలా చనిపోతున్నాను” అని అనుకున్నాడు. ఆ పిట్ట పోరాటం అతనిలో మళ్లీ ఓ కాంతి వెలిగించింది.
అది చూసిన రమేష్ తన ఆలోచనను మార్చుకున్నాడు. ధైర్యాన్ని కూడగట్టుకొని తిరిగి ఇంటికి వెళ్లాడు. రాత్రి ప్రశాంతంగా పడుకున్నాడు. ఉదయం లేవగానే ఆకాశం నిర్మానుష్యంగా మారింది, వర్షం తగ్గింది. తాను రాసిన సూసైడ్ లెటర్‌ను చింపేసి.. మరో లెటర్‌పై “జీవితం నన్ను పరీక్షించింది… కానీ నేను వెనుదిరగను.” అని రాసుకున్నాడు. మళ్లీ కష్టపడడం ప్రారంభించాడు.
55
కొన్నేళ్ల తర్వాత అంతా మారింది
జీవితాన్ని మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టాడు రమేష్. చిన్న చిన్న పనులు చేస్తూ జీవితాన్ని మళ్లీ పట్టాలెక్కించాడు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఆదాయం పెరిగింది. అప్పు ఎగ్గొట్టిన వారే మళ్లీ తిరిగొచ్చి చెల్లించారు. దీంతో రమేష్ తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే రోజులు వచ్చాయి.
నీతి:
ఈ చిన్న కథలో ఎంతో గొప్ప సందేశం దాగి ఉంది. ఆ రోజు ఆ పిట్టకు వచ్చినట్లే రమేష్‌కి కూడా కష్టం వచ్చింది. ఆ రాత్రి ఓపికతో ఉన్న పిట్టలు మరుసటి రోజు సూర్యోదయాన్ని చూశాయి. కష్టాలను తట్టుకున్న రమేష్‌కి కూడా జీవితంలో చీకట్లు తొలగిపోయి మళ్లీ వెలుగులు వచ్చాయి. అందుకే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. ఓపికతో ఉంటే ఏదో ఒక రోజు జీవితం మనకు నచ్చినట్లు మారుతుంది.