ప్ర‌య‌త్నిస్తే క‌చ్చితంగా గెలిచి తీరుతాం.. కథ పాతదే కానీ జీవితానికి సరిపోయే సందేశం ఉంటుంది

Published : Oct 21, 2025, 03:41 PM IST

Motivational story: చిన్న‌ప్పుడు మనం పాఠ్య పుస్త‌కాల్లో ఎన్నో క‌థ‌లు చ‌దివి ఉంటాం. ఇలాంటి క‌థ‌లు జీవితానికి స‌రిపోయే సందేశాన్ని అందిస్తుంటాయి. జీవితంలో విజ‌యం సాధించాలంటే ప్ర‌య‌త్నం ఒక్క‌టే మార్గ‌మ‌ని చెప్పే ఒక నీతి క‌థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
కుందేబు, తాబేలు క‌థ

ఒకప్పుడు ఒక అడవిలో కుందేలు, తాబేలు ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. కుందేలు చాలా వేగంగా పరుగెత్తగలదు. అందుకే అది తాను ఎంత వేగంగా ఉన్నానో గర్వంగా చెప్పుకునేది. తాబేలు మాత్రం నెమ్మ‌దిగా న‌డిచేది.

25
పోటీకి సవాలు

ఒకరోజు కుందేలు తాబేలకు చెప్పింది – “మనిద్దరం పందెం చేద్దామా? నేను ఎంత వేగంగా ఉన్నానో నీకు చూపిస్తా.” తాబేలు నవ్వుతూ, “సరే, చూద్దాం ఎవరు గెలుస్తారో,” అని అంగీకరించింది. అందరూ తాబేలు నెమ్మదిగా నడుస్తుంది కాబట్టి అది ఓడిపోతుందని అనుకున్నారు. నిజానికి తాబేలు కూడా తాను ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని అనుకుంది. అయినా ప్ర‌య‌త్నిస్తాన‌ని రంగంలోకి దిగింది.

35
కుందేలు నిద్రలో, తాబేలు ప్రయాణంలో

పందెం మొదలైంది. కుందేలు వేగంగా పరిగెత్తి చాలా ముందుకి వెళ్లింది. “తాబేలు ఇంకా చాలా వెనుకే ఉంది,” ఎలాగో తాబేలు రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కు కాసేపు విశ్రాంతి తీసుకుంటా అనుకొని కుందేలు చెట్టు కింద ఓ కునుకు తీస్తుంది. అయితే కుందేలు దూసుకెళ్లింది క‌దా ఇక నా ఓట‌మి ఖాయ‌మ‌ని తాబేలు అనుకోలేదు.. నెమ్మ‌దిగా అడుగులో అడుగు వేస్తూ త‌న ప్ర‌యాణాన్ని ముందుకు సాగించింది.

45
తాబేలు విజయం

కొంతసేపటికి కుందేలు నిద్రలేచింది. పందెం గుర్తుకు వచ్చి పరుగెత్తింది. కానీ అప్పటికే తాబేలు గమ్యస్థానాన్ని చేరుకుని, రేస్‌ గెలిచింది! కుందేలు ఆశ్చర్యపోయి తలదించుకుంది.

55
సందేశం ఏంటంటే.?

ఈ చిట్టి క‌థ మ‌న‌కు ఎంతో సందేశాన్ని అందించింది. ఎంత వేగంగా, ఎంత బలంగా ఉన్నా ప్రయోజనం లేదు. నిరంతర ప్రయత్నం చేస్తేనే విజయం వస్తుంది. అలాగే కుందేలు మాదిరిగా గ‌ర్వం, నిర్ల‌క్ష్యం వంటివి మ‌న‌ల్ని ఓడిస్తాయ‌నే గొప్ప నీతి ఈ క‌థ‌లో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories