అమెరికాలో మూతబడుతున్న కాలేజీలు ... ట్రంప్ కాదు, అసలు కారణాలివే..!

Published : Oct 21, 2025, 02:05 PM IST

అమెరికాలో కాలేజీలు మూతబడుతున్నాయి… గత కోనేళ్ళలో 800 కాలేజీలు, 9499 క్యాంపస్ లు క్లోజ్ అయ్యాయి. ఇందుకు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఒక్కడే కారణం కాదు.. మరేంటో తెలుసా?  

PREV
16
అమెరికాలో కాలేజీలు మూతపడటానికి ప్రధాన కారణాలివే

1 . తగ్గుతున్న జనాభా

భార్య - భర్త .. ఇద్దరు వ్యక్తులు...

ఒక జంటకు 2.1 పిల్లలు పుడితే జనాభా స్థిరంగా ఉన్నట్లు.

ఒక జంటకు ఇద్దరు పిల్లలు అంటే అర్థం చేసుకోవచ్చు.

మరి ఈ పాయింట్ ఒకటి ఏంటి ?

ఇరవై జంటలకు ఇరవై ఒక్క మంది పిల్లలు.

పుట్టిన పిల్లందరూ బతకరు కదా!

అందుకోసం ఈ పాయింట్ ఒకటి.

గత కొంత కాలంగా యువతీ యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం తగ్గిపోయింది.

పెళ్లి చేసుకొన్నా... పిల్లలు వద్దనుకోవడం పెరిగిపోతోంది.

ఇలాంటి వారిని డింక జంట అంటారు.

పిల్లలు కావాలనుకున్నా పుట్టరు.

దానికి కారణాలు అనేకం .

అందుకే సంతాన సాఫల్య కేంద్రాలు .. చెదలపుట్టల్లా ... ప్రతి వీధిలో .

అమెరికా లో ఇప్పుడు ఫెర్టిలిటీ రేట్ 1.6

ఇలా ఉంటే ఏమి జరుగుతుంది ?

కాలం గడిచే కొద్దీ వృద్ధ జనాభా పెరిగిపోతుంది ..

పిల్లల.. యువతీయువకుల సంఖ్య తగ్గిపోతుంది .

అందుకే అమెరికా లో కాలేజీ లలో చేరే వారి సంఖ్య .. తగ్గిపోతోంది .

కాలేజీ లు మూతబడుతున్నాయి .

26
2 . కాలేజీ లు మూతబడడానికి రెండోది ఆర్థిక కారణాలు

కాలేజీలు నడపడం బాగా ఖర్చుతో కూడుకొన్న వ్యవహారంగా మారింది . ఒక పక్క పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలు .

రెండోది కొత్త టెక్నాలజీ .

ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ కనుగుణంగా కాలేజీ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్ గ్రేడ్ చేసుకోవాలి .

పెరుగుతున్న జీత భత్యాలు.

అమెరికా లో కాలేజీ లు ... ప్రైవేట్ రంగంలో ..

స్టేట్ ఫండింగ్ తగ్గిపోతోంది .

ఒక పక్క పడిపోతున్న అడ్మిషన్స్ .

మరో పక్క అధిక ఖర్చులు . యాజమాన్యాలు దివాళా .

36
3 . కాలేజీ లో చేరాలా ? డిగ్రీ అవసరమా ?

3 .  అవసరం అనుకొంటే ఆన్లైన్ లో చేరితే సరిపోతుంది కదా? కాలేజీలో చేరడం దేనికి .. అనుకొనేవారి సంఖ్య అమెరికా లో బాగా పెరిగిపోతోంది .

కాలేజీల మూతకు ఇదొక కారణం .

రానున్న రోజుల్లో కృత్రిమ మేధ బోధకులు వచ్చేస్తారు .

ఇది కొన్ని కాలేజీ లకు అనుకూలం .

చిన్నాచితకా మధ్య స్థాయి కాలేజీలు మూతబడుతాయి .

ఇండియా లో సంగతేంటి ?

ఇండియా లో కూడా ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతోంది .

2018 - 2024 మధ్య.... బడిలో విద్యార్థుల సంఖ్య కోటి యాభై అయిదు లక్షలు తగ్గిపోయింది.

ఒక బడిలో పదో తరగతి పరీక్ష రాసి బయటకు వెళుతున్న విద్యార్థుల సంఖ్య వంద ఉంటే ... ఎల్ కేజీ/ ఒకటో తరగతి లో చేరే విద్యార్థుల సంఖ్య నలబై - యాభై మాత్రమే .

తెలంగాణ లో ఒక బడిలో విద్యార్థుల సగటు సంఖ్య 83 కు పడిపోయింది .

ప్రభుత్వ బడుల్లో అయితే ఇది 72 మాత్రమే .

పది తరగతులకు 72 - 80 ... అంటే ... ఒక తరగతికి ఎంత మంది ? ఆలోచించండి .

తెలంగాణ లో 2245 ప్రభుత్వ బడుల్లో ఒక్కటంటే ఒక్క కొత్త అడ్మిషన్ జరగలేదు .

9447 బడుల్లో కొత్త అడ్మషన్స్ ముప్పై లోపు .

బీహార్ , ఉత్తర్ ప్రదేశ్ లో అయితే పరిస్థితి ఇంకా దారుణం .

ప్రభుత్వ బడులే కాదు ..

ప్రైవేట్ బడుల్లో కూడా ఇదే పరిస్థితి .

కాకపోతే... ప్రైవేట్ యాజమాన్యాలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శితున్నాయి .

ఎలాగైనా అడ్మిషన్స్ జరగాలని ఫీజు లో భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి .

46
బతికిన కాలేజీ - చచ్చిన కాలేజీ ఆంటే ?

ఎన్నో ఏళ్ళ క్రితం మాట !

మా అమ్మమ్మ టూర్ కు వెళ్ళొచ్చింది .

ఏమి చూసావంటే .. "బతికిన కాలేజీ .. చచ్చిన కాలేజీ" అంది . అప్పుడు నాకు అర్థం కాలేదు .

బతికిన కాలేజీ అంటే జూ .

చచ్చిన కాలేజీ అంటే మ్యూజియం .

ఇక్కడ మరణించిన జంతువుల చర్మం , అస్థిపంజరాలు ప్రదర్శిస్తారు కదా ..

రాబొయ్యే రోజుల్లో బతికే కాలేజీ లు తక్కువ .

చచ్చిన కాలేజీ లు ఎక్కువ .

ఇండియా లో కాలేజీ లు ఎలా నడుపుతున్నారు అనేది .. ప్రపంచం లో ఏడో వింత .

ప్రతి పార్టీ ఎన్నికలకు వెళ్లేముందు యాభై- వంద కొత్త పధకాలు ప్రకటిస్తాయి .

ప్రభుత్వాలు దివాళా .

ఫీజు రీ ఇంబర్స్మెంట్ కు కు డబ్బులు వుండవు .

మూడేళ్లకు.. నాలుగేళ్లకు కూడా పభుత్వం నుండి డబ్బు రాదు . జీతాలు ఎలా ఇస్తారు ?

కాలేజీ ఎలా నడుపుతారు

. ... ఎవరయినా ఈ అంశం పై పరిశోధన చేస్తే పీహెచ్డీ ఖాయం .

రాబొయ్యే రోజుల్లో ఎన్రోల్మెంట్ మరింత పడిపోతుంది .

అప్పటికి రియల్ ఎస్టేట్ ధరలు కూడా పడిపోతాయి ..

ఎక్కడో కొన్ని నగరాల్లో తప్పించి పడిపోతున్న జనాభా కారణంగా రియల్ ఎస్టేట్ పడిపోవడం ఖాయం .

ఇప్పుడే కాలేజీ ని అమ్ముకొని బయటపడినోడు తెలివైనోడు .

పీహెచ్డీ అంటే గురొచ్చింది .. ప్రపంచ వ్యాప్తంగా దివాళా తీస్తున్న ఉన్నతవిద్యా సంస్థలు లక్ష రూపాయిలకు కూడా గౌరవ డాక్టరేట్ ప్రకటిస్తున్నాయి .

విదేశీ ఈక్విటీ లు... కరోనా కాలం లో బయ్యా జ్యూస్ లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో పెట్టుబడి పెట్టాయి .

ఆ డబ్బు కాస్త గంగలో... కావేరి లో కలిసింది .

ఇప్పడు పిచ్చి పట్టినట్టు వేల కోట్లు పెట్టి ప్రైవేట్ బడుల్ని కొంటున్నాయి .

తెలివైన యాజమాన్యాలు పూర్తిగా అమ్మేసి లేదా సగం అమ్మి బయటపడుతున్నాయి .

కొత్త దుకాణాలు ప్రస్తుతానికైతే బిల్డింగ్ లు అదీ ఇదీ అని ఊదరగొట్టి అడ్మిషన్స్ తెచ్చుకొంటున్నాయి.

56
ప్రస్తుతం సిబిఎస్సీ క్రేజ్ వుంది .

స్టేట్ బోర్డు నుంచి తీసి మూడు రెట్ల ఫీజు తో సిబిఎస్సీ ఇంటర్నేషనల్ schools లో చేర్చి తల్లితండ్రులు ఖుషి ఖుషి గా ఉన్నారు.

పేరు గొప్ప వూరు పరమ దిబ్బ .. అని ఇప్పటికే కొంతమంది అర్థం చేసుకొన్నారు.

మరో మూడేళ్ళలో సీబీఎస్సీ బుడగ పేలిపోతుంది.

1 . నాణ్యత ఉన్న బడులు.. కాలేజీ లు మాత్రమే నిలుస్తాయి .

2 . ఒక సారి మీ కాలేజీ రోజులు గుర్తుకు తెచ్చుకోండి .

క్లాస్ రూమ్ లో మీరు ఏమి నేర్చుకొన్నారో .. అంతకన్నా ఎక్కువ కాలేజీ లైఫ్ మీకు నేర్పింది .

మీ పర్సనాలిటీ అక్కడే రూపు దిద్దుకొంది.

అవునా ? కాదా?

ఆన్లైన్ కోర్స్ లు .. రోబో టీచర్ లు... సబ్జెక్టు అయితే బుర్రలోకి వెళుతుంది .

మరి సోషల్ ఇంటలిజెన్స్ ?

ఎమోషనల్ ఇంటలిజెన్స్ ?

కాలాబోరేషన్ స్కిల్స్ ?

లీడర్షిప్ స్కిల్స్ ?

కాలేజ్ లు మూతబడితే వాటిలో ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి ?

ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్స్ తగ్గితే డీఎస్సీ నోటిఫికెషన్స్ వస్తాయా ?

రాబొయ్యే రోజుల్లో బాగా లాభాలు ఇచ్చే కొన్ని రంగాలు .

1 . ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఎల్డర్లి కేర్ .

2 . ఫార్మా .. డయాగ్నస్టిక్ సెంటర్ లు .. హెల్త్ insurance ... స్టార్ ఆసుపత్రులు ..

ఆసుపత్రుల్లోనే .. వృద్ధులు ఉండేలా కొత్త ఏర్పాట్లు వచ్చేస్తాయి .

అంటే అలా ఏజ్ హోమ్... ప్లస్... ఆసుపత్రి .. దియాగ్నస్టిక్ సెంటర్ అన్నమాట

.అక్కడే బస .

విందు .. వినోదం ..

ప్రతి రోజు హెల్త్ చెక్ అప్ .

చికిత్స.

పాపపు సొమ్ము ఎంత చేతిలో ఉంటే అన్ని రోగాలు ..

చికిస్థలు ..

ఫైనల్ గా అక్కడే ... పక్కనే.. అనుబంధంగా... అంతిమ నిద్రా స్థలం .

ప్రొఫషనల్ బృందం ..

ఏడవడం ..

గుండెలు బాదుకోవడం ..

కొరివి పెట్టడం . లేదా స్విచ్ నొక్కడం దా...క అన్నీ చేస్తారు .

కొంత మంది రాజులు బతుకుండగానే తమ సమాధి నిర్మించుకున్నారట .

రాబొయ్యే రోజ్జుల్లో తమ అంతిమ సంస్కారం ప్యాకేజీ ఎన్నుకొనే అవకాశం వ్యక్తులకు వచ్చేస్తుంది .

కావాలనుకొంటే అది ఎలా ఉంటుందో .. కృత్రిమ మేధ సాయం తో ముందుగానే సినిమా చూడొచ్చు .

గుర్రం జాషువా గారి .. "ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి .. కానీ ఈ స్మశాన స్థలిన్ కన్నులు మూసిన... ఒక్కడు ఒకడు అయినా లేచి రాడు? కు సమాధానం దొరుకుతుంది .

ఎందుకంటే వారు ... మరీ అంత మంద భాగ్యులు కాదు కదా.

బతికిన సమాజాన్ని చూసిన వారు చచ్చిన సమాజానికి రమ్మంటే వస్తారా ?

66
3. కమ్యూనల్ కిచెన్

రాబొయ్యే రోజుల్లో అపార్ట్మెంట్స్ లో ఒక పెద్ద కిచెన్ . ప్రతి ఫ్లాట్ లో వంటగది అనేది పాతబడిపోతుంది .

హోటల్ లో వంద రూములు .. కానీ అందరికీ కలిపి ఒకటో మూడో రెస్టారెంట్ లు .

రాబొయ్యే రోజుల్లో అపార్ట్మెంట్ లో కూడా అంతే.

4. ఇప్పటికే మాదాపూర్ లాంటి చోట్ల కో లివింగ్ హాస్టల్స్ వచ్చేసాయి . ఇది కాకుండా షార్ట్ టైం కోసం వాయ్యో హోటల్స్ వున్నాయి .

ఇది మరింత విస్తృతం అవుతుంది .

డేటింగ్ మొదలు .. మేటింగ్ దాక... అన్నీ ఒకే చోట జరిగే ఏర్పాట్లు .

నేను అతిగా ఊహిస్తున్నట్టు అనిపిస్తుందా ?

అయితే దయచేసి పోస్ట్ సేవ్ చేసుకోండి .

ఒక ఐదేళ్లకు చెక్ చెయ్యండి .

ఆంటే.. ఇక రాబోయే రోజులు చీకటేనా ?

చీకటి .. వెలుతురు..

అదే దీపావళి .

అమావాస్య చీకట్లో...

దీపాల వరస .

క్రిటికల్ థింకింగ్ మనపాలిట దీపాల వరుస .

అది ఉన్నోళ్లే .. వారి ప్రజాతి .. బతుకుతారు .

మిగతా వారు .. డిజిటల్ గొర్రెలు .. కాలగర్భంలో కలిసిపోతారు .

ఇదే సోషల్ డార్వినిజం .

శుభ దీపావళి .

మీ ఇంట జ్ఞాన జ్యోతులు వెలుగు కాక!

Read more Photos on
click me!

Recommended Stories