Motivational Story: ఉన్న‌దాంట్లో బ‌త‌క్క‌పోతే ఉన్న‌ది కూడా పోతుంది.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ

Published : Jan 31, 2026, 11:04 AM IST

Motivational Story: జీవితంలో గొప్పగా బతకాలి, ఉన్నత స్థానానికి చేరుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఈ క్రమంలో తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాలు మన పతనానికి దారి తీస్తాయి. ఇలాంటి సందేశాన్ని అందించే ఒక గొప్ప కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
చిన్న దుకాణంతో మొదలైన రాజు జీవితం

రాజు అనే వ్యక్తి ఒక చిన్న పట్టణంలో నివసించేవాడు. బస్ స్టాండ్ దగ్గర చిన్న కిరాణా దుకాణం పెట్టాడు. మొదట రోజుకు వచ్చే లాభం తక్కువే. అయినా క్రమంగా కస్టమర్లతో మంచిపేరు సంపాదించాడు. నాణ్యమైన సరుకులు, నిజాయితీ ధరలు అతడిని ముందుకు నడిపించాయి. దీంతో క్రమంగా తన అప్పులను తీర్చే స్థాయి వరకు చేరుకున్నాడు.

25
నెమ్మదిగా పెరుగుతున్న ఆదాయం

రోజులు గడిచే కొద్దీ దుకాణానికి వచ్చే వారు పెరిగారు. నెల చివరికి రాజు చేతికి మంచిపొదుపు మిగిలేది. కుటుంబ ఖర్చులు సులభంగా నడిచాయి. పిల్లల చదువు, ఇంటి అవసరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగాయి. ఈ స్థిరమైన ఆదాయం అతడికి భద్రత భావాన్ని ఇచ్చింది.

35
ఒక్కసారిగా ఎక్కువ సంపాదించాలనే ఆశ

ఇలా జీవితం సాఫీగా సాగుతోన్న తరుణంలో రాజుకు ఒక్కసారిగా ఆశ పెరిగింది. పట్టణంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను చూసి వారిలా కోట్లు సంపాదిచాలనుకున్నాడు. అనుకోవడంలో తప్పులేదు కానీ ఎలాగైనా అవ్వాలనుకున్నాడు. వీలైనంత త్వరగా ధనవంతుడు కావాలనుకున్నాడు. అందుకోసం ఎంతకైనా దిగజారినా పర్లేదు అనుకున్నాడు.

45
తప్పుదారి తొక్కాడు

తొందరగా డబ్బులు సంపాదించాలన్న అత్యాశ రాజును తప్పుదారి తొక్కేలా చేసింది. దుకాణాన్ని విస్తరిస్తున్నా అన్న పేరుతో నకిలీ వస్తువులను విక్రయించడం మొదలు పెట్టాడు. మొదట్లో ఎక్కవ డబ్బులు రావడం మొదలైంది. దీంతో ఎక్కువ వడ్డీతో అప్పు తీసుకొచ్చి భారీగా పెట్టుబడి పెట్టాడు.

55
ఆలస్యంగా బుద్ధి వచ్చింది

నకిలీ వస్తువులను భారీగా విక్రయించడంతో లాభం కూడా భారీగా రావడం మొదలైంది. దీంతో పెద్ద ఎత్తున అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. అయితే అబద్ధం ఎక్కవ రోజు దాగలేదు. నకిలీ వస్తువుల విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. దీంతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. వడ్డీ మాత్రం కొండలా పేరుకుపోయింది. కిస్తీలు కూడా చెల్లించలేని పరిస్థితికి వెళ్లిపోయాడు. దీంతో రాజుకు ఒక విషయం అర్థమైంది. “నెమ్మదిగా, స్థిరంగా ఎదిగితేనే జీవితం బాగుంటుంది. అత్యాశ మన చేతిలో ఉన్నదాన్ని కూడా తీసుకుపోతుంది” అని బాధపడ్డాడు. తాను చేసిన తప్పును అర్థం చేసుకున్నాడు. మళ్లీ చిన్న దుకాణాన్ని మొదలు పెట్టి జీవితాన్ని జీరో నుంచి మొదలు పెట్టాడు.

కథ చెప్పే నీతి ఏంటంటే.?

స్థిరంగా లాభం ఇచ్చే అవకాశాన్ని తక్కువగా చూడకూడదు. అత్యాశతో తీసుకునే నిర్ణయాలు నష్టానికి దారి తీస్తాయి. నెమ్మదిగా ఎదగడం దీర్ఘకాల విజయానికి మార్గమ‌నే గొప్ప సందేశాన్ని ఈ క‌థ ఇస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories