వారంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. అన్ని వార్తలు (Collection of news) చదవడం కుదరదు. వాటిలో కొన్ని మనలో ఆనందాన్ని, ఆసక్తిని (Interest) పెంచేవిలా ఉంటాయి. అలాంటి వార్తలు ఐదింటిని ఎంపిక చేసి ఇక్కడ ఇచ్చాము.
చంటి బిడ్డను చూస్తే మనసు కరిగిపోతుంది. అలాంటది 20 రోజుల వయసు ఉన్న సజీవంగానే పాతి పెట్టేశారు. అయినా కూడా ఆ దేవతల కరుణ ఆ బిడ్డపై ఉంది. అందుకే మట్టి దిబ్బల కింద నుంచి కూడా ఆ చిన్నారి శిశువు గట్టిగా ఏడవగలిగింది. ఆ ఏడుపు విన్న ఒక గొర్రెల కాపరి ఆ పసికందును మట్టి నుంచి బయటికి తీసి కాపాడాడు. సమీపంలో ఉన్న గ్రామస్తులకు చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ పసికందును ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్ పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ బిడ్డ వెంటిలేటర్ పై ఉంది. ఆక్సిజన్ సరిగా అందక ఆమె ఆరోగ్యం క్షీణించింది. వైద్యులు ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా ఆ బిడ్డ బతకాలని కోరుకుందాం.
25
అమ్మంటే ఈమెలా ఉండాలి
తన బిడ్డ పొట్ట నిండితే చాలని కోరుకోలేదు ఆ అమ్మ. తన బిడ్డలాంటి ఎంతోమంది శిశువుల పొట్ట నిండాలని కోరుకుంది. అందుకే తల్లిపాలను ఉచితంగా అందించింది. ఆమె ఎవరో కాదు బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల. రెండోసారి ఆమె తల్లి అయింది. తన బిడ్డ తాగగా మిగిలిన పాలను సేకరించి దగ్గర్లోనే మిల్క్ బ్యాంకుకు దానం చేసింది. అలా ఇప్పటివరకు ఆమె 30 లీటర్ల పాలను దానం చేసింది. నెలలు నిండకముందే పుట్టిన శిశువులు తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు తల్లిపాలు ఎంతో అవసరం. కొన్ని సార్లు బిడ్డ పప్రస సమయంలోనే తల్లిని కోల్పోతుంది. అలాంటి వారికి కూడా తల్లిపాలు అవసరం. అందుకే మిల్క్ బ్యాంకులను పెట్టి తల్లిపాలను సేకరిస్తూ ఉంటారు. వాటిని సరైన ఉష్ణోగ్రతలో ఉంచి నిల్వ ఉంచుతారు. అలాంటి మిల్క్ బ్యాంకుకు బాలింతలు తల్లిపాలను దానం చేస్తే ఎంతోమంది బిడ్డల ప్రాణాన్ని కాపాడిన వారవుతారు.
35
ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టిన యువకుడు
ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే ఆనందంతో పొంగిపోతాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్లోని మెగా డీఎస్సీలో ఒక యువకుడు ఏకంగా ఐదు టీచర్ పోస్టులకు అర్హత సాధించాడు. ఆయన పేరు శేషాద్రి. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న ఓఎస్ గొల్లపల్లె గ్రామానికి చెందిన వ్యక్తి తొలి ప్రయత్నంలోనే మెగా డీఎస్సీలో ఐదు టీచర్ ఉద్యోగాలను పొందాడు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, టీజీటీ, ఎస్ఏ పోస్టులకు క్వాలిఫై అయ్యాడు. సోషల్, తెలుగు రెండు సబ్జెక్టులకు సంబంధించి మొత్తం ఐదు పోస్టులకు సెలెక్ట్ అయ్యాడు. అతని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలే. అందుకే తాను కష్టపడి చదివానని మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించాలని చెప్పుకొచ్చాడు శేషాద్రి.
కెమెరా అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరానే పెద్దది అనుకుంటారు. కానీ అంతరిక్షాన్ని పరిశీలించేందుకు అతిపెద్ద కెమెరా ఉంది. అది కారు సైజులో ఉంటుంది. ఇది చిలీలో ఏర్పాటు చేశారు. అక్కడ ఉండే నిర్మలమైన ఆకాశం నుంచి అంతరిక్షంలో జరిగే మార్పులను ఈ కెమెరా ఫోటోల రూపంలో బంధిస్తుంది. ఏకంగా కొండమీద పదివేల అడుగుల ఎత్తులో ఈ కెమెరాను సెట్ చేశారు. ఇది 2025 అక్టోబర్ నుంచి తన పని మొదలు పెడుతుంది. అలా పదేళ్లపాటు ఆకాశాన్ని స్కాన్ చేస్తూనే ఉంటుంది.
55
డబ్బున్నోళ్లు పెరిగిపోతున్నారు
ఒకప్పుడు లక్షాధికారి అంటే జిల్లాలో ఒకరో ఇద్దరో ఉండేవారు. ఇప్పుడు గ్రామాల్లో కూడా మిలియనీర్లు పెరిగిపోతున్నారు. ఈ విషయాన్ని మెర్సిడెస్ బెంజ్ హూరూన్ ఇండియా వెల్త్ రిపోర్ట్ తెలియజేసింది. తాజా రిపోర్టులో మన దేశంలో మిలియనీర్ల సంఖ్య ఏటా తిరుగుతున్నట్టు ఆ నివేదిక చెబుతోంది. నివేదిక ప్రకారం మన దేశంలో 8 ఏళ్ల క్రితం ఉన్న మిలియన్ల కుటుంబాలతో పోలిస్తే ఇప్పుడు ఉన్న మిలియనీర్ల కుటుంబాలు రెట్టింపు అయ్యాయి. పదేళ్లలోనే మిలియనీర్లుగా సంఖ్యను 445 శాతానికి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రలోనే అధికంగా డబ్బున్నోళ్ళు ఉన్నారు. టాప్ టెన్ మిలియనీర్ల రాష్ట్రాల్లో తెలంగాణ చోటు సంపాదించింది. కానీ ఏపీకి మాత్రం చోటు దక్కలేదు. తెలంగాణ ఏడవ స్థానంలో నిలిచింది.