Medicine: ట్యాబ్లెట్ స్ట్రిప్‌లపై ఈ రంగుల‌ను గ‌మ‌నించారా.. ఇవేం చెబుతాయో తెలుసా.?

Published : Mar 21, 2026, 03:04 PM IST

Medicine: ఫార్మసీ వద్ద మందులు కొనుగోలు చేసే సమయంలో ట్యాబ్లెట్ స్ట్రిప్‌లపై వేర్వేరు రంగులు కనిపిస్తాయి. చాలామంది వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ రంగులకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. ఇంత‌కీ ఈ క‌ల‌ర్స్ అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ఒక్కో క‌ల‌ర్‌కి ఒక్కో అర్థం

ఈ క‌ల‌ర్స్‌లో ఎంతో స‌మాచారం ఉంటుంది. మందు ఎలా వాడాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమా, లేక సాధారణంగా తీసుకోవచ్చా అనే విషయం కూడా ఆ రంగుల ద్వారానే తెలుస్తుంది. భారతదేశంలో ఔషధ నియంత్రణ వ్యవస్థ కొన్ని ట్యాబ్లెట్ స్ట్రిప్‌లపై ప్రత్యేక రంగు గుర్తులు ఉంచుతుంది. ఇవి ప్రజలు మందులను జాగ్రత్తగా వాడేందుకు సహాయపడతాయి. ఇప్పుడు ఆ రంగుల అర్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

25
ఎరుపు గీత – ప్రిస్క్రిప్షన్ మందులు

ట్యాబ్లెట్ స్ట్రిప్‌పై ఎరుపు రంగు గీత కనిపిస్తే అది ప్రిస్క్రిప్షన్ మందు అని అర్థం. ఈ తరహా మందులు డాక్టర్ సూచనతో మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే కొనాలి. వైద్య పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులు ఈ జాబితాలోకి వస్తాయి. ఈ మందులను స్వయంగా కొనుగోలు చేసి వాడటం ప్రమాదకరం. సరైన డోస్ లేకపోతే ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఉదాహరణకు యాంటీబయాటిక్స్ తప్పుగా వాడితే శరీరం మందులకు ప్రతిస్పందించకుండా మారే ప్రమాదం ఉంటుం

35
ఆకుపచ్చ గీత – OTC మందులు

ట్యాబ్లెట్ స్ట్రిప్‌పై ఆకుపచ్చ రంగు గుర్తు ఉంటే అది OTC (Over The Counter) మందు అని అర్థం. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఫార్మసీలో కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా ఈ మందుల‌ను జ్వరం, తలనొప్పి, జలుబు, చిన్నపాటి నొప్పులు వంటి వాటికి ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ మందులు సాధారణ సమస్యలకు ఉపయోగపడతాయి. అయినా కూడా సూచించిన మోతాదు పాటించడం అవసరం. ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలు రావచ్చు.

45
నీలం గీత – వైద్య పర్యవేక్షణ అవసరం

కొన్ని ట్యాబ్లెట్ స్ట్రిప్‌లపై బ్లూ క‌ల‌ర్ గీత ఉంటుంది. ఇవి కొంత ప్రమాదం ఉండే మందులు. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ అవసరం. ఈ మందులను దీర్ఘకాలిక వ్యాధులు, హార్మోన్ చికిత్స, రక్త సంబంధిత సమస్యలు ఉన్న‌ప్పుడు వాడుతారు. ఇలాంటి మందులను వైద్యుడి సలహా లేకుండా తీసుకోవడం సరైంది కాదు. కొన్ని సందర్భాల్లో రక్తపరీక్షలు లేదా ఆరోగ్య పరీక్షలు కూడా అవసరం కావచ్చు.

55
బ్లాక్ బాక్స్‌ – అధిక రిస్క్ హెచ్చరిక

ట్యాబ్లెట్ స్ట్రిప్ లేదా ఔషధ ప్యాకెట్‌పై నలుపు రంగు బాక్స్‌ లేదా హెచ్చరిక గుర్తు ఉంటే అది అత్యంత జాగ్రత్త అవసరమైన మందు. తీవ్రమైన దుష్ప్రభావాలు వచ్చే అవకాశం, తప్పుగా వాడితే ప్రాణాపాయం, కఠిన వైద్య పర్యవేక్షణ అవసరం వంటి సంద‌ర్భాల్లో దీనిని ఉప‌యోగిస్తారు. ఈ మందులు సాధారణంగా తీవ్రమైన వ్యాధుల చికిత్సలో వాడతారు. అందుకే వాటిపై ప్రత్యేక హెచ్చరిక ఉంటుంది.

మొత్తం మీద ట్యాబ్లెట్ స్ట్రిప్‌పై కనిపించే ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగులు కేవలం డిజైన్ కాదు. అవి ఆ మందు స్వభావం, ఉపయోగం, జాగ్రత్త స్థాయి గురించి కీలక సమాచారం అందిస్తాయి. మందులు కొనుగోలు చేసే సమయంలో ఈ రంగులను గమనించడం ఆరోగ్య భద్రతకు చాలా ఉపయోగపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories