ఎన్ని కష్టాలొచ్చినా సంతోషంగా ఎలా ఉండాలి? ఈ పువ్వు క‌థ చ‌దివితే మీ జీవిత‌మే మారుతుంది

Published : Aug 17, 2025, 01:03 PM IST

మ‌నలో కొంద‌రు చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతుంటారు. ప్రపంచంలో తమకే సమస్యలు ఉన్నాయనట్లు తెగ బాధపడుతుంటారు. అయితే ఈ చిన్న కథ చదివితే మీ ఆలోచన మారడం ఖాయం. 

PREV
15
బాలుడి సందేహం

ఒక చిన్న బాలుడు ప్రతిరోజూ నదీ తీరానికి వెళ్లేవాడు. ఒక రోజు అతని దృష్టి నీటిమీద తేలియాడుతున్న తామరపువ్వుపై పడింది. చుట్టూ బురద, చెత్త, అద్వాన్నంగా నీరు ఉన్నప్పటికీ ఆ తామర శుభ్రంగా, అందంగా వికసించి కనిపించింది. దానిని చూసిన బాలుడు ఆశ్చర్యపోయాడు. "ఇంత మురికిలో పుట్టి కూడా ఇది ఎలా ఇంత అందంగా ఉండగలుగుతోంది?" అన్న సందేహం వచ్చింది.

25
తామరను ఇలా ప్రశ్నిస్తాడు

అదే ఆసక్తితో ఆ బాలుడు తామర పువ్వును ఇలా ప్రశ్నిస్తాడు.. "అంత మురికిలో పుట్టి కూడా నువ్వు ఇంత శుభ్రంగా, అందంగా వికసించగలగడం ఎలా సాధ్యమైంది?" అని అడిగాడు. దానికి ఆ పువ్వు ఇచ్చిన సమాధానం బాలుడు ఆలోచన విధానాన్నే మార్చేసింది.

35
పద్మం ఇచ్చిన సమాధానం ఏంటంటే.?

పద్మం సున్నితంగా చిరునవ్వి ఇలా చెప్పింది: "నా చుట్టూ ఎంత మురికి ఉన్నా నేను దాన్ని పట్టించుకోను. దానిని నా మీద ప్రభావం చూపనీయను. నేనెప్పుడూ ఆకాశాన్ని చూస్తాను, వెలుగును అందుకుంటాను, స్వచ్ఛతను నాలో పెంచుకుంటాను. అందుకే నేను ఇంత అందంగా వికసిస్తాను. సమస్యల్లో కాకుండా, వెలుగులో జీవించడం నేర్చుకున్నాను." అని చెబుతుంది.

45
మన జీవితంలో కూడా అంతే

ఈ సమాధానం విన్న బాలుడు గాఢంగా ఆలోచించాడు. మనిషి జీవితంలో కూడా కష్టాలు, నిరాశలు, అవరోధాలు తప్పవు. కానీ మనం ఆ సమస్యల్లో మునిగితే జీవితం నల్లగా మారుతుంది. దానికి బదులు ధైర్యం, ఆశ, మంచితనం అనే విలువలను మనసులో పెంచుకుంటే జీవితం అందంగా ఉంటుంది.

55
మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే..?

ఈ చిన్న క‌థ‌లో ఎంతో పెద్ద నీతి దాగి ఉంది. ఆ తామ‌ర పువ్వులా మ‌నం కూడా చుట్టూ ఉన్న ప్రతికూలతలను పట్టించుకోకుండా ముందుకు సాగాలి. కష్టాలను అధిగమిస్తూ వెలుగుని చేరుకోవాలి. జీవితం ఎప్పుడూ కొత్త ఆశ ఇస్తుంది. మనం దాన్ని పట్టుకొని ధైర్యంగా ముందుకు నడిస్తే మన జీవితం కూడా తామ‌ర పువ్వులా అందంగా ప్రకాశిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories