Lie Detection: అబద్ధం చెప్పడం సర్వసాధారణం. ఏదో ఒక సమయంలో మనలో ప్రతీ ఒక్కరూ అబద్ధాన్ని చెప్పే ఉంటాం. అయితే ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడా.? అబద్ధం చెప్తున్నాడా.? అన్న విషయాన్ని కొన్ని పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు
ఒక వ్యక్తి అబద్ధం చెప్పేటప్పుడు అతని మెదడు సాధారణం కంటే ఎక్కువగా పని చేస్తుంది. ఎందుకంటే నిజం కాకుండా మరో కథను సృష్టించడానికి మెదడు ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మెదడులో ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణ కూడా వేగంగా జరుగుతుంది. దీనివల్ల ముఖం లేదా ముక్కు వంటి భాగాల్లో స్వల్పంగా వేడి అనిపించవచ్చు.
25
ముక్కు దగ్గర వేడి అనిపించడం
కొన్ని అధ్యయనాల ప్రకారం అబద్ధం చెప్పేటప్పుడు ముక్కు చుట్టూ ఉన్న భాగంలో ఉష్ణోగ్రత కొంచెం పెరగవచ్చు అని చెబుతున్నారు. దీనిని కొందరు “పినోకియో ఎఫెక్ట్” అని కూడా అంటారు. రక్త ప్రసరణ పెరగడం వల్ల ముక్కు వద్ద కొంచెం వేడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
35
ముఖంలో మారే భావాలు
అబద్ధం చెప్పే సమయంలో చాలా మంది ముఖంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. సాధారణంగా మాట్లాడేటప్పుడు ఉండే ధైర్యం కొంచెం తగ్గిపోతుంది. కొందరికి ఆందోళన కనిపిస్తుంది. ఈ మార్పులు ముఖభావాల్లో కనిపించడం వల్ల ఎదుటి వ్యక్తికి ఏదో దాచుతున్నట్టు అనిపించవచ్చు.
చాలా మంది అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తి కళ్లలోకి నేరుగా చూడకుండా మాట్లాడుతారని భావిస్తారు. వారు చూపును దూరంగా తిప్పడం లేదా తరచూ కళ్లను మూయడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే కొందరు ముక్కును తడుముకోవడం లేదా చేతులతో ముఖాన్ని తాకడం వంటి అలవాట్లు కూడా చూపించవచ్చు.
55
మాట తీరు మారిపోవడం
అబద్ధం చెప్పేటప్పుడు మాట్లాడే విధానంలో కూడా మార్పు కనిపించవచ్చు. కొందరు చాలా నెమ్మదిగా ఆలోచిస్తూ మాట్లాడుతారు. మరికొందరు మాత్రం వేగంగా మాట్లాడి విషయం మార్చే ప్రయత్నం చేస్తారు. ఈ మార్పులు వారి మనసులో ఉన్న ఒత్తిడిని సూచించే లక్షణాలుగా భావిస్తారు.
గమనిక: పై లక్షణాలు కొన్ని సందర్భాల్లో కనిపించవచ్చు. అయితే ఈ సంకేతాల ఆధారంగా మాత్రమే ఎవరైనా అబద్ధం చెబుతున్నారని నిర్ణయించడం సరైంది కాదు. ఒక వ్యక్తి ప్రవర్తనను అర్థం చేసుకోవాలంటే అనేక అంశాలను కలిసి పరిశీలించడం అవసరం.