Books City: పుస్తకాలు చదవడం అంటే చాలామందికి ఇష్టం. కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా పుస్తకాలు మంచి మార్గం. మన దేశంలో ఒక నగరం పుస్తకాల ప్రపంచానికే ప్రత్యేక చిరునామాగా నిలిచింది. అక్కడ అన్నీ బుక్స్ షాపులే. ఆ సిటీ ఏదో చూద్దాం.
మనలో కొందరికి కథల పుస్తకాలంటే ఇష్టం ఉంటే, మరికొందరికి చరిత్ర, విజ్ఞానం, నవలలు, జీవిత చరిత్రలు చదవడం ఇష్టం ఉంటుంది. సాధారణంగా మనం పుస్తకాలు కొనాలంటే బుక్ స్టోర్లకు వెళ్తాం. కానీ మన దేశంలో ఒక నగరం మాత్రం పుస్తకాలకు ప్రత్యేక చిరునామాగా నిలిచింది. ఇక్కడ రోడ్ల పక్కన ఎక్కడ చూసినా పుస్తకాల దుకాణాలే కనిపిస్తాయి. పాత పుస్తకాల నుంచి కొత్త పుస్తకాల వరకు, అరుదైన గ్రంథాల నుంచి విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ నగరాన్ని భారత దేశపు పుస్తకాల నగరం అని పిలుస్తుంటారు. ఆ నగరం ఏదో ఇక్కడ తెలుసుకుందాం
25
కోల్‌కతాలోని కాలేజ్ స్ట్రీట్
పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా నగరం పుస్తకాలు, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ నగరానికి పుస్తకాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ఇక్కడి ప్రజల్లో చదివే అలవాటు తరతరాలుగా కొనసాగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, పరిశోధకులు, పుస్తక ప్రియులు ఎక్కువగా పుస్తకాల కోసం వచ్చే ప్రాంతం కాలేజ్ స్ట్రీట్.
35
కాలేజ్ స్ట్రీట్ ప్రత్యేకత ఏంటి?
కోల్‌కతాలోని కాలేజ్ స్ట్రీట్ ప్రపంచవ్యాప్తంగా పుస్తక ప్రియులకు సుపరిచితమైన ప్రాంతం. సుమారు 1.5 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ వీధిలో అనేక పుస్తకాల షాపులు, పాత పుస్తకాల స్టాళ్లు, ప్రచురణ సంస్థలు కనిపిస్తాయి. ఇక్కడ కొత్త పుస్తకాలతో పాటు పాత పుస్తకాలు కూడా తక్కువ ధరలకు లభిస్తాయి. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, సాహిత్య రచనలు, పరిశోధనా గ్రంథాలు ఇలా ఎన్నో రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అందుకే పుస్తకాలు కొనాలనుకునేవారికి కాలేజ్ స్ట్రీట్ ఒక ప్రత్యేక ప్రపంచంలా కనిపిస్తుంది.
సాధారణంగా పాత పుస్తకాలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ కోల్‌కతాలో మాత్రం పాత పుస్తకాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, పుస్తక సేకరణకర్తలు, పరిశోధకులు ఇక్కడి పాత పుస్తకాల షాపులను సందర్శిస్తుంటారు. కొత్త పుస్తకాలు కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేని వారికి పాత పుస్తకాలు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటాయి.
55
మరో నగరానికి కూడా ప్రత్యేక గుర్తింపు
కేరళలోని కోజికోడ్ నగరానికి 2023లో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో సాహిత్య విభాగంలో స్థానం లభించింది. దీంతో కోజికోడ్ భారత దేశపు తొలి యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్‌గా గుర్తింపు పొందింది. అక్కడ కూడా అనేక గ్రంథాలయాలు, పుస్తక ప్రదర్శనలు, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.