హిందూ విశ్వాసాల ప్రకారం.. బంగారాన్ని ఎంతో ముఖ్యమైన లోహంగా భావిస్తారు. అందుకే కాస్త డబ్బు ఉన్నా.. బంగారాన్ని కొంటుంటారు. బంగారు ఆభరణాలు అందాన్ని పెంచడమే కాకుండా మనకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయంటున్నారు జ్యోతిష్యులు. అవేంటో తెలుసుకుందాం పందండి.
ఈ గ్రహానికి సంబంధించి..
బంగారం బృహస్పతి గ్రహానికి సంబంధించిందని నమ్ముతారు. అందుకే బంగారు ఆభరణాలను ధరిస్తే గురు గ్రహాన్ని బలోపేతం అవుతుందట. అలాగే మీ జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. వీటిని ధరించడం వల్ల ఎన్నో రకాల శారీరక ప్రయోజనాలు కూడా లభిస్తాయంటున్నారు. కాగా తులారాశి, మకర రాశి వారు బంగారాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది వారికి ఎన్నో విధాలుగా కలిసి వస్తుందని నమ్ముతారు.
వైవాహిక జీవితానికి మేలు
జ్యోతిష్యుల ప్రకారం.. బంగారు ఆభరణాలు వైవాహిక జీవితానికి కూడా మేలు చేస్తాయట. అంటే పెళ్లైన వారు బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల వారికి సంపద కలుగుతుందట. అలాగేవివాహిత దంపతులు వీటిని ధరిస్తే వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని నమ్ముతారు.
ఇంటి లోపాలు తొలగిపోతాయి
రత్నశాస్త్రం ప్రకారం.. వేళ్లకు బంగారు ఉంగరాలను ధరిస్తే గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే దీన్ని లక్కీ మెటల్ గా భావిస్తారు. అంతేకాదు ఉంగరం వల్ల సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందట.
బంగారం ధరించడానికి నియమాలు
బంగారంతో బోలెడు లాభాలున్నా.. దీని ధరించడానికి కొన్ని నియమాలను పాటించాల్సిందేనంటున్నారు జ్యోతిష్యులు. అవును గోల్డ్ రింగ్ ను చూపుడు వేలికి పెట్టుకుంటే మీ ఏకాగ్రత పెరుగుతుందట. అలాగే మెడలో బంగారు గొలుసును వేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట. ఉంగరపు వేలికి గోల్డ్ రింగ్ ను పెట్టుకుంటే సంతానం కలుగుతుందట. మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు రాశి వారు బంగారం నగలను కొనడం, పెట్టుకోవడం శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు.