ఈ వాస్తు మార్పులు చేసుకుంటే.. మీ దాంపత్యానికి తిరుగులేదు..!

First Published Jul 12, 2021, 1:49 PM IST

కిచెన్ లో వంట చేసే దిక్కు కూడా ఉత్తరం వైపు ఉండకూడదు. ఉత్తరం దిక్కు వైపు నిలబడి వంట చేయడం వల్ల దంపతుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. దాని వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చే ప్రమాదం ఉంది.

దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. మనకు తెలియకుండానే చిన్న చిన్న తగాదాలు, గొడవలు వస్తుంటాయి. దాని వల్ల దంపతుల మధ్య మనస్పర్థలు రావడం మొదలౌతాయి. అయితే.. ఈ మనస్పర్థలు, సమస్యలు రావడానికి ఇంటి వాస్తు కూడా కారణమై ఉండొచ్చు. మనం.. కొన్ని మార్పులు చేసుకుంటే.. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుందట.
undefined
చాలా మంది దంపతులు ఈశాన్యం వైపు పడుకుంటారు. దాని వల్ల దంపతుల మధ్య గొడవలు మొదలౌతాయట. అందుకే.. ఈశాన్యం వైపు బెడ్, ఆ వైపు తల పెట్టుకొని పడుకోవడం లాంటివి చేయకూడదు.
undefined
కిచెన్ లో వంట చేసే దిక్కు కూడా ఉత్తరం వైపు ఉండకూడదు. ఉత్తరం దిక్కు వైపు నిలబడి వంట చేయడం వల్ల దంపతుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. దాని వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చే ప్రమాదం ఉంది.
undefined
చాలా మంది ఇళ్లల్లో మొక్కలు పెంచుకోవడం సహజం. అయితే... ఇంటి గార్డెన్ లో చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ బోన్ సాయి మొక్కలను మాత్రం పెంచుకోవడం అంత మంచిది కాదు.
undefined
ఇంట్లోని గోడలను ముదురు రంగులతో నింపకూడదు. ముఖ్యంగా.. బెడ్రూం మాత్రం ముదురు రంగులు ఉండకూడదు. లేత రంగులైతే.. వాటి ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది.
undefined
బెడ్రూమ్ లో అద్దాలు ఉండకుండా ఉండటం మంచిది. దాని వల్ల ఆపోజిట్ ఎనర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది.
undefined
చాలా మంది అందంగా ఉండాలని బెడ్రూంలోని బెడ్ ని రకరకాల షేపుల్లో తయారు చేసుకుంటారు. అది మంచిది కాదట. మామూలుగా నార్మల్ షేప్ లో ఉండటమే బెటర్.
undefined
ఇళ్లు ఎప్పుడూ దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ మొక్కలు పెంచుకోవడం ఉత్తమం.
undefined
బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఫోటో ఫ్రేమ్ లు ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదు. రంగు రంగుల ఫ్రేమ్స్.. జీవం ఉట్టిపడేలా ఉన్నవి ఎంచుకోవడం మంచిది.
undefined
click me!