సుదూర సంబంధాలు కొనసాగించడం కష్టం. ఇద్దరు భాగస్వాముల మధ్య మైళ్ల దూరం వచ్చినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, కాంటాక్ట్ లో ఉండడం.. ప్రతీ చిన్న విషయాన్ని షేర్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఈ రకమైన సంబంధాన్ని కొనసాగించాలంటే చాలా నిబద్ధత, త్యాగం అవసరం. ఇది అంత సులభమైన విషయం కాదు. ఇద్దరు భాగస్వాములు ఒకరి అవసరాల గురించి మరొకరు క్రమం తప్పకుండా కమ్యూనికేట్ చేసుకోవడంతో పాటు, ఒకరినొకరు చాలా అర్థం చేసుకోవాలి. అందుకే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్స్ పెద్దగా వర్కవుట్ కావు. అయితే కొన్ని రాశుల వారు ఇలాంటి సంబంధాల్ని ఎంతో బాగా నిర్వహించగలుగుతారు. ఆ రాశులేంటో చూడండి.