Train Horn Meaning: సాధారణంగా ట్రైన్ రకరకాల హారన్స్ ఇస్తూ ఉంటుంది. నిజానికి వాటి వెనుక ప్రత్యేక సంకేతాలు, అర్థాలు దాగి ఉంటాయని చాలామందికి తెలియదు. అసలు రైలు ఎలాంటి హారన్స్ ఇస్తుంది. ఏ హారన్ ఏ సంకేతాన్ని సూచిస్తుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మనలో చాలామంది రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్‌లో నిలబడి ఉన్నప్పుడు లేదా రైల్వే క్రాసింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు రైలు కూత వినిపించడం సాధారణమే. అయితే లోకో పైలట్ ఇచ్చే ప్రతి హారన్ వెనుక ఒక ప్రత్యేక అర్థం ఉంటుందని చాలామందికి తెలియదు. ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి, ట్రాక్ సమీపంలో ఉన్న వారికి ముఖ్యమైన సమాచారాన్ని చేరవేయడానికి ఈ హారన్ సంకేతాలను ఉపయోగిస్తారు. ఇక్కడ రైలు హారన్ రకాల గురించి, వాటి అర్థాల గురించి తెలుసుకుందాం.
25
ఒక చిన్న హారన్
రైలు ఒక చిన్న హారన్ ఇచ్చినప్పుడు సాధారణంగా అది రైల్వే యార్డ్‌లోకి వెళ్లబోతున్నట్లు లేదా ఇంజిన్‌ను మరో లైన్‌కు మార్చే ప్రక్రియలో ఉన్నట్లు సూచిస్తుంది. ఇది సాధారణ ఆపరేషన్‌కు సంబంధించిన సంకేతంగా భావిస్తారు.
రెండు చిన్న హారన్లు
రెండు చిన్న హారన్లు వినిపిస్తే రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని అర్థం. స్టేషన్‌లో గార్డ్ లేదా ఇతర సిబ్బందికి ఇది ఒక సంకేతంగా పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో రైలు కదలబోతుందని కూడా ఈ హారన్ ద్వారా తెలియజేస్తారు.
35
మూడు చిన్న హారన్లు
ఇది చాలా అరుదుగా వినిపించే సంకేతం. మూడు చిన్న హారన్లు సాధారణంగా బ్రేక్ వ్యవస్థలో సమస్య ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఉపయోగిస్తారు. ఈ సంకేతం రైల్వే సిబ్బంది వెంటనే స్పందించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.
ఒక లాంగ్ హారన్
ఒక లాంగ్ హారన్ సాధారణ హెచ్చరిక సంకేతం. రైలు స్టేషన్‌ను దాటుతున్నప్పుడు, ట్రాక్ సమీపంలో ప్రజలు లేదా జంతువులు ఉన్నప్పుడు, లేదా ముందున్న వారికి జాగ్రత్త చెప్పాల్సిన సందర్భాల్లో ఈ హారన్ వినిపిస్తుంది. రైల్వే క్రాసింగ్‌ల దగ్గర కూడా ఇది తరచుగా వినిపిస్తుంది.
రైలు ఒక స్టేషన్‌ను దాటబోతున్నప్పుడు లేదా వేగంగా ముందుకు కదులుతున్నప్పుడు రెండు లాంగ్ హారన్లు వినిపించవచ్చు. ఇది ట్రాక్‌పై ఉన్న సిబ్బంది, ఇతరులకు హెచ్చరికగా పనిచేస్తుంది.
లాంగ్ హారన్ తర్వాత ఒక షార్ట్ హారన్
ఈ సంకేతం సాధారణంగా రైలు ప్రయాణంలో బ్రేక్ పరీక్షలు లేదా ఇతర సాంకేతిక ప్రక్రియలకు సంబంధించింది. రైల్వే సిబ్బంది మధ్య సమాచార మార్పిడికి ఇది ఉపయోగపడుతుంది.
55
వరుసగా చిన్న హారన్లు
రైలు వరుసగా చిన్న చిన్న హారన్లు ఇస్తుంటే అది ప్రమాద హెచ్చరికగా భావించాలి. ట్రాక్‌పై ఎవరైనా ఉన్నప్పుడు, వాహనం క్రాసింగ్ వద్ద ఆగకుండా ముందుకు వచ్చినప్పుడు లేదా ఇతర ప్రమాదకర పరిస్థితుల్లో లోకో పైలట్ ఈ విధంగా హారన్ మోగిస్తారు. అలాంటి సమయంలో వెంటనే ట్రాక్‌లకు దూరంగా వెళ్లడం మంచిది.