Interesting Facts: ఏడిస్తే ముక్కు ఎందుకు కారుతుంది.? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?

Published : Apr 17, 2026, 12:05 PM IST

Interesting Facts: ఏడుపు మ‌నిషికి స‌ర్వ‌సాధార‌ణ‌మైన ఎమోష‌న్‌. అయితే ఏడ్చే స‌మ‌యంలో కళ్ల నుంచి నీరు వ‌చ్చిన‌ట్లే ముక్కు కూడా కారుతుంటుంది. ఇంత‌కీ ఏడవ‌డానికి ముక్కు కార‌డానికి మ‌ధ్య సంబంధం ఏంట‌న్న సందేహం ఎప్పుడైనా వ‌చ్చిందా? దీనికి ఓ కార‌ణం ఉందండోయ్‌..

PREV
15
కళ్ల నీళ్లు ఎలా తయారవుతాయి?

మన కళ్లలో లాక్రిమల్ గ్లాండ్ అనే గ్రంథి ఉంటుంది. ఇది నిరంతరం కళ్ల నీళ్లు (ఆసువులు) తయారు చేస్తుంది. ఈ నీళ్లు కళ్లను తడిగా ఉంచడం, ధూళి, మలినాలు తొలగించడం, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడం వంటి వాటికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌నం ఎక్కువగా ఏడ్చినప్పుడు ఈ నీళ్ల ఉత్పత్తి ఒక్కసారిగా పెరుగుతుంది.

25
క‌ళ్లు, ముక్కు మధ్య ఉన్న రహస్య మార్గం

క‌ళ్లు, ముక్కు మధ్య ఒక చిన్న గొట్టం ఉంటుంది. దీనిని నాసోలాక్రిమల్ డక్ట్ అంటారు. ఈ గొట్టం ద్వారా కళ్లలోని నీళ్లు మెల్లగా ముక్కులోకి చేరుతాయి. సాధారణంగా ఇది నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి మనకు తెలియదు.

35
ఎక్కువగా ఏడిస్తే ఏమవుతుంది?

గుక్క‌పెట్టి ఏడిస్తే కళ్ల నీళ్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో నాసోలాక్రిమ‌ల్ డ‌క్ట్ అనే చిన్న గొట్టం పూర్తిగా నిండిపోతుంది. అదనపు నీళ్లు ముక్కులోకి వేగంగా చేరుతాయి. దీంతో ముక్కులో నీరు చేరి బయటకు కారడం ప్రారంభమవుతుంది.

45
ముక్కు ఎందుకు నీళ్లలా కారుతుంది?

ముక్కులో మ్యూకస్ మెంబ్రేన్ అనే పొర ఉంటుంది. ఇది తేమను నిలుపుతుంది, లోపలికి వచ్చిన నీళ్లను పలుచగా చేస్తుంది. కళ్ల నుంచి వచ్చిన నీళ్లు ఈ పొరతో కలిసినప్పుడు అవి మరింత ద్రవరూపంలోకి మారతాయి. దీంతో బయటకు నీళ్లలా కారుతాయి. అందుకే ఏడ్చేటప్పుడు ముక్కు నుంచి నీరు కారుతుంది.

55
ఒక్క ఏడిచిన‌ప్పుడే కాదు..

ఇది కేవలం బాధతో ఏడ్చినప్పుడే కాదు, ఇతర సందర్భాల్లో కూడా జరుగుతుంది. ఉల్లిపాయలు కోసే స‌మ‌యంలో, కళ్లలో దుమ్ము పడితే, గాలి బలంగా తాకినప్పుడు వంటి సందర్భాల్లో కూడా కళ్ల నీళ్లు పెరిగి అదే మార్గంలో ముక్కుకు చేరుతాయి.

మొత్తం మీద ఏడ్చేటప్పుడు ముక్కు కారడం అనేది శరీరంలోని సహజ ప్రక్రియ. కళ్లూ, ముక్కు కలిసి పనిచేసే విధానం వల్లే ఇది జరుగుతుంది. ఇది అసహజం కాదు, మన శరీరం ఆరోగ్యంగా పనిచేస్తోందని చెప్పే సంకేతం.

Read more Photos on
click me!

Recommended Stories