Inspiring Story : పగలు ఉద్యోగం, రాత్రి బైక్ ట్యాక్సీ, కంటెంట్ క్రియేషన్.. వీటి మధ్యలో పీహెచ్‌డీ : ఈ కుర్రాడు అదుర్స్

Published : Jun 02, 2026, 10:50 AM IST

ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం, రాత్రిళ్లు బైక్ ట్యాక్సీ, వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్... మధ్యలో సమయం దొరికితే స్వయంగా వండుకుని తినడం.. వీటన్నింటి మధ్యలో పీహెచ్‌డీ. ఇవన్నీ చేస్తూ ఓ యువకుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 

PREV
13
ఓ యువకుడి స్పూర్తిధాయక స్టోరీ..

Inspiring Story : ఈ తరం యువత చిన్నచిన్న ప్రాబ్లమ్స్ ను చూసి భయపడిపోతున్నారు. ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామని కొందరు, ఉద్యోగం రావట్లేదని ఇంకొందరు, ఆర్థిక కష్టాలతో మరికొందరు డిప్రెషన్ కు గురవుతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ కష్టపడితే సాధ్యంకానిది ఏదీలేదని... "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు" అని కొందరు నిరూపిస్తుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితాన్ని పాజిటివ్ గా తీసుకుని పోరాటం చేస్తుంటారు. అలాంటి ఓ యువకుడి స్పూర్తిధాయక స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

23
మనసుపెడితే ఏదైనా సాధ్యమే..

మనలో చాలామంది చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు మోస్తుంటాం... దీంతో టైమ్ సరిపోవట్లేదని కంప్లైంట్ చేస్తుంటాం. కానీ మనసు పెడితే దేనికైనా టైమ్ దొరుకుతుందని ఓ కుర్రాడు నిరూపిస్తున్నాడు. అతని స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉదయం 9 నుంచి 5 వరకు జాబ్, రాత్రిళ్లు బైక్ ట్యాక్సీ డ్రైవర్, మధ్యలో పీహెచ్‌డీ, వంట, వీడియో ఎడిటింగ్, కంటెట్ క్రియేషన్.. ఇన్ని పనులు చేస్తున్న ఆ యువకుడి పేరు దీపక్ పాండే.

'గతంలో పగలు 9-5 జాబ్ చేశాక నాలో శక్తి ఉండేది కాదు, జీవితంలో సంతోషమే లేదని ఫీలయ్యేవాడిని. కానీ ఇప్పుడు అదే వ్యక్తి సాయంత్రం 5 నుంచి రాత్రి 11 వరకు బైక్ ట్యాక్సీ నడుపుతున్నాడు. సొంతంగా వంట చేసుకుంటున్నాడు, వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు, పీహెచ్‌డీ కూడా కొనసాగిస్తున్నాడు. ఇన్ని పనులు చేస్తున్నా అతను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషంగా ఉన్న వ్యక్తి మరెవరో కాదు, నేనే' అని దీపక్ పాండే అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాడు. ఈ వీడియో నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది… దీంతో వైరల్ గా మారింది. 

33
బైక్ ట్యాక్స్ నడుపుతూనే పిహెచ్డి..

'ఇప్పుడు నేనెందుకు ఇంత సంతోషంగా ఉన్నానో తెలుసా..? నా జీవితంలో మొదటిసారి నా సామర్థ్యం ఏంటో తెలుసుకున్నాను. 'నలుగురూ ఏమనుకుంటారో?', 'నేను ఇది చేయలేనేమో', లేదా 'కొత్తగా ఏదైనా చేయాలంటే ఉద్యోగం మానేయాలి' లాంటి భయాలతో నా టాలెంట్‌ను నేనెప్పుడూ గుర్తించలేదు. కానీ నెమ్మదిగా మారడం మొదలుపెట్టాను. ముందుగా పీహెచ్‌డీలో చేరాను, ఆ తర్వాత బైక్ ట్యాక్సీ నడపడం స్టార్ట్ చేశాను, తర్వాత కంటెంట్ క్రియేషన్‌లోకి కూడా వచ్చాను. ఈ రోజు నేను వీటన్నింటినీ ఒకేసారి మేనేజ్ చేయగలుగుతున్నాను' అని పాండే రాసుకొచ్చాడు.

మీకు ఏదైనా ప్యాషన్ ఉంటే దానికోసం ఇప్పటినుంచే ప్రయత్నించండి. ఉన్న ఉద్యోగం మానేయడం కోసం ఎదురుచూడొద్దు... కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. కానీ మీ సామర్థ్యాన్ని మీరు గుర్తించడం మొదలుపెట్టాక ఆ కష్టాన్ని కూడా మీరు ఆస్వాదించడం మొదలుపెడతారు అని పాండే సలహా ఇస్తున్నాడు. అతని పోస్ట్‌కు చాలామంది కామెంట్లు పెడుతున్నారు. 'మీరు నిజంగా నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం' అని చాలామంది మెచ్చుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories