వివిధ క్లాసుల్లో లగేజీ గరిష్ఠ పరిమితులు ఇలా ఉన్నాయి
ఏసీ ఫస్ట్ క్లాస్: తలకు 70 కిలోల వరకు
ఏసీ టూ టైర్: తలకు 50 కిలోల వరకు.
ఏసీ త్రీ టైర్, చైర్ కార్: తలకు 40 కిలోల వరకు.
స్లీపర్ క్లాస్: తలకు 40 కిలోల వరకు.
సెకండ్ క్లాస్: తలకు 35 కిలోల వరకు.
లగేజీ పరిమాణం ఎంతుండాలి..?
లగేజీ పరిమాణాన్ని కూడా రైల్వే శాఖ నిర్ధారించింది. ప్రయాణికులు తమ కోచ్‌లలోకి ట్రంకులు, సూట్‌కేసులు లేదా పెట్టెలను మాత్రమే తీసుకెళ్లగలరు. వాటి గరిష్ఠ పరిమాణం 100 సెం.మీ x 60 సెం.మీ x 25 సెం.మీ మించకూడదు. ఇంతకంటే పెద్ద లగేజీని కోచ్‌లోకి అనుమతించరు.
నిర్ణీత పరిమాణం కంటే పెద్ద లగేజీని తప్పనిసరిగా బుక్ చేసి బ్రేక్ వ్యాన్ లేదా పార్సెల్ వ్యాన్‌కు పంపాలి. అంతకంటే పెద్ద వస్తువులను వ్యక్తిగత లగేజీగా పరిగణించరు, వాటిని కోచ్‌లోకి అనుమతించరు. వాటిని విడిగా బుక్ చేసి బ్రేక్ వ్యాన్‌లో మాత్రమే పంపాలి.