IRCTC Srisailam Tour: శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు యాదాద్రి కవర్ చేసే ఐఆర్‌సీటీసీ స్పిరిచువల్ టూర్

Published : Jun 23, 2026, 04:45 PM IST

IRCTC Srisailam Tour:ఐఆర్‌సీటీసీ శ్రీశైలంతో పాటు తెలంగాణలోని వివిధ దేవాలయాల సందర్శన కోసం 3 రాత్రులు, 4 రోజుల ప్రత్యేక 'స్పిరిచువల్ తెలంగాణ' రోడ్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ అద్భుతమైన ఐఆర్‌సీటీసీ స్పిరిచువల్ టూర్ ప్యాకేజీ వివరాలు మీకోసం.

PREV
16
వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? శ్రీశైలం, సమతామూర్తి కేంద్రం చుట్టేసే ఐఆర్‌సీటీసీ సూపర్ టూర్

మీరు తక్కువ టైంలో సూపర్బ్ డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు ప్రసిద్ధ శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి 'స్పిరిచువల్ తెలంగాణ విత్ శ్రీశైలం' (Spiritual Telangana With Srisailam) పేరుతో ఒక అదిరిపోయే ప్యాకేజీ ఐఆర్‌సీటీసీ టూర్ ప్లాన్ అందుబాటులో ఉంది.

ఈ ప్యాకేజీ కోడ్ వచ్చేసి SHH004. ఇది 3 రాత్రులు, 4 రోజుల రోడ్ టూర్ ప్యాకేజీ. శుక్రవారం తప్ప వారంలో మిగిలిన అన్ని రోజుల్లోనూ ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ఇందులో స్టాండర్డ్, కంఫర్ట్ అనే రెండు క్లాసులు ఉన్నాయి. మొత్తం కేవలం 10 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

26
4 రోజుల టూర్ షెడ్యూల్ ఇలా సాగుతుంది..

ఈ ట్రిప్ మొత్తం 4 రోజుల పాటు సాగుతుంది. రోజువారీ షెడ్యూల్ గమనిస్తే..

  1. డే 1 (హైదరాబాద్): హైదరాబాద్, సికింద్రాబాద్ లేదా కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. హోటల్‌లో చెక్-ఇన్ అయిన తర్వాత.. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ సందర్శన ఉంటుంది. రాత్రికి హైదరాబాద్‌లోనే డిన్నర్, స్టే ఉంటుంది.
  2. డే 2 (హైదరాబాద్ - శ్రీశైలం): తెల్లవారుజామున 5 గంటలకే హోటల్ నుండి శ్రీశైలం బయలుదేరాలి. బ్రేక్‌ఫాస్ట్ మీ సొంత ఖర్చులతో చేయాలి. అక్కడ మల్లికార్జున జ్యోతిర్లింగ ఆలయం, చుట్టుపక్కల ప్రదేశాలు చూశాక, మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. రాత్రికి హైదరాబాద్ చేరుకుని, డిన్నర్ చేసి అక్కడే స్టే చేస్తారు.
  3. డే 3 (హైదరాబాద్): హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేశాక బిర్లా మందిర్, గోల్కొండ కోట సందర్శిస్తారు. మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (సమతా మూర్తి కేంద్రం) కి వెళ్తారు. సాయంత్రం హోటల్‌కు రిటర్న్ అయి, డిన్నర్ చేసి అక్కడే పడుకుంటారు.
  4. డే 4 (హైదరాబాద్ - యాదాద్రి): హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని చెక్-అవుట్ అవుతారు. అక్కడి నుండి యాదాద్రి బయలుదేరి శ్రీ లక్ష్మీనరసిహ్మ స్వామి ఆలయం, సురేంద్రపురి సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుని.. మిమ్మల్ని హైదరాబాద్/సికింద్రాబాద్/కాచిగూడ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది.
36
'స్పిరిచువల్ తెలంగాణ విత్ శ్రీశైలం ప్యాకేజీ ధరల వివరాలు

ఈ టూర్ ప్యాకేజీ ధరలు మీరు ఎంచుకునే ప్రయాణికుల సంఖ్య, హోటల్ క్లాస్‌పై ఆధారపడి ఉంటాయి. మీరు ఒకరి నుండి ముగ్గురు ప్రయాణికులతో కలిసి వెళ్లాలనుకుంటే.. స్టాండర్డ్ క్లాస్‌లో డబుల్ షేరింగ్ కోసం ఒక్కొక్కరికి రూ. 21,280, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 15,430 గా ఉంది. అదే కంఫర్ట్ క్లాస్‌లో అయితే డబుల్ షేరింగ్‌కు రూ. 24,440, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 18,400 చొప్పున ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీతో పాటు 5 నుండి 11 ఏళ్ల లోపు పిల్లలు ఉంటే.. స్టాండర్డ్ క్లాస్‌లో అదనపు బెడ్‌తో రూ. 9,690, బెడ్ లేకుండా రూ. 7,840 అవుతుంది. కంఫర్ట్ క్లాస్‌లో అయితే బెడ్‌తో రూ. 12,290, బెడ్ లేకుండా రూ. 9,690 గా నిర్ణయించారు.

ఒకవేళ మీరు 4 నుండి 6 మంది ప్యాసింజర్లతో కూడిన గ్రూప్‌గా వెళ్తే ధరలు కాస్త తగ్గుతాయి. ఈ గ్రూప్ సైజ్ కోసం స్టాండర్డ్ క్లాస్‌లో డబుల్ షేరింగ్‌ ధర ఒక్కొక్కరికి రూ. 15,260 కాగా, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 12,510 గా ఉంది. కంఫర్ట్ క్లాస్‌ విషయానికి వస్తే డబుల్ షేరింగ్‌కు రూ. 18,420, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 15,480 గా రేట్లు ఉన్నాయి. ఈ 4-6 మంది గ్రూప్‌లో 5 నుండి 11 ఏళ్ల పిల్లలు ఉన్నట్లయితే.. స్టాండర్డ్ క్లాస్‌లో బెడ్‌తో రూ. 9,410, బెడ్ లేకుండా రూ. 7,550 అవుతుంది. అలాగే కంఫర్ట్ క్లాస్‌లో పిల్లల కోసం బెడ్‌తో రూ. 12,010, బెడ్ లేకుండా రూ. 9,410 గా ఐఆర్‌సీటీసీ ఖరారు చేసింది. ఒకవేళ మీ గ్రూప్‌లో 7 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం స్పెషల్ రేట్ల కోసం నేరుగా వారి ఆఫీసును సంప్రదించాల్సి ఉంటుంది.

46
ప్యాకేజీలో ఏమున్నాయి? ఏవి లేవు?

ప్యాకేజీలో కలిపి ఉన్నవి

  • హైదరాబాద్‌లో ఏసీ అకామడేషన్ రూమ్స్. 
  • షెడ్యూల్ ప్రకారం హోటల్‌లో 3 డిన్నర్లు, 2 బ్రేక్‌ఫాస్ట్‌లు.
  • ఏసీ రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్.
  • టూర్‌లో పేర్కొన్న అన్ని సందర్శనీయ స్థలాల విజిట్.
  • ట్రావెల్ ఇన్సూరెన్స్, అన్ని వర్తించే పన్నులు.

మీరు సొంతంగా పెట్టుకోవాల్సిన ఖర్చులు ఏమిటి?

  • మధ్యాహ్న భోజనం, ఇతర అదనపు ఆహార పదార్థాలు.
  • టూర్‌లో చెప్పినవి కాకుండా వేరే ప్రదేశాల సందర్శన.
  • ట్రైన్, బస్సు లేదా ఫ్లైట్ టికెట్లు.
  • రామోజీ ఫిలిం సిటీతో సహా ఏ దర్శనీయ స్థలాల ప్రవేశ టికెట్లు.
  • దేవాలయాలలో స్పెషల్ దర్శనం టికెట్లు.
  • టూర్ గైడ్ సర్వీసులు.
  • హోటల్‌లో టిప్స్, మినరల్ వాటర్, టెలిఫోన్ ఛార్జీలు, లాండ్రీ వంటి పర్సనల్ ఖర్చులు.
56
క్యాన్సిలేషన్ పాలసీ, హోటల్స్ సహా ఇతర వివరాలు

ఒకవేళ మీరు బుక్ చేసుకున్న ట్రిప్‌ను క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే డిడక్షన్స్ ఉంటాయి. ట్రిప్ స్టార్ట్ అవ్వడానికి 15 రోజుల కంటే ముందుగా క్యాన్సిల్ చేస్తే ఒక్కో ప్యాసింజర్‌కు రూ. 250 కట్ అవుతుంది. 8 నుండి 14 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే ప్యాకేజీ కాస్ట్‌లో 25% కట్ అవుతుంది. 4 నుండి 7 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే ప్యాకేజీ కాస్ట్‌లో 50% కట్ అవుతుంది. 4 రోజుల కంటే తక్కువ టైంలో క్యాన్సిల్ చేస్తే 100% అమౌంట్ కట్ అవుతుంది.

హోటల్ కేటగిరీ వివరాలు గమనిస్తే.. స్టాండర్డ్ క్లాస్ లో హైదరాబాద్‌లో కినారా గ్రాండ్ లేదా రాజ్ ఇన్నర్ లేదా అలాంటి కేటగిరీ హోటల్ ఇస్తారు. కంఫర్ట్ క్లాస్ లో రాయల్ రేవ్, ఇన్నర్ సర్కిల్, గ్రాండ్ కాంటినెంట్, హాలిడే ఇన్ ఎక్స్‌ప్రెస్ లేదా అలాంటి కేటగిరీ హోటల్ ఇస్తారు.

66
పర్యాటకులు ఫాలో అవ్వాల్సిన ముఖ్యమైన రూల్స్ ఇవే

హోటల్ చెక్-ఇన్ టైమ్ మధ్యాహ్నం 12 గంటలు. ఎర్లీ చెక్-ఇన్ అనేది రూమ్స్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. పర్యాటకులు తప్పనిసరిగా ఒరిజినల్ వాలిడ్ ఐడీ కార్డ్ వెంట ఉంచుకోవాలి. దర్శనీయ స్థలాల ఓపెనింగ్, క్లోజింగ్ టైమింగ్స్ బట్టే విజిట్ ఉంటుంది. మొదటి, చివరి రోజు సందర్శన మీ అరైవల్, డిపార్చర్ టైమింగ్స్ మీద డిపెండ్ అవుతుంది. 

75 ఏళ్లు పైబడిన వారు ప్రయాణిస్తుంటే కచ్చితంగా వయసు తక్కువ ఉన్న ఫ్యామిలీ మెంబర్ తోడుండాలి. పిల్లల (2 నుండి 11 ఏళ్లు) వయస్సు నిరూపించే గుర్తింపు పత్రాలు తప్పనిసరి. 11 ఏళ్లు దాటితే అడల్ట్ ప్రైస్ పడుతుంది. బుకింగ్ చేసుకునే ముందు ఒకసారి హోటల్ వెబ్‌సైట్‌లు, రివ్యూలు చూసుకోవాలని ఐఆర్‌సీటీసీ కోరుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories