పాము అనగానే మనకు గుర్తొచ్చేది దాని విషం, భయం. కానీ అన్ని పాములు కేవలం విషంతోనే శత్రువులను ఎదుర్కోవు. కొన్ని చనిపోయినట్టు నటిస్తాయి, ఇంకొన్ని విషాన్ని చిమ్ముతాయి, మరికొన్ని రంగులు మార్చి శత్రువులను బోల్తా కొట్టిస్తాయి.
దీన్ని పాముల ప్రపంచంలో 'బెస్ట్ యాక్టర్' అంటారు. ఇది శత్రువులు దాడికి వస్తే వెల్లకిలా పడుకుని, నాలుక భయటపెట్టి చనిపోయినట్టు నటిస్తుంది. మరీ భయమేస్తే, నోటిలోని రక్తనాళాలు చిట్లేలా చేసుకుని రక్తం కారేలా చేస్తుంది. దీన్ని చూసి 'ఇది కుళ్లిపోయిన శవం' అనుకుని శత్రువులు వదిలేసి వెళ్లిపోతాయి.
26
2. రాటిల్ స్నేక్ (Rattlesnake)
ఈ పాము కళ్ల దగ్గర 'లోరియల్ పిట్' అనే ప్రత్యేక అవయవం ఉంటుంది. ఇది ఒకరకమైన 'నైట్ విజన్ కెమెరా' లాంటిది. దీని సాయంతో, చీకట్లో కూడా శత్రువు శరీరం నుంచి వెలువడే వేడిని (ఇన్‌ఫ్రారెడ్) పసిగడుతుంది. కంటికి కనిపించకముందే శత్రువు ఎక్కడుందో ఈ పాము కనిపెట్టేస్తుంది.
36
3. స్కార్లెట్ కింగ్‌స్నేక్ (Scarlet Kingsnake)
ఈ పాముకు అస్సలు విషం ఉండదు. కానీ చూడటానికి అచ్చం విషపూరితమైన 'కోరల్ స్నేక్' లాగే ఉంటుంది. దీన్ని చూసిన ఇతర జంతువులు, 'ఇది చాలా ప్రమాదకరమైన పాము' అని భయపడి పారిపోతాయి. ఇలా తన రూపంతోనే శత్రువులను మోసం చేస్తుంది.
ఈ పాములు వేటాడటంలో చాలా తెలివి చూపిస్తాయి. తమ ఎరను చుట్టేసినప్పుడు, ఆ జంతువు గుండె చప్పుడును గమనిస్తూ ఉంటాయి. గుండె కొట్టుకోవడం ఆగిపోయేంత వరకు పట్టు బిగిస్తూనే ఉంటాయి. గుండె చప్పుడు పూర్తిగా ఆగి, జంతువు చనిపోయిందని నిర్ధారించుకున్నాకే పట్టు వదులుతాయి.
56
5. స్పిట్టింగ్ కోబ్రా (Spitting Cobra)
ఈ నాగుపాము కోరలకు ప్రత్యేకమైన రంధ్రాలు ఉంటాయి. ఇవి శత్రువు కళ్ల కదలికలను గమనించి, గురి చూసి కళ్లల్లోకే విషాన్ని చిమ్ముతాయి. దీనివల్ల శత్రువుకు తీవ్రమైన నొప్పి కలిగి, కొద్దిసేపు చూపు మందగిస్తుంది. ఆ గ్యాప్‌లో ఈ పాము అక్కడి నుంచి తప్పించుకుంటుంది.
66
6. కింగ్ కోబ్రా (King Cobra)
ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాము. శత్రువు ఎదురైనప్పుడు, తన శరీరం ముందు భాగాన్ని సుమారు 5-6 అడుగుల ఎత్తు వరకు గాల్లోకి లేపి నిలబడగలదు. ఇది పడగ విప్పి బుస కొడితే, పెద్ద జంతువులు కూడా భయంతో వణికిపోతాయి. దీని విషం నేరుగా నాడీ మండలంపై దాడి చేస్తుంది.