సాఫ్ట్‌వేర్ డ్రీమ్ ముగిసినట్లే... ఇక ఈ ఉద్యోగాలదే భవిష్యత్

Published : Apr 03, 2026, 06:01 PM IST

కృతిమ మేథ నిపుణులు, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ తో పాటు నర్సులు, కేర్ టేకర్స్, ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, మసాజ్ చేసేవారు, ఫిజియోథెరపీ, జిమ్ ట్రైనర్లు లాంటి ఉద్యోగాల వెల్లువ రానుందా..?

PREV
14
ఇండియన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లూ... జాగ్రత్త

ఇండియన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు...

ఇప్పుడు ప్రపంచం నలుచెరగులా ...

ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేయగానే.. ప్రపంచం పిలిచేది..!

ఇటు ఆస్ట్రేలియా మొదలు..

అటు కెనడా దాకా ఎక్కడికైనా వెళ్లే అవకాశం...

మంచి జీతం..

25 దాటక ముందే కలల జీవితాన్ని గడిపే అవకాశం..

ఇదీ 1997 నుంచి 2025 దాక పరిస్థితి.

సాఫ్ట్ వేర్ రంగంలో... ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు బాగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశం..?

కృతిమ మేథ 100 కి 50 ఉద్యోగాలను తినేస్తే... కనీసం 15-20 ఉద్యోగాలను సృష్టిస్తుంది.

1. కృతిమ మేథతో పని చేయించే ఉద్యోగాలు...

2. అవి చేయలేని పని చేసే ఉద్యోగాలు.

వీటికోసం మానవ నైపుణ్యాలు కావాలి.

24
ఈ ఉద్యోగాలదే డిమాండ్..

బాల్యం నుంచే కేవలం మార్కులపై దృష్టి నిలిపి... బట్టీ పద్దతిలో బుర్ర నిండా సమాచారం నింపి... దాన్ని డేటా సెంటర్ గా మార్చిన వారికి ఉద్యోగాలు రావు.

చదువు సాగే తీరు మారాలి... అని అందుకే చెబుతున్నా..!

నా పోస్ట్స్ లో పదేపదే చెబుతున్న మరో మాట..

"గొప్పగా బతకాలి అనుకోకండి..

హ్యాపీ గా బతకాలి అనుకోండి" అని.

కృతిమ మేథ నిపుణులు, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ లాంటి హై ఎండ్ టెక్ నిపుణులుగా ఒక వైపు మంచి అవకాశాలు ఉంటే...

మరో వైపు..

నర్సులు, కేర్ టేకర్స్, ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ (టీవీ, మొబైల్, ఏసీ వంటివి), మసాజ్ చేసేవారు, ఫిజియోథెరపీ, జిమ్ ట్రైనర్లు లాంటి ఉద్యోగాల వెల్లువ రానుందా..?

బల్గేరియా , లిథుయేనియా, ఇటలీ, గ్రీస్, పోర్చుగల్, హంగేరి, క్రోయేషియా, సెర్బియా, యుక్రెయిన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో జనాభా క్షీణత భారీగా ఉంది...

యువతీ యువకుల సంఖ్య భారీగా తగ్గిపోతోంది.

కృతిమ మేథ అన్నిపనులూ చేయలేదు.

విదేశాలనుండి పైన పేర్కొన్న స్కిల్ల్డ్, సెమి స్కిల్ల్డ్ వ్యక్తులను దిగుమతి చేసుకోవడం మినహా .. మరో దారి లేదు.

దేశం నడవాలంటే సైనికులు, పోలీస్ కావాలి.

అక్కడేమో యువత తక్కువ .

దానికి తోడు వారికి కష్టించి పని చేసే ఓపిక తగ్గిపోతోంది.

మరి కొన్ని సంవత్సరాల్లో మన దేశం నుంచి... అనేక దేశాలు సైన్యం కోసం యువత ను నియమించుకునే అవకాశముందా?

ఏమో గుర్రం ఎగరా వచ్చు. 

ఒకటి నిజం .. తెలివున్నవాడికి, కష్టపడేవాడికి ... ఉద్యోగం కష్టం కాదు.

34
తెలుగువారి మైండ్ సెట్ మారాలి...

ముప్పై ఏళ్లుగా భారతీయులు... ముఖ్యంగా తెలుగువారి మైండ్ సెట్ మారిపోయింది.

చదువంటే ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే.

ఈ రెండూ గొప్ప చదువులే.

కాదన్నవాడు మూర్ఖుడు.

కాకపోతే కోళ్లఫారం ఇంజనీరింగ్ కాలేజీ,

రోగులు లేని, శవాలు లేని... ప్రైవేట్ మెడికల్ కళాశాలలు..

ఇక్కడ చదివిన వారికే దిక్కులేకుంటే ... ఎక్కడో చంద్రమండలం అవతల దిక్కులేని దేశంలో మెడికల్ కోర్స్ లు ..

దీనికోసం ఆరో తరగతి నుంచి .. రుబ్బి దంచుడు ఐఐటీ/ మెడికల్ ఫౌండేషన్ కోర్స్ లు.

"ఏం వదినా..? మీ వాడిని ఐటీ ఫౌండేషన్ కోర్స్ లో చేర్చలేదా..? అయ్యో .. అదేమమ్మా ..ఆయినా ఇంత ఘోరమా? ఏమై పోవాలా వాడి బతుకు... " బిడ్డ ఆరో తరగతి లో ఉన్నపుడు మాటలు.

అటుపై ..

"ఇంటర్ లో ఎన్ని మార్కులు ? మా అమ్మాయికి 600 కు 599. 99. అయ్యో 594..? ఏమయ్యింది. ఇంత తక్కువా..?"

"ఎంత ప్యాకేజీ ? మా వాడికి టీసీఎస్ లో మొత్తం యాభై లక్షలు. ఆఫీస్ లో పొద్దున్న చికెన్ బిర్యానీ. మధ్యాహ్నం మటన్ బిర్యానీ. రాత్రికి ఫిష్ బిర్యాని. ఇంటికొచ్చిందే పడుకొని నిద్రపోవడమే. ఎంత సుఖమమ్మా!... "

"ఇప్పుడే అమెరికా ఫ్లైట్ దిగినా. సాన్ జోస్ లో మా బిడ్డ ఉండేది. నీకు తెలుసా ? అక్కడ టాయిలెట్ లు కూడా మన ఫలక్నుమా పాలస్ అంత పెద్దవి. బెడ్ ఏసుకొని పడుకోవచ్చు అనుకో. మనకు ఈడ ఉండాది ఎందుకమ్మా . పొల్లూషన్ .. ఇరుకైన రోడ్లు"

" కోకా పెట్ లో రెండు .. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో రేండు కొన్నా"

.... ఇదీ... గత ముప్పై ఏళ్లుగా పెద్ద వారి మాటలు.

టీవీ పెడితే .... ఒకటి... ఒకటి ... ఒకటి... రెండు... రెండు... రెండు... అని అరుపులు.

పత్రికల్లో పేజీ ల నిండా ఫోటోలు .. నెంబర్ లు.

జాతర.

వెర్రి.

వేలం వెర్రి .

ఒకటి నిజం.. మధ్య తరగతి బతుకులకు ఈ 30 ఏళ్ళు పండుగ.. ఎన్నో రకాలుగా మేలు జరిగిన మాట వాస్తవం.

కాకపోతే... ఫండమెంటల్స్ మరిస్తే..?

ఇప్పుడదే జరుగుతోంది. ఫండమెంటల్స్ ను మరచిన జాతిని కరెక్ట్ చేసేందుకు ప్రకృతి సిద్ధమవుతోంది.

44
ఇదో శకం..

 1997-2025

అదొక దశ

మూడవ పారిశ్రామిక యుగం ముగింపు దశ !

భవిషత్తును మరచి తెలుగు జాతి సూపర్ స్పెషలైజ్ చేసేసింది .

ఇదెలా వుందంటే ..

ఒక ఊరి శివారుల్లో గ్రానైట్ ఫ్యాక్టరీ వెలసింది.

ఉద్యోగాల వెల్లువ .

మంచి జీతం .

పదేళ్లు వ్యవయాసాన్ని ఇంకా అన్ని వృత్తుల్ని మరచి ఆ గ్రామ జనాభా అందులో మునిగి తేలింది.

ఆస్తులు .. ఐశ్వర్యాలు .. విలాసాలు..

సాగితే బాగుంటుంది .

కానీ అక్కడ ఇప్పుడు గ్రానైట్ రాళ్ళూ లేవే..!!

2025...

నాలుగవ పారిశ్రామిక యుగం ఫలితాలను అందుకునేందుకు తెలుగు జాతి సిద్ధం గా ఉందా ?

బిల్డ్ అప్ కబుర్లు మానితే ... బాగుపడుతుంది .

1997 - 2025 కాలం నాటి బిల్డ్ అప్ పేరెంట్స్ , వారికోసం వెలసిన విద్యా దుకాణాలు , ప్రకటనల రెవిన్యూ కోసం ప్రభంజనం .. పిండా కూడు అంటూ .. వంతపాడిన మీడియా .. వీరే విలన్ లు ..

వీరి అతికి ఇకనైనా బ్రేక్ పడితే మంచిది .

మేథో మధనం జరగాలి .

తెలుగు వారి మైండ్ సెట్ మారాలి.

చదువు.. చదువులా సాగాలి.

1980 కి ముందు ఇదే జరిగేది.

బిడ్డను... బిడ్డలా పెంచాలి .

వందల వేల తరాలుగా ఇదే జరిగేది .

గతం లో చెప్పాను ..

ఈ పోస్ట్ లో ఇంకో సారి చెబుతున్నా ..

రాబోయే రోజుల్లో పిల్లలకు మించిన ఆస్థి ఇంకోటి లేదు.

నిన్నటి దారిలో నడిచే వాడు క్యాడర్ .

రేపటి దారిని వెదికి పట్టుకొనే వాడు లీడర్ .

ఇప్పుడు ఉద్యోగ అభద్రత ఎదుర్కొంటున్న వారికి !

AI నేర్చుకోవాలి !

స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి !

హ్యూమన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి !

కాలం మారింది !

ఇంకా పాత దారిలో పోతానంటే ఎలా ?

ఇది corrections కాలం..!

కొంత ఇబ్బంది తప్పదు !

నా పోస్ట్ కనీసం ఇప్పుడు బడి దశలో ఉన్నవారిని సేవ్ చేద్దామని !

జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదు అని !

Read more Photos on
click me!

Recommended Stories