విజయ్ కాంత్ పరిస్థితే విజయ్ కు ... ఎందుకో తెలుసా..?

Published : Apr 06, 2026, 03:34 PM IST

ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడింది. మరి తమిళనాడు అధికారం ఎవరిది..? విజయ్ ప్రభావం ఎంత..? కేరళం, వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఎవరు గెలవబోతున్నారు..?

PREV
14
ఎన్నికల ఫలితాలపై నా అంచనా..!

తమిళనాడు లో మంచి మెజారిటీ తో డిఎంకె గెలుస్తుంది. స్టాలిన్ తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు.

రెండో స్థానంలో AIADMK. MGR, జయలలిత మరణించి ఎంతో కాలం అయినా ఆ పార్టీ అభిమానులు ఇంకా దాని వెంటే.

నటుడు విజయ్ పెద్దగా ప్రభావం చూపడు. విజయకాంత్ లాగే ఈయన త్వరలో కనుమరుగయిపోతాడు. తమిళులు అంత త్వరగా కొత్త నాయకత్వాన్ని కొత్త పార్టీని నమ్మరు. గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభిమానులు అన్నామలై పై ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఈసారి ఎన్నికల్లో అయన పేరు కూడా పోటీ చేసే జాబితాలో లేకపోవడం గమనార్హం.

ముఖ్య గమనిక : ఇవన్నీ జరుగుతాయి అనేది నా అంచనా. నా ఆశయం కాదు. రెంటికీ తేడా గమనించగలరు. నా అంచనా తప్పు కాదని ఏమీ లేదు.

24
వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళం రిజన్ ఎలా ఉండనుంది..?

వెస్ట్ బెంగాల్ లో తీవ్ర పోటీ. ప్రస్తుతానికి మమతా బెనర్జీ కి మొగ్గు. బీజేపి ఇక్కడ సర్వ శక్తులు ఒడ్డుతోంది. చివరి 15 రోజుల్లో వ్యూహాత్మక పంధాలో ఎలక్షనీరింగ్ చేసి ఫలితాలను తారుమారు చేసిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. ఈ సారి ఏమి జరగనుందో చూడాలి.

అస్సాం బీజేపీదే.

కేరళలో ప్రతిసారి సీన్ రివర్స్ అవుతుంది. ఆ లెక్కన ఈ సారి కాంగ్రెస్. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

34
సికాడా వచ్చేస్తోంది..

నన్ను ఫాలో అయ్యేవారిలో అన్ని పార్టీల అభిమానులు ఉన్నారు. శతకోటి బోడి లింగాల్లో ఒకటిగా సికాడ అని కరోనా కొత్త సంతానం. దీని తాత ముత్తాత ఏమీ చేయలేక పోయారు. ఇది ఏమి చేస్తుంది..? రక్తం మరిగిన పులి ఊరుకుంటుందా..? తిరిగీ 2020 నాటి పరిస్థితి తేవాలని ఫార్మసురుల ప్రయత్నం. "ఇంగ్లాండ్ లో ఇది విస్తరిస్తుంది. మూడేళ్ళలోపు పిల్లలకు కూడా దీని కోసం వాక్సిన్ ఇవ్వాలని ఫార్మసురుల తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టారు. చూస్తూ ఉండండి . నెల- రెండు నెలల్లో ఇక్కడ కూడా ఇదే ప్రచారం జరుగుతుంది.

44
అలాంటి నాయకుడు రావాలి..

"చిన్న పిల్లలకు సెల్ ఫోన్ వద్దు .. పెద్దలు కేవలం ప్రొఫెషనల్ పనులకే వాడాలి.. రసాయన రుచులు వద్దు .. సహజ ఆహారం రుచి .. మనుషుల కోసం మందులు .. అంతే కానీ మందుల కోసం మనుషులు కాదు.... " అని మాట్లాడే ఒక్క నాయకుడి కోసం చూస్తున్నా.

అలాంటి నాయకుడు ఈ భూమి పై పుట్టినప్పుడు... నేను అతనికి/ఆమెకు అనుకూలంగా మాట్లాడుతా. అప్పటిదాకా నేను ఏ రాజకీయ పార్టీ అనుచరుడు కాదు.

నేను మీవాడిని. అందరివాడిని.

Read more Photos on
click me!

Recommended Stories