Hotel Room Secrets : హోటల్ రూమ్‌లో బెడ్ ముందే అద్దం ఉంటుంది.. ఎందుకో తెలుసా?

Published : Aug 05, 2026, 12:21 PM IST

మీరు ఫ్యామిలీతో టూర్ వెళ్లినప్పుడు లేదా పనిపై వేరే ప్రాంతాాలకు వెళ్లినప్పుడు హోటల్లో బసచేసి ఉంటారు. ఈ సమయంలో హోటల్ రూంలో బెడ్‌కు ఎదురుగా పెద్ద అద్దం ఉండటం గమనించే ఉంటారు. అది కేవలం గది అందం కోసమే కాదట, దాని వెనుక చాలా ఆసక్తికరమైన కారణాలున్నాయట.

PREV
15
హోటల్ రూం లో బెడ్ కు ఎదురుగానే మిర్రర్ ఎందుకు?

మన స్వస్థలానికి దూరంగా ఏదైనా విహారయాత్రకు వెళ్లినా, ఏదైనా పనిపై ఇతర నగరాలకు వెళ్లినా హోటల్లో ఉండటం కామన్. బాగా అలసిపోయి ఉంటాం కాబట్టి హోటల్ రూంను అంతగా పరిశీలించం… కానీ ఈసారి హోటల్లో ఉంటే ఓ విషయం పరిశీలించండి. రూంలో బెడ్ కు ఎదురుగా పెద్ద అద్దం కనిపిస్తుంది… ఇది కేవలం అందం కోసమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక హోటల్ ఇండస్ట్రీకి చెందిన బడ్జెట్ ప్లానింగ్, డిజైన్ రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

25
వెలుతురు పెంచి కరెంట్ బిల్లు తగ్గించుకునే ట్రిక్..

హోటల్స్ యాజమాన్యాలు ప్రతి విషయాన్ని బిజినెస్ యాంగిల్ లోనే చూస్తాయి… అందుకే రూమ్స్ లోని ప్రతి చిన్న వస్తువు ఓ ప్రత్యేక ప్లాన్‌లో భాగంగానే ఉంటాయి. బెడ్ ముందు అద్దం పెట్టడానికి కూడా ఇలాంటి అనేక కారణాలున్నాయి. 

గదిలో సహజ వెలుతురు కోసం ఈ అద్దం ఉపయోగపడుతుంది… అంటే లైట్లు వేసే అవసరం ఉండదు కాబట్టి డబ్బులు ఆదా చేసుకునే మార్గం అన్నమాట. కిటికీల నుంచి వచ్చే సహజ కాంతి అద్దంపై పడి గది మొత్తం ప్రకాశవంతంగా కనిపిస్తుంది… ఇలా సహజంగానే గదిలో వెలుతురును పెరుగుతుంది. దీంతో ఎక్కువ లైట్లు వాడాల్సిన అవసరం లేకుండానే గది ఆకర్షణీయంగా ఉంటుంది.

అయితే హోటల్ రూంలో ఉండేవారు విశ్రాంతి తీసుకుంటారు.. కాబట్టి ఎక్కువ సమయం బెడ్ పైనే ఉంటారు. కాబట్టి ప్రధానంగా బెడ్ వద్ద ఎక్కువ వెలుతురు ఉండేలా దానికి ఎదురుగా మిర్రర్ అమర్చుతారు. దీనివల్ల చీకటిగా ఉందనే ఫీలింగ్ కలగదు… లైట్లు వేయాలనే ఆలోచన రాదు.

35
చిన్న గదిని పెద్దగా చూపించే ట్రిక్

హూటల్ రూంలో బెడ్ కు ఎదురుగా మిర్రర్ ఉంచడానికి మరో రీజన్ కూడా ఉంది. ఈ మిర్రర్  చిన్న సైజులో ఉన్న హోటల్ గదులను కూడా విశాలంగా చూపించడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇంటీరియర్ డిజైనర్లు ఈ ట్రిక్ వాడతారు. అద్దం గదిని ప్రతిబింబిస్తుంది… దీనివల్ల చిన్న గది కూడా చూసేవారికి చాలా పెద్దదిగా, విశాలంగా అనిపిస్తుంది. ఇది టూరిస్టులకు మానసికంగా మంచి ఫీలింగ్‌ను ఇస్తుంది.

45
హోటల్ రూంలోని అద్దాన్ని ఎలా చెక్ చేయాలి?

అయితే ఇలా బెడ్ కు ఎదురుగా అద్దం ఉండటంవల్ల లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. హోటల్ రూమ్‌లలో భద్రత చాలా ముఖ్యం… అక్కడ ఉన్నది మామూలు అద్దమా లేక దృశ్యాలను రికార్డ్ చేసే 'టూ-వే మిర్రర్' (Two-way mirror) ఆ అనేది చెక్ చేసుకోవడం చాలా అవసరం.

అద్దాన్ని టెస్ట్ చేయడానికి మీ వేలిని దానిపై ఉంచండి. మీ వేలి కొనకు అద్దంలోని ప్రతిబింబానికి మధ్య కొంచెం 'గ్యాప్' ఉంటే,అది సాధారణ అద్దం. ఒకవేళ గ్యాప్ లేకుండా మీ వేలు, ప్రతిబింబం ఒకదానికొకటి తాకుతున్నట్లు అనిపిస్తే అది 'టూ-వే మిర్రర్' అని అర్థం. అలాంటి సందర్భంలో వెంటనే అప్రమత్తం అవ్వాలి.

55
బెడ్ కు ఎదురుగా మిర్రర్ ఉంటే అశుభమా?

చైనీస్ వాస్తు శాస్త్రమైన ఫెంగ్ షుయ్ ప్రకారం… పడుకునే బెడ్‌కు ఎదురుగా అద్దం పెట్టడం మంచిది కాదు. ఇది గదిలో నెగెటివ్ ఎనర్జీని పెంచి, ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తుందని చెబుతారు. అంతేకాదు అర్థరాత్రి మెలకువ వచ్చినప్పుడు అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసి ఒక్క క్షణం భయపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అక్కడ బెడ్ కు ఎదురుగా అద్దం ఉండదు.. కానీ ఇండియాలో ఇలాగే ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories