Goa Horror: గోవా ట్రిప్‌కు వెళుతున్నారా? అయితే ఈ భయంకర ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ఆరుగురు స్నేహితులకు గోవా హోటల్‌లో జరిగిన వింత ఘటనలు ఎంతో భయపెట్టాయి. వారి స్నేహితుడి ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయి,
గోవా ట్రిప్ వెళ్లాలని ఎంతోమంది యువత కోరుకుంటారు. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి ఇదే బెస్ట్ ప్లేస్ అని భావిస్తారు. కానీ కర్ణాటకలోని విజయపురకు చెందిన కొంతమంది స్నేహితులకు మాత్రం గోవా ట్రిప్ పీడకలగా మారిపోయింది. నర్సింగ్ స్టూడెంట్ సచిన్, తన ఐదుగురు ఫ్రెండ్స్‌తో కలిసి 2024 డిసెంబర్‌లో కారులో గోవాకు బయల్దేరాడు. కొల్హాపూర్, గగన్‌బవడ ఘాట్ రోడ్డులో వెళ్తుండగా, అర్ధరాత్రి రెండుసార్లు వాళ్ల కారు ముందు అకస్మాత్తుగా పెద్ద బండరాళ్లు పడ్డాయి. వాటిని తప్పించుకుని కారును ముందుకే పోనిచ్చాడు. అవి అనుకోకుండా కలిగిన అవాంతరాలుగానే కనిపించాయి.
23
కారుపై రాతలు
అలా కారులో వెళుతూ మధ్యలో కంకవళి దగ్గర ఓ హోటల్‌లో ఆ రాత్రి ఉన్నారు. పొద్దున లేచి చూసేసరికి కారు బానెట్‌పై నల్ల రంగులో 'మీరందరూ చచ్చిపోతారు' అని రాసి ఉంది. మొదట ఎవరో ఆటపట్టించడానికి ఇలా రాసి ఉంటారని అనుకున్నారు. ఆ విషయం కూడా వారు పట్టించుకోలేదు. కాన అదే రోజు రాత్రి వాళ్లతో పాటూ వచ్చిన ఒక స్నేహితులు మోహన్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అసలు మాంసం తినని మోహన్, తనకు చికెన్ కావాలని గొడవ పెట్టాడు. ఫ్రెండ్స్‌తో తీవ్రంగా వాదించాడు. చాల వింత వింతగా మాట్లాడడం మొదలుపెట్టాడు. విపరీతమైన కోపాన్ని చూపిస్తూ గొడవకు దిగాడు. ఒక మనిషికి ఉండే బలం కన్నా ఎక్కువ శక్తితో వస్తువులను సులువుగా ఎత్తడం ప్రారంభించాడు. హోటల్ రూమ్‌లోని ఓ పాత ఫోటోను చూస్తూ గంటల తరబడి ఏడుస్తూ ఉండిపోయారు. ఆ రూమ్ లో ఉండాలనని పట్టుబట్టాడు. దీంతో మిగతా స్నేహితులు స్థానిక సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకున్నారు.
33
రూమ్ 106.. వీడని మిస్టరీ!
ఆ తర్వాత స్థానికులు వారికి అసలు నిజాన్ని చెప్పారు. వారు బస చేసిన అదే రూమ్‌లో హోటల్ యజమాని కొడుకు అనుమానాస్పదంగా చనిపోయాడని గార్డు చెప్పాడు. ఆ గది నెంబర్ 106. విషయం తెలిశాక స్థానికుల సాయంతో మోహన్ ను మిగతా స్నేహితులు ఓ తాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లి పూజ చేయించి తాయెత్తు కట్టించారు. తరువాత మోహన్ మామూలు మనిషి అయ్యాడు. అసలు ఇది నిజంగా దెయ్యం పనేనా? లేక మానసిక ఒత్తిడి వల్ల ప్రవర్తనలో వచ్చిన మార్పులా? అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం దొరకలేదు. కానీ ఆ ఆరుగురు స్నేహితులకు మాత్రం ఈ ట్రిప్ జీవితంలో మర్చిపోలేని పీడకలగా ఉండిపోయింది.